ప్యారిస్: ప్రపంచవ్యాప్తంగా.. పాఠశాలల్లో, పాఠశాల దశలో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు వినియోగించడంపై నిషేధించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అధిక స్థాయి స్క్రీన్ సమయం పిల్లల భావోద్వేగాలపై ప్రభావం పడుతోందని.. వీటికి శాస్త్రీయంగానూ రుజువులు ఉన్నాయని విషయాన్ని సైతం తన నివేదికలో యునెస్కో పొందుపరిచింది.
‘‘డిజిటల్ విప్లవం శక్తివంతమైందే కావొచ్చు. కానీ, ముఖాముఖి బోధన అనేది పిల్లలకు చాలా అవసరం. ఆ అవసరాన్ని స్మార్ట్‌ఫోన్.. డిజిటల్ టెక్నాలజీ.. చివరకు ఏఐ సాంకేతికత ఎప్పటికీ భర్తీ చేయలేవని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అని యునెస్కో సూచించింది. కరోనా టైంలో కోట్ల మంది డిజిటల్ ఎడ్యుకేషన్‌కి పరిమితం అయ్యారని తెలిసిందే. కానీ, అదే సమయంలో ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్న లక్షల మంది పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారని యునెస్కో గుర్తు చేస్తోంది. అలాగే.. ఇప్పటికీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కొనసాగించడాన్ని యునెస్కో తీవ్రంగా తప్పుబట్టింది.
విద్యాసంస్థల్లో సాంకేతికత వినియోగంపై చైనాను చూసి నేర్చుకోవాలని ప్రపంచానికి యునెస్కో సూచించింది. డిజిటల్ పరికరాలను బోధనా సాధనాలుగా ఉపయోగించడానికి చైనా సరిహద్దులను నిర్దేశించింది. మొత్తం బోధనా సమయంలో 30%కి పరిమితం చేసిందిని తెలిపింది. కరోనా టైంలో మాత్రమే చైనా ఆన్‌లైన్ విద్యను ప్రొత్సహించిందని.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక తిరిగి విద్యాసంస్థలకే రప్పించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా యునెస్కో ప్రత్యేకంగా ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment