యూనెస్కో రిపోర్టులు నిజమేనా? | ysrcp mp vijayasaireddy questions about UNESCO report | Sakshi
Sakshi News home page

యూనెస్కో రిపోర్టులు నిజమేనా?

Published Thu, Dec 8 2016 4:49 PM | Last Updated on Thu, May 24 2018 2:18 PM

యూనెస్కో రిపోర్టులు నిజమేనా? - Sakshi

యూనెస్కో రిపోర్టులు నిజమేనా?

న్యూఢిల్లీ: యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ 50 ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందని యూనెస్కో పేర్కొన్నట్లు కేంద్ర మానవవనరుల అభివద్ధి శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుష్వాహా వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా యూనెస్కో రిపోర్టులపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభలో ప్రశ్నించారు. 
 
ఎంపీ ప్రశ్నలకు స్పందించిన కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. యూనెస్కో రిపోర్టులపై ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
 
1. ఈ ఏడాది విడుదల చేసిన యూనెస్కో రిపోర్టుల్లో యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ యాభై ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందనే మాట నిజమేనా?
 
జవాబు: యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ 50ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందని యూనెస్కో ఇచ్చిన రిపోర్టు వాస్తవమే.
 
2. ప్రాథమిక విద్యను 2050కు, యూనివర్సల్ లోయర్ సెకండరీ ఎడ్యుకేషన్ ను 2060కు, యూనివర్సల్ అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్ ను 2085కు భారత్ అందుకుంటుందని యూనెస్కో పేర్కొందా?
 
జవాబు: ప్రాథమిక విద్యను 2050కు, సెకండరీ ఎడ్యుకేషన్(ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకూ)ను 2060కు, అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్(తొమ్మిది, పది తరగతులు)ను 2085కు అందుకుంటుందని యూనెస్కో పేర్కొన్నట్లు అంగీకరించారు.
 
3. 2030లోగా విద్యారంగంలో ప్రాథమిక మార్పులు చేస్తేనే విద్యారంగం స్ధిరత్వానికి వస్తుందనే రిపోర్టు కూడా నిజమేనా?
 
జవాబు: విద్యారంగంలో ప్రాథమిక మార్పులు కారణంగా స్ధిరత్వం ఏర్పడుతుందని గతంలో చేసిన సర్వేల ఆధారంగా యూనెస్కో చేసిన సూచన. ఇందులో మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రమేయం లేదు. 2009లో అమల్లోకి వచ్చిన ఉచిత, నిర్భంద విద్య చట్టం కింద కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ పేరిట ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ లెవల్స్ లో పిల్లలకు విద్యను అందిస్తోంది. యూనివర్సల్ ఎడ్యుకేషన్ గుర్తింపుకు తగినంత మంది విద్యార్థులకు ఈ చట్టం కింద విద్య అందుతోంది.
 
యూనెస్కో రిపోర్టు పాత ట్రెండ్స్ ఆధారంగా చేసింది. ప్రస్తుతం పరిస్ధితుల్లో యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను యూనెస్కో రిపోర్టుల కంటే ముందే భారత్ అందుకుంటుందనే భరోసా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement