కాబూల్: అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవుకోకుండా తాలిబన్ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యను ప్రపంచదేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తాజాగా ఇందుకు సంబంధించి తాలిబన్లు కీలక ప్రకటన చేశారు.
విద్యాసంస్థల్లో అమ్మాయిలపై విధించిన నిషేధం శాశ్వతం కాదని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఇది కొంతకాలం వాయిదా మాత్రమే పడినట్లు పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అమ్మాయిలకు అనువైన వాతావరణం కల్పించిన తర్వాత వాళ్లు మళ్లీ చదువుకుంటారని పేర్కొన్నారు. మహిళా విద్యకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే ఇది ఎప్పటివరకు పూర్తవుతుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.
అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల హక్కులను వారు కాలరాస్తున్నారు. మగ తోడు లేకుండా, హిజాబ్ ధరించకుండా మహిళలు బయటకు వెళ్లొద్దని నిబంధన తీసుకొచ్చారు. అలాగే ఆరో తరగతి తర్వాత అమ్మాయిల, అబ్బాయిలు కలిసి చదువుకోవడాన్ని తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థల్లో అమ్మాయిలపై డిసెంబర్‌లో నిషేధం విధించారు.
చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు..
Comments
Please login to add a commentAdd a comment