
పారిస్ : విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునెస్కో హెడ్ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, ఫ్రాన్స్ మధ్య చిరకాల స్నేహం ఉందని అన్నారు. కాలానికి అతీతంగా ఇరుదేశాల మధ్య స్నేహం బంధం నిలిచి ఉందని పేర్కొన్నారు. ‘భారత్, ఫ్రాన్స్ దేశాలు పరస్పరం అభివృద్ధిని కోరుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య మధ్య చిరకాల స్నేహం ఉంది.
భారత్, ఫ్రాన్స్ సంబంధాలు ఈనాటికి కావు. మీ అందరినీ కలవడం నా అదృష్టం. రామభక్తి, దేశభక్తి, మహాత్మా గాంధీ భారత్‌కు ప్రతీక. కష్టనష్టాల్లో భారత్, ఫ్రాన్స్ పరస్పరం సహకరించుకుంటాయి. నవభారత్ నిర్మాణం కోసం మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఈజ్ ఆఫ్ డూయింగే కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్‌లోనూ భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గత ఐదేళ్లలో దేశంలో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి గర్వకారణం’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment