male students
-
అమ్మాయిలకు మద్దతుగా అబ్బాయిలు.. క్లాస్‌లు బాయ్‌కాట్ చేసి నిరసన
అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలు యునివర్సిటీల్లో చదువుకోకుండా తాలిబన్ ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో వారు ఉన్నత విద్యకు దూరమై ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే యూనివర్సిటీల్లో చదువుకునే అబ్బాయిలు.. అమ్మాయిలకు మద్దతుగా నిరసన బాట పట్టారు. తమకు కూడా చదువు వద్దని క్లాస్‌లు బహిష్కరించారు. అమ్మాయిలను కూడా క్లాస్‌లోకి అనుమతిస్తేనే తాము చదువుకుంటామని, లేదంటే చదువు మానేస్తామని హెచ్చరించారు. అమ్మాయిలకు తిరిగి యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని అబ్బాయిలు డిమాండ్ చేస్తున్నారు. తమ అక్కా చెల్లెళ్లను ఉన్నత విద్యకు నోచునివ్వకపోతే తమకు కూడా చదువు అవసరం లేదని చెప్పారు. యూనివర్సిటీకి వెళ్లబోమని తేల్చిచెప్పారు. కాబుల్ యూనివర్సిటీలోని లెక్చరర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళలు చదువుకోకుండా నిషేధం విధించడం సరైన నిర్ణయం కాదన్నారు. తాలిబన్ల నిర్ణయం కారణంగా తన ఇద్దరు చెల్లెల్లు చదువు మానేయాల్సి వచ్చింది ఓ లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రంపచ దేశాలు జోక్యం చేసుకోవాలని మానవహక్కుల ఆందోళకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్లు తమ నిర్ణయం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
ఇక మహిళలపైనా లైంగిక వేధింపుల ఫిర్యాదులు
న్యూడిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో మహిళలు, ట్రాన్స్జెండర్లు లైంగికంగా వేధించినట్లయితే వారిపై మగవాళ్లు (విద్యార్థులు, అధ్యాపకులు) సంబంధిత అధికారులకు ఇక నుంచి ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు సరికొత్త మార్గదర్శకాలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల నోటిఫై చేసింది. బాధితులు లేదా వారి తరఫున మూడో పార్టీ, అంటే బంధువులు, స్నేహితులు, సహచరులు సంఘటన జరిగిన మూడు నెలల్లోగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. బాధితులు అనారోగ్యానికి గురైన సందర్భాల్లో మాత్రం మూడు నెలల తర్వాత కూడా ఫిర్యాదును అనుమతిస్తారు. ఈ లైంగిక ఫిర్యాదులను విచారించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీలు తమకు అందిన ఫిర్యాదులపై మూడు నెలల లోపల దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. నివేదిక ఆధారంగా నేరం చేసిన విద్యార్థిని, విద్యార్థులను సంబంధిత కాలేజీ లేదా యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేస్తారు. అధ్యాపకులు నేరానికి పాల్పడిన పక్షంలో సర్వీసు నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారు. తమను ఆడవాళ్లు వేధిస్తున్నారంటూ విద్యార్థుల ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఎక్కువైన నేపథ్యంలో యూజీసీ ఈ తాజా మార్గదర్శకాలను రూపొందించి నోటిఫై చేసింది. 2007లో మొదటి సారి ఇలాంటి రెండు ఫిర్యాదులు ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలో దాఖలయ్యాయి. రామ్జాస్ కాలేజీలో ఓ మహిళా టీచరు తమను లైంగికంగా వేధిస్తోందంటూ ఇద్దరు విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.