కాలగర్భంలోకి చైనా వాల్!
బీజింగ్: శతాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా నిలుస్తూ వచ్చిన చరిత్రాత్మక చైనా గోడ కాలగర్భంలో కలిసిపోతుందా? అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎప్పుడో క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో నిర్మించిన గ్రేట్ చైనా వాల్ క్రమేపీ అంతరించిపోతోంది. ఇప్పటికే ఈ చైనా వాల్ 30 శాతం మేర కుదించుకుపోయినట్లు తాజాగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్పష్టం చేసింది. ఇందుకు ప్రకృతి ప్రళయాలతో పాటు మితిమీరిన మానవ తప్పిదాలు కూడా కారణమేనని అంటున్నారు.
గ్రేట్ వాల్ నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలను ఇళ్లు కట్టుకోడానికి చోరీచేయడం వల్లే ఈ దుర్గతి దాపురించినట్లు తెలిపింది. దాదాపు 6,300 కిలోమీటర్ల పొడవున్న ఈ పురాతన చైనా వాల్ 1,962 కిలోమీటర్ల వరకూ కరిగిపోయిందని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆందోళన వ్యక్తం చేసింది.