ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కి బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్‌కు చేరుకోవడం చారిత్రాత్మకం. ఈసందర్భంగా ఈ వందవ ఎపిసోడ్‌ని ఇండియాలోని వివిధ భాషలతో సహా 11 విదేశీ భాషల్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారత్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రసారమైంది. ఈ నేపథ్యంలో యునెస్కో చీఫ్ ఆడ్రీ అజౌలే మోదీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మోదీని పలు ప్రశ్నలు అడిగారు. 2030 నాటికి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలనే యునెస్కో లక్ష్యం గురించి అజౌలే మోదీతో మాట్లాడారు.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ అనుసరించే మార్గం ఏమిటని మోదీని ప్రశ్నించారు. అందుకు మోదీ బదులిస్తూ..విద్యను అందించడంలో నిస్వార్థంగా పనిచేసిన వారి పేర్లను మోదీ గుర్తు చేస్తుకున్నారు. ఈ మేరకు దివంగత డి ప్రకాశ్ రావుని గుర్తుతెచ్చుకుంటూ..ఆయన టీ అమ్మేవాడు. నిరుపేద పిల్లలను చదివించడమే అతని జీవిత లక్ష్యం అని చెప్పారు. అలాగే జార్ఖండ్ గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీని నిర్వహిస్తున్న సంజయ్ కశ్యప్ , కోవిడ్-19 సమయంలో ఇ లెర్నింగ్ ద్వారా పిల్లలకు సహాయం చేసిన హేమలత గురించి మాట్లాడారు మోదీ.
ఇంకా అజౌల్ ఈ ఏడాది భారత్ నేతృత్వంలోని జీ 20 శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడుతూ..అతర్జాతీయా ఎజెండాలో దేశ సంస్కృతి, విద్యను మోదీ ఎలా అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లబోతున్నారనే దాని గురించి కూడా అడిగారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతికి పరిరక్షణ, విద్య రెండూ ఇష్టమైన అంశాలుగా నిలిచాయి. అది లక్ష్యద్వీప్‌లోని కుమ్మెల్ బ్రదర్స్ చాలెంజర్ క్లబ్ లేదా కర్ణాటక కావెంశ్రీకీ కళా చేతన్ మంచ్ కూడా కావచ్చు అన్నారు.
అలాగే దేశం నలుమూలల నుంచి ప్రజలు లేఖలు ద్వారా అలాంటి వాటి గురించి తెలియజేశారు. అందులో భాగంగా మేము రంగోలి, దేశ భక్తిగీతాలు, లాలి పాటలు కంపోజ్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమం వల్లే విభిన్న ప్రపంచ సంస్కృతిని మరింత సుసంపన్నం చేయాలనే సంకల్పం బలపడిందని మోదీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment