globally
-
ఏకంగా 5,600 మందిని తీసేసిన ఆ టెక్ కంపెనీ..!
-
2024లో భారీగా ఐటి ఉద్యోగాల కోత
-
నాణ్యమైన విద్యను అందించడంలో భారత్ విధానం: యునెస్కో ఛీఫ్
ప్రధాని నరేంద్ర మోదీ మన్కి బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్‌కు చేరుకోవడం చారిత్రాత్మకం. ఈసందర్భంగా ఈ వందవ ఎపిసోడ్‌ని ఇండియాలోని వివిధ భాషలతో సహా 11 విదేశీ భాషల్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారత్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రసారమైంది. ఈ నేపథ్యంలో యునెస్కో చీఫ్ ఆడ్రీ అజౌలే మోదీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మోదీని పలు ప్రశ్నలు అడిగారు. 2030 నాటికి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలనే యునెస్కో లక్ష్యం గురించి అజౌలే మోదీతో మాట్లాడారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ అనుసరించే మార్గం ఏమిటని మోదీని ప్రశ్నించారు. అందుకు మోదీ బదులిస్తూ..విద్యను అందించడంలో నిస్వార్థంగా పనిచేసిన వారి పేర్లను మోదీ గుర్తు చేస్తుకున్నారు. ఈ మేరకు దివంగత డి ప్రకాశ్ రావుని గుర్తుతెచ్చుకుంటూ..ఆయన టీ అమ్మేవాడు. నిరుపేద పిల్లలను చదివించడమే అతని జీవిత లక్ష్యం అని చెప్పారు. అలాగే జార్ఖండ్ గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీని నిర్వహిస్తున్న సంజయ్ కశ్యప్ , కోవిడ్-19 సమయంలో ఇ లెర్నింగ్ ద్వారా పిల్లలకు సహాయం చేసిన హేమలత గురించి మాట్లాడారు మోదీ. ఇంకా అజౌల్ ఈ ఏడాది భారత్ నేతృత్వంలోని జీ 20 శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడుతూ..అతర్జాతీయా ఎజెండాలో దేశ సంస్కృతి, విద్యను మోదీ ఎలా అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లబోతున్నారనే దాని గురించి కూడా అడిగారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతికి పరిరక్షణ, విద్య రెండూ ఇష్టమైన అంశాలుగా నిలిచాయి. అది లక్ష్యద్వీప్‌లోని కుమ్మెల్ బ్రదర్స్ చాలెంజర్ క్లబ్ లేదా కర్ణాటక కావెంశ్రీకీ కళా చేతన్ మంచ్ కూడా కావచ్చు అన్నారు. అలాగే దేశం నలుమూలల నుంచి ప్రజలు లేఖలు ద్వారా అలాంటి వాటి గురించి తెలియజేశారు. అందులో భాగంగా మేము రంగోలి, దేశ భక్తిగీతాలు, లాలి పాటలు కంపోజ్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమం వల్లే విభిన్న ప్రపంచ సంస్కృతిని మరింత సుసంపన్నం చేయాలనే సంకల్పం బలపడిందని మోదీ చెప్పారు. (చదవండి: మన్ కీ బాత్ @100.. మోదీ కామెంట్స్ ఇవే..) -
మరోసారి సంచలనం సృష్టించిన షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ మరో సంచలనాన్ని సృష్టించింది. 2021 జూన్ నెలలో మొట్టమొదటి సారిగా ప్రపంచంలోనే నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షావోమీ నిలిచింది. ఈ ఏడాది జూన్ మాసంలో షావోమీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్ఫోన్లను విక్రయించింది. డేటా పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ ప్రకారం ఆఫ్రికా, చైనా, యూరోప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను విస్తరించడంతో అమ్మకాలు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. షావోమీ సంస్థను 2010లో స్థాపించగా కంపెనీ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ను 2011 సంవత్సరంలో విడుదల చేసింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా షావోమీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. షావోమీ అమ్మకాలు మే నెలతో పోలిస్తే జూన్ నెలలో గణనీయంగా 26 శాతం పెరిగాయి. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల పరంగా షావోమీ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు 17.1 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది. షావోమీ బ్రాండ్ తరువాత ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ 15.7 శాతం, ఆపిల్ 14.3 శాతం వాటాలను సొంతం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అత్యధిక అమ్మకాలు జరిపిన రెండో బ్రాండ్‌గా షావోమీ నిలిచింది. షావోమీ ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఆఫ్రికా, చైనా, యూరప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో హువావే స్మార్ట్‌ఫోన్ వెనక్కి తగ్గడంతో ఆ గ్యాప్‌ను షావోమీ భర్తీ చేసిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరక్టర్ తరుణ పాఠఖ్ వెల్లడించారు. జూన్ నెలలో చైనా, యూరప్, మిడిల్ ఈస్ట్, భారత మార్కెట్లలో షావోమీ స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వియత్నాంలో కోవిడ్-19 వేవ్ రాకతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి కూడా దెబ్బతింది. ఈ కారణంగానే శాంసంగ్ వెనుకబడి ఉండవచ్చునని కౌంటర్‌పాయింట్ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. -
ఎక్కడండీ.. ఏటీఎం?
సాక్షి, బిజినెస్ విభాగం: పెద్ద నోట్ల రద్దు తర్వాత మూగబోయిన ఏటీఎంలు ఆ తర్వాత కాలంలో వినియోగంలోకి వచ్చినా కానీ, ఎందుకో గతంలో మాదిరిగా విరివిగా అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తరవాత గత రెండు సంవత్సరాల కాలంలో నగదు లావాదేవీలు పెరిగిపోగా, ఏటీఎంల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆర్బీఐ తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. బ్రిక్స్ దేశాల్లో ఒక్క భారత్‌లోనే లక్ష మంది ప్రజలకు అతి తక్కువ ఏటీఎంలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. ఇటీవలి కాలంలో ఏటీఎంల సంఖ్య తగ్గిపోవటానికి అసలు కారణం వాటిపై బ్యాంకులు చేస్తున్న ఖర్చులు పెరిగిపోవటమేనని తెలుస్తోంది. ఆర్బీఐ నిర్దేశించిన కఠిన నియమ, నిబంధనలకు తోడు... లావాదేవీలకు అవుతున్న చార్జీలను కస్టమర్ల నుంచి పూర్తి స్థాయిలో రాబట్టుకోలేకపోవడం, ఏటీఎం కేంద్రం నిర్వహణ, సెక్యూరిటీ ఖర్చు వెరసి బ్యాంకులకు ఆర్థికంగా భారం కావడంతో, దాన్ని తగ్గించుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. గతేడాది సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్ల ఆధునికీకరణ కోసం ఆర్బీఐ ఆదేశించడం వల్ల ఏటీఎంల నిర్వహణ వ్యయం పెరిగిపోయింది. దీంతో రానున్న కాలంలోనూ ఏటీఎంల క్షీణత ఉంటుందని అంచనా. పెరిగిన వినియోగం... ‘‘ఏటీఎంల సంఖ్య తగ్గడం ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా పిరమిడ్‌లో సామాజిక, ఆర్థికంగా దిగువవైపున ఉండే వారిపై ఈ ప్రభావం ఉంటుంది’’ అని ఏటీఎం మెషీన్ల సరఫరా కంపెనీ హిటాచి పేమెంట్ సర్వీసెస్ ఎండీ రస్టోమ్ ఇరానీ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఏటీఎంల విస్తరణ చాలా తక్కువగా ఉందని ఇరానీ పేర్కొన్నారు. వ్యయాలు పెరిగిపోవటమనేది ఏటీఎంల నిర్వహణపై బ్యాంకులను ఆలోచనల్లో పడేస్తోంది. ఎందుకంటే లావాదేవీలపై విధించే ఫీజు ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటోంది. పరిశ్రమ కమిటీ ఆమోదం లేనిదే ఈ ఫీజులను పెంచే పరిస్థితి లేదు. బ్యాంకులు, థర్డ్ పార్టీ సంస్థలు మన దేశంలో ఏటీఎంలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్చేంజ్ ఫీజుగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో నగదు ఉపసంహరణ లావాదేవీపై ఇవి రూ.15ను వసూలు చేస్తున్నాయి. ఇంటర్చేంజ్ ఫీజు ఏటీఎంల వృద్ధి ఆగిపోవడానికి ప్రధాన కారణమని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ తెలిపారు. బ్యాంకులు తాము సొంతంగా ఏటీఎంలను నిర్వహించడం కంటే వేరే బ్యాంకులకు ఇంటర్చేంజ్ ఫీజు చెల్లించడం చౌకగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఫీజులను పెంచడం పరిష్కారమని అందరూ భావించడం లేదని, ఒకవేళ ఫీజులు పెంచితే ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్లకే బదిలీ చేస్తాయని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సీఈవో ఆర్.సుబ్రమణ్యకుమార్ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు మోదీ సర్కారు చేపట్టిన డీమోనిటైజేషన్ లక్ష్యాల్లో డిజిటల్ లావాదేవీల పెంపు కూడా ఒకటి. మోదీ సర్కారు చేపట్టిన జన్‌ధన్ యోజన తదితర కార్యక్రమాల ఫలితంగా 2014 తర్వాత 35 కోట్ల మందికి పైగా కొత్తగా బ్యాంకు సేవలకు అనుసంధానమయ్యారు. దీంతో ఏటీఎం వంటి కనీస ఆర్థిక సేవల అందుబాటు కీలకంగా మారింది. ఏటీఎంల సంఖ్య తగ్గుముఖానికి ఇతర అంశాలూ కనిపిస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణ మరో ప్రధాన అంశం. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం కూడా ఏటీఎంలు తగ్గడానికి కారణం. ఇక దేశంలోని ప్రతి రెండు ఏటీఎంలలో ఒకటి బ్యాంకు శాఖల వద్ద ఉన్నదే. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ 2018 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఏకంగా 1,000 ఏటీఎంలను తగ్గించుకోవడం గమనార్హం. డిజిటలైజేషన్ పెరిగిపోవడం, మొబైల్, ఇంటర్నెట్ వ్యాప్తి సామాన్యులకూ చేరువ కావడంతో భవిష్యత్తులో బ్యాంకులు శాఖలపై ఆధారపడడం తగ్గిపోనుందని ఎస్బీఐ ఎండీ దినేష్‌కుమార్ ఖరా తెలిపారు. మొబైల్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్న ఖాతాదారులు పెరుగుతున్నట్టు ఫెడరల్‌బ్యాంకు సీఎఫ్‌వో అశుతోష్‌ఖజూరియా తెలిపారు. గత ఐదేళ్లలో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు 65% పెరిగాయి. మొబైల్ బ్యాం కింగ్ జోరుతో ఏటీఎంల సంఖ్య ఇక ముందూ తగ్గనుందనేది పరిశ్రమ వర్గాల అంచనా. -
భారీ మొత్తంలో ఆడి కార్ల రీకాల్
ఫ్రాంక్ఫర్ట్: జర్మనీ కార్ మేకర్ ఆడి భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షల 50 వేల డీజిల్ కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కార్ల ఉద్గారాల వృద్ధికిగాను కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడా మినహా ప్రపంచ వ్యాప్తంగా ఆరు సిలిండర్ల , ఎనిమిది-సిలిండర్ డీజిల్ ఇంజిన్ల కార్లను రీకాల్ చేస్తోంది. ఈయూ5, ఈయూ6 డీజిల్ ఇంజిన్లతో ఉన్న కార్ల కోసం "రెట్రోఫైట్ ప్రోగ్రాం" ఆఫర్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఫోక్స్ వ్యాగన్ సబ్సిడరీ గాఉన్న ఆడి కర్బన ఉద్గారాల కుంభకోణంలో ఆరోపణలుఎదుర్కొంటున్న ఆడి ఈ పరిహార కార్యక్రమాన్ని కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది. ఈ రీకాల్ ద్వారా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మొత్తం ఉద్గారాలు తగ్గించేందుకు, అలాగే డీజిల్ ఇంజన్ల భవిష్యత్తులో సాధ్యత నిర్వహించాలని ఆడి భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఇదే కారణంగా, మరో జర్మన్ కార్ల తయారీ సంస్థ, ఆటోమొబైల్ దిగ్గజం డైమ్లెర్ ఏజీ కూడా "డీజిల్ ఇంజిన్లు సమగ్ర ప్రణాళిక’’ లో భాగంగా యూరోప్ అంతటా మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్, మూడు మిలియన్లకు పైగా డీజిల్ కార్లు రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఆడి, డైమ్లెర్ రెండూ కర్బన ఉద్గారాల కుంభకోణంలో నిందిత కంపెనీలే. ఉద్గార పరీక్షల్లో మోసం చేయడానికి ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ఉపయోగించాన్న ఆరోపణలున్నాయి. -
ఏటా వెయ్యి సినిమాలూ.. ఏ లాభం?
కోల్‌కతా: భారత్‌లో ఏటా 1000కిపైగా సినిమాలు నిర్మితమవుతున్నా.. అంతర్జాతీయంగా మనకు పెద్దగా గుర్తింపు లేదు. అంతర్జాతీయ మార్కెట్లో మన సినిమాకు ఉన్న ముద్ర చాలా చిన్నది. ఇదే అభిప్రాయన్ని ప్రముఖ అంతర్జాతీయ సినీ విశ్లేషకుడు, కైరో చిత్రోత్సవంలో భారత ప్రతినిధి గౌరంగ్ జలాన్ వ్యక్తం చేశారు. 'అంతర్జాతీయంగా చూసుకుంటే భారత ముద్ర చాలా పరిమితం. నిజానికి మనం వెయ్యికిపైగా సినిమాలు ప్రతి ఏడాది నిర్మిస్తున్నా.. మన సినిమాలు మనవాళ్లు, ప్రవాస భారతీయులకు తప్ప ఇతరులకు చేరడం లేదు. మనం అంతర్జాతీయ స్థాయి కథలపై ఫోకస్ చేయాల్సిన అవసరముంది. అంతర్జాతీయ ప్రేక్షకులపై మనం దృష్టి పెట్టాలి. ప్రపంచస్థాయి కథతో మనం వారికి కనెక్ట్ కాగలం' అని ఇటీవల కోల్‌కతాకు వచ్చిన ఆయన పీటీఐ వార్తాసంస్థతో తెలిపారు. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అయిన కైరో చిత్రోత్సవం 'దు ఫిలిం ద ఆమౌర్ దె మన్స్'లో ఈసారి భారత్ నుంచి రెండు చిత్రాలు 'మాంఝీ', 'రంగ్‌రసియా' మాత్రమే ఎంపికయ్యాయని ఆయన చెప్పారు. ఇటీవల మన చిత్రాలు విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పటికీ కంటెంట్ పరంగా ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరముందని, ఫ్రెంచ్, స్పానిష్ మాట్లాడే దేశాల్లో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కంటే ఫ్రెంచ్, స్పానిష్ సబ్ టైటిల్స్ తో మన చిత్రాలు ప్రదర్శిస్తే ఇంకా మెరుగ్గా ప్రేక్షకులకు రీచ్ కావచ్చునని ఆయన చెప్పారు. -
ప్రపంచ మెట్రోల్లో 2వ స్థానం ఢిల్లీ మెట్రో రైల్దే !!