యునెస్కో వారసత్వ జాబితాలో మానస సరోవరం | UNESCO includes Indian part of Kailash Mansarovar in world heritage sites | Sakshi
Sakshi News home page

యునెస్కో వారసత్వ జాబితాలో మానస సరోవరం

Published Tue, May 21 2019 8:26 AM | Last Updated on Tue, May 21 2019 8:28 AM

UNESCO includes Indian part of Kailash Mansarovar in world heritage sites - Sakshi

న్యూఢిల్లీ: భారత భూభాగంలోని మానస సరోవర్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన అనుబంధ సంస్థ ‘యునెస్కో’ అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్‌లో భారత పురావస్తు విభాగం పంపిన ప్రతిపాదనలపై ఈ మేరకు ఆమోదముద్ర లభించినట్లు వివరించింది. కైలాస సరోవర్‌ ప్రాంతంలో ఎక్కువ భాగం భారత్‌లో విస్తరించి ఉండగా... మిగతా భాగం తూర్పున నేపాల్, ఉత్తరాన చైనా ఉంది. ఈ మూడు దేశాల్లో కలిపి 31 చ.కిలో మీటర్ల ప్రాంతంలో ఈ పవిత్రస్థలం ఉంది. తమ దేశాల్లోని ప్రాంతాలను కూడా వారసత్వ స్థలంగా గుర్తించాలని యునెస్కోకు చైనా, నేపాల్‌ ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement