
తుపాను ధాటికి కుప్పకూలిన ఐస్ బర్గ్
బ్యూనోస్ ఎయిర్స్, అర్జెంటినా : అర్జెంటినాలో యూనెస్కో వారసత్వ సంపదగా భాసిల్లుతున్న ఐస్ బ్రిడ్జి ఆదివారం కుప్పకూలింది. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో వేల మంది ప్రాణాలకు అపాయం తప్పింది.
పెంటగోనియా ప్రాంతంలో గల లాస్ గ్లేసిరేస్ జాతీయ పార్కులో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు బ్రిడ్జి ఉంది. సోమవారం బ్రిడ్జిని సందర్శించి, దానిపై నడిచి వెళ్లేందుకు వేలాది మంది యాత్రికులు పార్కుకు రావాల్సివుంది.
అయితే, ఆదివారం అర్థరాత్రి సమయంలో వచ్చిన భారీ తుపాను ధాటికి బ్రిడ్జి కుప్పకూలిపోయింది. చివరిసారిగా 2004లో ఈ మంచు బ్రిడ్జి కుప్పకూలినట్లు లాస్ గ్లేసిరేస్ జాతీయ పార్కులోని గ్లేసిరీయమ్ మ్యూజియం డైరెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment