గతంతో పోలిస్తే భారత దేశంలో పీహెచ్డీ డిగ్రీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమెరికా, చైనాలతో పోలిస్తే ఈ విషయంలో ఇంకా మనం వెనకబడే ఉన్నప్పటికీ.. గతంతో పోలిస్తే మాత్రం చాలా మెరుగుపడినట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. 2008-09 సంవత్సరంలో ఇచ్చిన పీహెచ్డీల కంటే 2011-12 సంవత్సరంలో ఇచ్చిన డిగ్రీలు దాదాపు 50 శాతం పెరిగాయి.
యునెస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటస్టిక్స్ సేకరించిన సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రచురించిన పరిశోధన గ్రంథాలలో భారత వాటా 2002లో 26వేలు మాత్రమే ఉండగా, 2007 నాటికి అది 44వేలకు పెరిగింది. అయినప్పటికీ ఇది అమెరికా, చైనా లాంటి దేశాలతో పోలిస్తే తక్కువేనట. యేల్ యూనివర్సిటీ తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలో 2007లో 41,464 పీహెచ్డీలు ప్రదానం చేయగా, చైనాలో అదే సమయంలో ఏకంగా 48,112 పీహెచ్డీలు ఇచ్చారు.
భారత్లో పెరుగుతున్న పీహెచ్డీల సంఖ్య
Published Fri, Aug 9 2013 5:12 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement