cultural minister for state
-
పర్యాటకులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా చారిత్రక ప్రదేశాల్లో ఫ్రీ ఎంట్రీ!
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పర్యాటకులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలను ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖ. భారత్‌ను అమృత కాలంలోకి తీసుకెళ్లేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉపయోగపడుతుందని పేర్కొంది. చరిత్రను స్మరించుకుంటూ సంస్కృతి, వారసత్వాన్ని గుర్తు చేస్తూ బంగారు భవిష్యత్తుకు మార్గం వేసేందుకు సాయపడుతుందని పేర్కొంది. 2021, మార్చి 12న గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ఫ్రీడమ్ మార్చ్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృతి మహోత్సవంలోని కార్యక్రమాల వివరాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమం 2023, ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. అనంతరం మహాత్మాగాంధీ సహా.. స్వాతంత్య్ర సమర యోధులకు నివాళులర్పించారు. 𝗙𝗿𝗲𝗲 𝗘𝗻𝘁𝗿𝘆 𝗔𝘁 𝗔𝗹𝗹 𝗠𝗼𝗻𝘂𝗺𝗲𝗻𝘁𝘀 (𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟱-𝟭𝟱): As part of 'Azadi ka #AmritMahotsav' and 75th I-Day celebrations, @ASIGoI has made Entry Free for the visitors/tourists to all its protected monuments/sites across the country, from 5th -15th August, 2022 pic.twitter.com/NFuTDdCBVw — G Kishan Reddy (@kishanreddybjp) August 3, 2022 ఇదీ చదవండి: ఎన్నో ఉద్యోగాలు వదులుకున్నాడు.. చివరికి అరకోటి ప్యాకేజీతో షాకిచ్చాడు! -
అపహరణకు గురైన ఇరాక్ పురాతన శాసనాన్ని తిరిగి ఇచ్చేశాం!
వాషింగ్టన్: మూడు దశాబ్దాల క్రితం అపహరణకు గురైన గిల్గమేశ్ అనే ఇరాక్ పురాణ ఇతిహస కథలకు సంబంధించిన శిలాశాసనాన్ని(టాబ్లెట్) వాషింగ్టన్ వేడుకల సందర్భంగా అమెరికా తిరిగి ఇరాక్‌కి అందజేసింది. ఈ మేరకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ ఆ టాబ్లెట్‌ని స్వీకరించారు. దీంతో ఇరాక్ సమాజం పట్ల నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించగలిగమంటూ... హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!) చిన్నపరిమాణంలో ఉన్న పురాతన రాతి శాసనం(టాబ్లెట్) అయినప్పటికీ, ఇది అత్యంత విలువైన చారిత్రక కళా సాంస్కృతిక సంపదగా హజీమ్ పేర్కొన్నార. అంతేకాదు అత్యంత పురాతన సాహిత్య రచనలలో ఒకటిగా పరిగణించే గిల్గమేశ్ ఇతిహాసానికి సంబంధించిందని చెప్పారు. ఇది అమరత్వం కోసం తపనతో ఉన్న మొసపటోమియో రాజు కథను వివరిస్తోందన్నారు. అన్నిమతాల సారాంశం ఏకేశ్వరోపాసన(ఒక్కడే దేవుడు అనే సిద్ధాంతం)ని గురించి నొక్కి చెప్పేలా ఉంటుందని యునెస్కో(ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సమితి) డైరెక్టర్ ఆండ్రీ అజౌలే అన్నారు. ఈ ఇతిహసం మానవత్వానికి నిధిగా ఆండ్రీ అజౌలే అభివర్ణించారు. ఈ రాతి శాసనాన్ని(టాబ్లెట్) తన స్వస్థానానికి చేర్చటంతో వారసత్వాన్ని నాశనం చేసే అంతర్జాతీయ సమాజంపై సాధించిన ప్రధాన విజయంగా ఆమె పేర్కొన్నారు. ఇది ఇతిహాసాల సారాంశాన్ని తెలియజేసే శాసనం(టాబ్లెట్) అని యూఎస్ అసిస్టెంట్ అటర్నరీ జనరల్ కెన్నిత్ పోలిట్ అన్నారు. 1991లో గల్ఫ యుద్ధంలో ఈ శాసనం ఇరాక్ మ్యూజియం నుంచి అపహరణకు గురై తిరిగి మళ్లీ బ్రిటన్‌లో కనిపించింది. లండన్‌కి చెందిన జోర్డాన్ కుటుంబం నుంచి అమెరికన్ ఆర్ట్ డీలర్ ఈ టాబ్లెట్‌ని కొనుగోలు చేశాడు. 2007లో దీన్ని తప్పుడు ధృవీకరణ పత్రంతో విక్రయించారు. తదనంతరం మరోసారి 2014లో క్రాఫ్ట్ చైన్ యజమాని హబీ లాబీ, నుంచి వాషింగ్టన్ లోని బైబిల్ మ్యూజియంలో రాయిని ప్రదర్శించాలనుకునే ఫండమెంటలిస్ట్ క్రైస్తవులకు విక్రయించారు. 2017లో ఈ టాబ్లెట్ అసంపూర్ణంగా ఉందని ఆందోళన చెందారు. ఆ తర్వాత 2019లో దీనిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో అపహరణకు గురైన పురాతన కాలంనాటి వారసత్వ సంపదలను వెలికితీయాలంటూ ప్రపంచదేశాలకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ పిలుపునిచ్చారు. అంతేకాదు అన్ని యూనివర్సిటీలు, మ్యూజియంలు, ఇనిస్టిట్యూట్లు పురాతన వస్తువులు సేకరించే వారు వారసత్వ సంపద అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేలా అందరూ కృషి చేయాలన్నారు నజీమ్. గత నెలలో చిన్న చిన్న పరిమాణంలోని 17 వేల పురాతన కళాఖండాలు ఇరాక్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముక్కలు ఎక్కువగా దాదాపు 4వేల సంవత్సరాల క్రితంలోని సుమేరియన్ కాలం నాటివి. (చదవండి: పియానో బామ్మ కొత్త ఆల్బమ్.. 107లో సిక్సర్) -
ఆ ప్రధాని పేరు.. మెక్ కల్లమ్ అట!
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత దేశంలో పర్యటిస్తోంది. టీమిండియాతో టెస్టు సిరీస్ ముగించుకుని వన్డే సిరీస్ ఆడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అదే దేశ ప్రధానమంత్రి జాన్ కీ కూడా మన దేశంలో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య పర్యాటక సంబంధాల గురించి ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇదే సమావేశంలో మన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ కూడా పాల్గొన్నారు. ఈయన క్రికెట్ మ్యాచ్‌లు మరీ ఎక్కువగా చూస్తున్నారో ఏమో గానీ, ఆ దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి మాట్లాడబోయి.. ''హిజ్ ఎక్సలెన్సీ ప్రైమ్ మినిస్టర్ మెక్ కల్లమ్' అని సంబోధించారు. అది కూడా ఒకసారి కాదు.. రెండుసార్లు అలా అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దాని గురించి మాట్లాడుకుంటూ బిజీ అయిపోయారు. న్యూజిలాండ్‌కు పర్యాటక రాయబారి అయిన బాలీవుడ్ స్టార్ సిద్దార్థ మల్హోత్రా మంత్రిగారి చెవిలో ఈ విషయాన్ని ఊదాడు. అయితే న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ మాత్రం ఈ విషయాన్ని పెద్దంత సీరియస్‌గా పట్టించుకోలేదు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య డైరెక్ట్ విమానం నడిపిస్తే రెండు దేశాల పర్యాటకులకు బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సదస్సుకు వచ్చినవారికి అచ్చమైన భారతీయ శైలిలో 'నమస్తే.. సత్ శ్రీ అకాల్' అంటూ ఆయన వందనాలు పలికారు. సిద్దార్థ మల్హోత్రా లాంటి యువ నటులు తమ దేశ పర్యాటక రాయబారి కావడం పట్ల సంతోషం ప్రకటించారు. భారత దేశం నుంచి ప్రతియేటా 43 వేల మంది న్యూజిలాండ్ సందర్శనకు వస్తున్నారని చెబుతూ, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.