![Male Afghan Students Boycott Classes Protest Women Education Ban - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/27/afghan-male-students.jpg.webp?itok=UGr94mag)
అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలు యునివర్సిటీల్లో చదువుకోకుండా తాలిబన్ ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో వారు ఉన్నత విద్యకు దూరమై ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే యూనివర్సిటీల్లో చదువుకునే అబ్బాయిలు.. అమ్మాయిలకు మద్దతుగా నిరసన బాట పట్టారు. తమకు కూడా చదువు వద్దని క్లాస్‌లు బహిష్కరించారు. అమ్మాయిలను కూడా క్లాస్‌లోకి అనుమతిస్తేనే తాము చదువుకుంటామని, లేదంటే చదువు మానేస్తామని హెచ్చరించారు.
అమ్మాయిలకు తిరిగి యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని అబ్బాయిలు డిమాండ్ చేస్తున్నారు. తమ అక్కా చెల్లెళ్లను ఉన్నత విద్యకు నోచునివ్వకపోతే తమకు కూడా చదువు అవసరం లేదని చెప్పారు. యూనివర్సిటీకి వెళ్లబోమని తేల్చిచెప్పారు.
కాబుల్ యూనివర్సిటీలోని లెక్చరర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళలు చదువుకోకుండా నిషేధం విధించడం సరైన నిర్ణయం కాదన్నారు. తాలిబన్ల నిర్ణయం కారణంగా తన ఇద్దరు చెల్లెల్లు చదువు మానేయాల్సి వచ్చింది ఓ లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ వ్యవహారంలో ప్రంపచ దేశాలు జోక్యం చేసుకోవాలని మానవహక్కుల ఆందోళకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్లు తమ నిర్ణయం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలని కోరుతున్నారు.
చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment