వాషింగ్టన్: మూడు దశాబ్దాల క్రితం అపహరణకు గురైన గిల్‌గమేశ్ అనే ఇరాక్ పురాణ ఇతిహస కథలకు సంబంధించిన శిలాశాసనాన్ని(టాబ్లెట్) వాషింగ్టన్ వేడుకల సందర్భంగా అమెరికా తిరిగి ఇరాక్‌కి అందజేసింది. ఈ మేరకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ ఆ టాబ్లెట్‌ని స్వీకరించారు. దీంతో ఇరాక్ సమాజం పట్ల నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించగలిగమంటూ... హర్షం వ్యక్తం చేశారు.
(చదవండి: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!)
చిన్నపరిమాణంలో ఉన్న పురాతన రాతి శాసనం(టాబ్లెట్) అయినప్పటికీ, ఇది అత్యంత విలువైన చారిత్రక కళా సాంస్కృతిక సంపదగా హజీమ్ పేర్కొన్నార. అంతేకాదు అత్యంత పురాతన సాహిత్య రచనలలో ఒకటిగా పరిగణించే గిల్‌గమేశ్ ఇతిహాసానికి సంబంధించిందని చెప్పారు. ఇది అమరత్వం కోసం తపనతో ఉన్న మొసపటోమియో రాజు కథను వివరిస్తోందన్నారు. అన్నిమతాల సారాంశం ఏకేశ్వరోపాసన(ఒక్కడే దేవుడు అనే సిద్ధాంతం)ని గురించి నొక్కి చెప్పేలా ఉంటుందని యునెస్కో(ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సమితి) డైరెక్టర్ ఆండ్రీ అజౌలే అన్నారు.
ఈ ఇతిహసం మానవత్వానికి నిధిగా ఆండ్రీ అజౌలే అభివర్ణించారు. ఈ రాతి శాసనాన్ని(టాబ్లెట్) తన స్వస్థానానికి చేర్చటంతో వారసత్వాన్ని నాశనం చేసే అంతర్జాతీయ సమాజంపై సాధించిన ప్రధాన విజయంగా ఆమె పేర్కొన్నారు. ఇది ఇతిహాసాల సారాంశాన్ని తెలియజేసే శాసనం(టాబ్లెట్) అని యూఎస్ అసిస్టెంట్ అటర్నరీ జనరల్ కెన్నిత్ పోలిట్ అన్నారు.
1991లో గల్ఫ యుద్ధంలో ఈ శాసనం ఇరాక్ మ్యూజియం నుంచి అపహరణకు గురై తిరిగి మళ్లీ బ్రిటన్‌లో కనిపించింది. లండన్‌కి చెందిన జోర్డాన్ కుటుంబం నుంచి అమెరికన్ ఆర్ట్ డీలర్ ఈ టాబ్లెట్‌ని కొనుగోలు చేశాడు. 2007లో దీన్ని తప్పుడు ధృవీకరణ పత్రంతో విక్రయించారు. తదనంతరం మరోసారి 2014లో క్రాఫ్ట్ చైన్ యజమాని హబీ లాబీ, నుంచి వాషింగ్టన్ లోని బైబిల్ మ్యూజియంలో రాయిని ప్రదర్శించాలనుకునే ఫండమెంటలిస్ట్ క్రైస్తవులకు విక్రయించారు. 2017లో ఈ టాబ్లెట్ అసంపూర్ణంగా ఉందని ఆందోళన చెందారు. ఆ తర్వాత 2019లో దీనిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
ఈ తరుణంలో అపహరణకు గురైన పురాతన కాలంనాటి వారసత్వ సంపదలను వెలికితీయాలంటూ ప్రపంచదేశాలకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ పిలుపునిచ్చారు. అంతేకాదు అన్ని యూనివర్సిటీలు, మ్యూజియంలు, ఇనిస్టిట్యూట్‌లు పురాతన వస్తువులు సేకరించే వారు వారసత్వ సంపద అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేలా అందరూ కృషి చేయాలన్నారు నజీమ్. గత నెలలో చిన్న చిన్న పరిమాణంలోని 17 వేల పురాతన కళాఖండాలు ఇరాక్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముక్కలు ఎక్కువగా దాదాపు 4వేల సంవత్సరాల క్రితంలోని సుమేరియన్ కాలం నాటివి.
Comments
Please login to add a commentAdd a comment