Women education
-
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్‌లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు ఎంపికయ్యి నీతి ఆయోగ్‌లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్‌లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్‌లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్‌లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్‌లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్‌ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్‌లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్‌కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్‌గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్‌లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్‌లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్‌లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్‌కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్‌పూర్‌కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్‌తో జార్ఖండ్‌లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్‌లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్‌గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
19 ఏళ్లకే సర్పంచ్ ఆమె!..మద్యానికి బానిసైన తండ్రి, కటిక దారిద్యం..
చిన్నతనంలో చెప్పలేనన్ని కష్టాలు ఫేస్ చేసింది ఆమె. నిత్యం మద్యం సేవించే తండ్రి, దారుణమైన పేదరికంతో పలుబాధలు పడింది. మూడో తరగతి నుంచి చదువు మానేయక తప్పని స్థితి. బాల్యంలోనే పెళ్లి చేస్తారేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంది. తన జీవితం మారకపోతుందా అనే ఆశతో అలానే కాలం వెళ్లదీస్తూ ఉంది. అనుకున్నట్లే ఊహించని విధంగా ఎన్జీవో రూపంలో ఆమె జీవితం మారింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకుని తన గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై బాలికల విద్య కోసం అహర్నిశలు కృషి చేసింది. ఎందరో బాలికలను బడికి పంపేందుకు ఆమె కథే ప్రేరణగా నిలిచింది. ఆ సాధారణ మహిళ ఎలా ఇన్ని కష్టాలు దాటుకుని సర్పంచ్ స్థాయికి చేరుకుందంటే..? రాజస్థాన్‌లో పాలి జిల్లాలోని సక్దారా గ్రామానికి చెందిన ప్రవీణ అనే మహిళ కేవలం 19 ఏళ్లకే ఏడు గ్రామాలకు సర్పంచ్ అయ్యి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకోసం అమె లెక్కలేనన్ని పోరాటాలు చేసింది. ప్రవీణ తండ్రి మద్యనికి బానిసై కుటుంబాన్ని పోషించేవాడు కాదు. తనకు నలుగురు తోబుట్టువులు. ఇంటిలోని పేదరికానికి మూడో తరగతి నుంచి బడి మానేయాల్సి వచ్చింది. కానీ ప్రవీణలో ఎలాగైనా చదువుకోవాలి, ఎప్పటికైన చదువుకోగలను అనే ఆశ బలంగా ఉండేది. కుటుంబం కోసం పశువులు మేపుతున్న తన ఆశను మాత్రం చంపుకోలేదు. అందుకోసమే ఎన్జీవో రూపంలో ప్రవీణ ఊరుకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(కేబీవీ) ప్రారంభమైంది. ఆ ఎన్జీవోలోని ఓ వ్యక్తి ఆ పాఠశాలలో ప్రవీణ ఉచితంగా చదువుకోవచ్చని ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించడంతో ఆమె ఆశ నెరవేరింది. అక్కడే ఆమె తన విద్యాభాసాన్ని పూర్తి చేసింది. ప్రవీణ మైనర్‌గా ఉండగానే భవన నిర్మాణ కార్మికుడితో పెళ్లి చేసేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయినప్పటికీ తనలాగా చదవుకోవాలన్న కోరికతో ఉన్న బాలికలుగా తనవంతుగా సాయం చేస్తూనే ఉండేది. తనలా మరెవరూ చదువు కోసం పరితపించకూడదని అనుకుంది. అయితే ఆమె అత్తంటి వారి కుటుంబంలో ఆమె మాత్రమే ఉన్నత విద్యావంతురాలు. అదే ఆమెకు సర్పంచ్‌గా పోటీ చేసే ధైర్యాన్ని ఇచ్చింది. విద్యారంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తానన్న హామీతో కనివినీ ఎరుగని మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచింది. ఆ చదువు వల్లే తాను సర్పంచ్‌గా పోటీ చేయగలిగాను. లేదంటే ఇంటి పనులు చేసుకుంటూ పశువులు మేపు కోవాల్సిందేనని చెబుతోంది ప్రవీణ. ఈ స్థాయికి చేరుకోవడంతో తన అత్తింటివారు కూడా తనను చూసి గర్వపడుతున్నారని అంటోంది. తన అత్తమామల కుటుంబంలో కూడా బాలికలను పాఠశాలలకు పంపిచడం అనేది లేదని కానీ తాను సర్పంచ్‌గా పోటీ చేసేటప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టేవారు కాదని చెబుతోంది. తన అత్తింటివారు ఆర్థికంగా ఏమి అంత ఉన్నవాళ్లు కాకపోయిన తన ప్రయాణంలో మాత్రం ఆటంకం కలిగించనందుకు వారిని మెచ్చుకోవాలని సంతోషంగా చెప్పింది. అలాగే తాను చెప్పినట్లుగానే విద్యకు గరిష్ట బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిపింది. అంతేగాక బాలికల కోసం పాఠశాల కూడా నిర్మించానని గర్వంగా చెప్పింది. అంతేగాక తాను గ్రామంలో పాఠశాలకు వెళ్లని బాలికలను వెదికి వారి తల్లిదండ్రలును ఒప్పించి మరీ పంపడం లేదా ఎన్జీవోలతో కలపడం వంటివి చేస్తానని చెబుతోంది. దీంతోపాటు బాలికలను పంపించలేని కుటుంబాలకు ఏమైన ఆర్థికపరమైన అడ్డంకులు ఉన్నాయో అనేది కనుక్కుని ఆ సాయం కూడా అందేలే చేస్తున్నట్లు వివరించింది. అలాగే తమ గ్రామాల్లోని ఉపాధ్యాయులు కూడా విద్య ప్రాముఖ్యత గూర్చి చెప్పమని తనను పాఠశాలకు ఆహ్వానిస్తుంటారని కూడా వెల్లడించింది. ఎందుకంటే తాను అలాంటి బాలికల్లో ఒక్కతిని కాబట్టి వారికి అర్థమయ్యేలా వివరించగలనన్న ఉద్దేశ్యం కాబోలు అంటోంది. ఆమె ఎడ్యుకేట్ గర్ల్స్ ప్రచారం కోసం పనిసచేస్తోంది. ఆమె ఒక్కసారి ఆ ప్రచారఫౌండేషన్ దినోత్సవానికి హజరై ప్రసగిస్తుండగా.. అక్కడ చాలామంది అమ్మాయిలు ఫీల్డ్ వర్కర్లు తన కథను వారి తల్లిదండ్రులకు వివరించారని, ఆ తర్వాతే తమను కూడా స్కూల్‌కి పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చినట్లు ప్రవీణకి తెలిపారు. అప్పుడే తెలిసింది తన కథకు ఇంతమంది స్ఫూర్తినిచ్చిందా అని ప్రవీణ ఆశ్చర్యపోయింది. ఇక ప్రవీణ 2014 నుండి 2019 వరకు రాజస్థాన్‌లోని ఏడు గ్రామాలకు సర్పంచ్‌గా పనిచేశారు. ఈ ఏడాదితో ఆమె సర్పంచ్ పదవీ కాలం ముగియనుందని అయినప్పటికీ బాలికల చదువు కోసం తన పోరాటం మాత్రం ఆగదని సగర్వంగా చెప్పింది ప్రవీణ. (చదవండి: ఆమె రాజవంశపు యువరాణి, రాయల్ ఐకాన్!ఏకంగా డిప్యూటీ మంత్రిగా..!) -
ఇరాన్లో ‘బాలికలకు విషం’...
దుబాయ్: ఇరాన్లో ను విద్యకు దూరం చేసేందుకు వారి స్కూళ్లపైకి విష వాయువులు వదులుతున్న ఉదంతాలపై యునెస్కో ఆందోళన వెలిబుచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరింది. స్కూళ్లలో బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని సూచించింది. ఇరాన్లో జరుగుతున్న పరిణామాలను తన మనసును తీవ్రంగా కలచివేస్తున్నాయని యునెస్కో సారథి ఆద్రే అజౌలే అన్నారు. -
మహిళల హక్కులను పట్టించుకోం.. మాకు అదే ముఖ్యం: తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలను హైస్కూల్, కాలేజీ, యూనివర్సిటీల్లో చదవకుండా తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా మహిళలు ఎన్జీఓల్లో కూడా పనిచేయకుండా కొత్త రూల్ తీసుకొచ్చారు. దీంతో తాలిబన్ ప్రభుత్వం తీరును ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. మహిళల హక్కులను కాలరాయొద్దని సూచిస్తున్నాయి. ఈ విషయంపై తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ స్పందించాడు. అసలు మహిళల హక్కులు తామ ప్రాధాన్యమే కాదని చెప్పాడు. తమకు ఇస్లామిక్ చట్టమే ముఖ్యమని దాని ప్రకారమే మహిళలు నడుచుకోవాలని పేర్కొన్నాడు. వాళ్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే ఉద్దేశమే తమకు లేదని తేల్చిచెప్పాడు. ఇస్లాం చట్ట ప్రకారమే తమ పాలన ఉంటుందన్నాడు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల హక్కులను కాలరాస్తోంది. ఉన్నత విద్య, కాలేజీలు, యూనివర్సీటీల్లో అమ్మాయిలపై నిషేధం విధించింది. వాళ్లు అబ్బాయిలతో కలిసి చదువుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చివరకు మహిళలు ఎన్జీఓల్లో కూడా ఉద్యోగం చేయకుండా ఆంక్షలు విధించింది. హిజాబ్ ధరిచంకుండా, మగ తోడు లేకుండా బయటకు వెళ్లొద్దని నిబంధనలు తీసుకొచ్చింది. ప్రపంచదేశాలు నుంచి తీవ్ర విమర్శలు ఎదరువుతున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. చదవండి: కీవ్‌పై మరోసారి పేట్రేగిన రష్యా -
స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై నిషేధంపై తాలిబన్ల కీలక ప్రకటన
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవుకోకుండా తాలిబన్ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యను ప్రపంచదేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తాజాగా ఇందుకు సంబంధించి తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. విద్యాసంస్థల్లో అమ్మాయిలపై విధించిన నిషేధం శాశ్వతం కాదని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఇది కొంతకాలం వాయిదా మాత్రమే పడినట్లు పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అమ్మాయిలకు అనువైన వాతావరణం కల్పించిన తర్వాత వాళ్లు మళ్లీ చదువుకుంటారని పేర్కొన్నారు. మహిళా విద్యకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే ఇది ఎప్పటివరకు పూర్తవుతుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల హక్కులను వారు కాలరాస్తున్నారు. మగ తోడు లేకుండా, హిజాబ్ ధరించకుండా మహిళలు బయటకు వెళ్లొద్దని నిబంధన తీసుకొచ్చారు. అలాగే ఆరో తరగతి తర్వాత అమ్మాయిల, అబ్బాయిలు కలిసి చదువుకోవడాన్ని తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థల్లో అమ్మాయిలపై డిసెంబర్లో నిషేధం విధించారు. చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు.. -
అమ్మాయిలకు మద్దతుగా అబ్బాయిలు.. క్లాస్‌లు బాయ్‌కాట్ చేసి నిరసన
అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలు యునివర్సిటీల్లో చదువుకోకుండా తాలిబన్ ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో వారు ఉన్నత విద్యకు దూరమై ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే యూనివర్సిటీల్లో చదువుకునే అబ్బాయిలు.. అమ్మాయిలకు మద్దతుగా నిరసన బాట పట్టారు. తమకు కూడా చదువు వద్దని క్లాస్‌లు బహిష్కరించారు. అమ్మాయిలను కూడా క్లాస్‌లోకి అనుమతిస్తేనే తాము చదువుకుంటామని, లేదంటే చదువు మానేస్తామని హెచ్చరించారు. అమ్మాయిలకు తిరిగి యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని అబ్బాయిలు డిమాండ్ చేస్తున్నారు. తమ అక్కా చెల్లెళ్లను ఉన్నత విద్యకు నోచునివ్వకపోతే తమకు కూడా చదువు అవసరం లేదని చెప్పారు. యూనివర్సిటీకి వెళ్లబోమని తేల్చిచెప్పారు. కాబుల్ యూనివర్సిటీలోని లెక్చరర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళలు చదువుకోకుండా నిషేధం విధించడం సరైన నిర్ణయం కాదన్నారు. తాలిబన్ల నిర్ణయం కారణంగా తన ఇద్దరు చెల్లెల్లు చదువు మానేయాల్సి వచ్చింది ఓ లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రంపచ దేశాలు జోక్యం చేసుకోవాలని మానవహక్కుల ఆందోళకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్లు తమ నిర్ణయం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
తాలిబన్ల మరో సంచలన నిర్ణయం.. యూనివర్సిటీ విద్యపై నిషేధం
కాబూల్: అఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వంలో మహిళా లోకంపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. అధికారాన్ని చేజిక్కుంచుకునే ముందు మహిళ హక్కుల కోసం పోరాడుతామని, ప్రజలకు స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామయ్య పాలన అందిస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు.. తరువాత తమ అనాలోచిత నిర్ణయాలు, అరాచక పాలనతో దేశంలోని పౌరుల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలికల స్వేచ్చను హరిస్తూ.. వారిని ఇప్పటికే ఉన్నత విద్యకు దూరం చేశారు. అనేక ఉద్యోగాల్లో మహిళలపై ఆంక్షలు విధించారు. దేశ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధిరంచాల్సిందేనని ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా తాలిబన్లు మరో సంచలన నిబంధన తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా మహిళలకు యూనివర్సిటీ(విశ్వవిద్యాలయ) విద్యను నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. మహిళా విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహ్మద్ నదీమ్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలుపుతూ మేరకు ట్వీట్ చేశారు. న్యూయర్క్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమై.. తాలిబన్లు నిర్భంధించిన ఇద్దరు అమెరికన్లు విడుదల చేస్తున్నట్లు యూఎస్ విదేశాంగశాఖ వెల్లడించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే తాలిబన్ల నిర్ణయంపై అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తునఆనయి. మహిళలను ఆంక్షలకు గురిచేస్తున్న తాలిబన్లను.. ఆప్గనిస్థాన్‌లోని అందరి హక్కులను గౌరవించే వరకు అంతర్జాతీయ సమాజంలో చట్టబద్ధమైన సభ్యులుగా ఉండేందుకు ఆశించలేమని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి.. చీకట్లో వేల మంది.. -
తెలుగు స్త్రీలకు వెలుగునిచ్చిన విద్యాలయం
20వ శతాబ్దం ప్రారంభం నాటికి అవిద్య, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం వంటి అనేక సమస్యలతో భారత స్త్రీలు కొట్టుమిట్టాడుతుండేవారు. ఇంటి నాలుగు గోడల మధ్య బందీలై, బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి వారిది. దీనికి తోడు ఆనాటికి ప్రబలి ఉన్న మూఢ విశ్వాసాలు వారికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేవి. ఈ స్థితిలో స్త్రీలను ఉద్ధరించడానికి కందుకూరి వీరేశలింగం వంటివారు నడుం బిగించారు. ఆ కోవకు చెందినవారే ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ దంపతులు కూడా. వారు స్త్రీవిద్య కోసం గుంటూరులో ‘శారదా నికేతనం’ స్థాపించారు. దానికి నూరు వసంతాలు నిండాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఉన్నవ దంపతులు గుంటూరు కేంద్రంగా జాతీయోద్యమం, స్త్రీ జనోద్ధరణ, సంస్కరణోద్యమాలకు తమ జీవితాలను అంకితం చేసి చరితార్థులయ్యారు. స్త్రీలకై ఒక విద్యాలయం నడపాలని భావించిన వారి ఆశయ ఫలితంగా... గుంటూరు గాంధీపేటలో సనాతన ధర్మమండలి హాలులో 1922 నవంబరు 22న, దేశో ద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రారంభకులుగా ‘శారదా నికేతనము’ స్థాపితమైంది. స్త్రీలలో జాతీయ భావాన్ని రేకెత్తించే పద్ధతులను అనుసరించి విద్య నేర్పటానికి ఏర్పాటైన ‘శారదా నికేతనము’లో సంస్కృతము, తెలుగు, హిందీ, సంగీ తము, చిత్ర లేఖనము, నూలు వడకుట, నేత, కుట్టు పని మొద లగు వృత్తి విద్యలు ప్రవేశపెట్టారు. విద్యార్థినులకు వసతి గృహం కూడా ఏర్పాటు అయింది. 1922లో గుంటూరు అరండల్‌పేటలో ప్రారంభించిన శారదా నికేతనము... తరువాతి సంవత్సరంలో మునగాల జమీందారు నాయని వెంకట రంగారావు, బ్రాడీపేట 2వ లైనులో కొండా వెంక టప్పయ్య నివాసానికి (దేశభక్త భవనము) చేరువలో విరాళంగా ఇచ్చిన రెండు ఎకరాల స్థలం స్థలంలోకి మార్చబడింది. ఇప్పటికీ అదే స్థలంలో ఈ నికేతనం కొనసాగుతోంది. శారదా నికేతనంలో ఆంధ్రదేశం నలుమూలల నుండేకాక, దక్షిణాఫ్రికా, రంగూన్, ఖరగ్‌పూర్, హైదరాబాదు వంటి పలు నగరాల నుండి తెలుగు విద్యార్థినులు ఇక్కడికి వచ్చి గురుకుల వాసం చేస్తూ విద్యాభ్యాసం చేసేవారు. ఈ విద్యాలయం రెండు స్థాయుల్లో కోర్సులను నిర్వహించేది. మొత్తం ఎనిమిదేళ్ల కాల వ్యవధి. మొదటి 5 ఏళ్లూ సాహితీ ప్రకరణమనీ, మిగిలిన 3 ఏళ్లూ విదుషీ ప్రకరణమనీ విభజిం చారు. బాగా చదవటం, రాయటం వచ్చి ప్రైమరీ తరగతి వరకు చదివిన బాలికలను 5 ఏళ్ల సాహితీ ప్రకరణ కోర్సులో చేర్చుకునేవారు. 5 సంవత్సరాలు పూర్తి అయేసరికి బాలికలకు సంస్కృతాంధ్రాలలో కొంత కావ్యజ్ఞానం అలవడి, సంగీత – చిత్రలేఖనాలలో ఒకదానిలో మంచి జ్ఞానం సంపాదించేవారు. అలాగే చేతిపనులలో ఒకటి నేర్చుకుని, భూగోళము, వైద్యము, చరిత్రలో మంచి పరిచయం పొందేవారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులయిన వారు ‘సాహితీ’ బిరుదమును పొందేవారు. తరువాతి 3 ఏళ్లు సంస్కృతాంధ్ర భాషలలో ఒకటీ, ఆంగ్ల, హిందీ భాషలలో ఒకటీ అభిమాన భాషలుగా చదివి పరీక్షలో ఉత్తీర్ణులయినవారు ‘విదుషీ’ పట్టభద్రులు అయ్యేవారు. గవర్న మెంటు వారి పరీక్షలతో గానీ, పర్యవేక్షణతోగానీ సంబంధం లేకుండా విద్యాలయం వారే తరగతులన్నిటికీ వార్షిక పరీక్షలు జరిపి, పట్టాలను ఇచ్చేవారు. బాలికలకు విద్యా బోధనతో పాటూ... అనాథలకు, బాల వితంతువులకు, వితంతువులకు, భర్త వదిలి పెట్టినవారికి ఉచి తంగా భోజన వసతి, వస్త్ర సదు పాయాలు కల్పించి; అభాగ్య స్త్రీల పాలిట ఆశ్రిత కల్పవక్షంగా శారదా నికేతనం పేరు ప్రఖ్యాతులు పొందింది. 1927 ఏప్రిల్ 17వ తేదీన గాంధీమహాత్ముడు ఈ సంస్థని దర్శించి, ఇటువంటి సంస్థ ఆంధ్రదేశంలోనే కాదు, యావద్భారత దేశంలోనే లేదని ప్రశంసించారు. పూరిపాకలలోను, చెట్ల నీడలోను ప్రారంభంలో తరగతులు నిర్వహించినా... కాలక్రమంలో స్త్రీ విద్యాభిమానులయిన వదా న్యుల సహకారంతో సొంత భవనాలను, భూమి తదితర స్థిరాస్తులను సంపాదించుకోగలిగింది. ఆంధ్రదేశంలోని మున్సి పాలిటీలు, తాలూకా బోర్డులు, జిల్లా బోర్డులు తగిన విధంగా ఈ విద్యాలయానికి ఆర్థిక సహకారం అందించేవి. 1937లో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారిచే ఈ సంస్థలోని సంస్కృతాంధ్రశాఖ– ‘ప్రాచ్య భాషాకళాశాల’గా గుర్తింపునొందింది. తరువాత కాలంలో ఇందలి పారిశ్రామిక శాఖను ప్రత్యేక పాఠశాలగా గవర్నమెంటు గుర్తించింది. ఒక స్వతంత్ర సంస్థగా రిజిష్టరైన ‘శ్రీశారదా నికేతన్’ ప్రయివేటు యాజమాన్యంలో ప్రధా నంగా ఉన్నవ దంపతులచే నిర్వహింపబడింది. 1955లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయశాఖ అధీనంలోకి తీసు కునేవరకూ ఈ సంస్థకు ముఖ్యదాత అయిన మునగాల జమిం దారు రాజా నాయని వెంకట రంగారావు బహద్దరు అధ్యక్షులుగా కొనసాగారు. ప్రస్తుతం ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నియ మించిన కార్య నిర్వహణాధికారి ఆధ్వర్యంలో శారదా నికేతనం విద్యాసంస్థల నిర్వహణ సాగుతోంది. దరిశి అన్నపూర్ణమ్మ (గదర్ విప్లవ వీరుడు దరిశి చెంచయ్య భార్య), సంగెం లక్ష్మీబాయమ్మ (నిజామాబాద్ బాన్సువాడ నియోజకవర్గం నుండి గెలుపొంది, విద్యాశాఖ ఉప మంత్రిగా బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేసిన ప్రథమ తెలంగాణ మహిళ), బొందలపాటి శకుంతలాదేవి (త్రిపురనేని గోపీచంద్ భార్య), భారతీదేవి (ఆచార్య ఎన్.జి.రంగా భార్య) వంటి పేరెన్నికగన్న స్త్రీ మూర్తులు శ్రీశారదా నికేతనం పూర్వ విద్యార్థినులే. ఇంతటి చరిత్ర గలిగిన శారదానికేతనం 2022 నవంబరు 22 తేదీన వందేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శారదానికేతనంలో– ప్రాథమిక పాఠశాల (బాల బాలికలకు), ఉన్నత పాఠశాల (బాలికలకు), ఓరియంటల్ డిగ్రీ కళాశాల(బాలికలకు) నిర్వహిస్తున్నారు. ఈ మూడింటా సుమారు 500 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. తెలుగు ఆడపడుచులకు విద్యా, విజ్ఞానాలను అందించి వారి కాళ్లపై వారు నిలబడ గలమనే ధైర్యాన్ని నింపిన శారదా నికేతన్... ఒక చారిత్రక పాత్ర పోషించిందనడంలో అతిశయోక్తి లేదు. దాని స్ఫూర్తిని అందు కోవలసిన బాధ్యత మన తరానిదే! ఎమ్.వి.శాస్త్రి వ్యాసకర్త సింగరేణి కాలరీస్ హెచ్ఆర్ మేనేజర్ (రిటైర్డ్) మొబైల్: 94413 42999 -
Darshi Chenchaiah: ఆయన జీవితమే ఒక సందేశం
ఆయన జీవితం ఒక అద్భుతం. ఆయన పోరాటం అనన్యం. ఏకైక తెలుగు ‘గదర్’ వీరుడు. వ్యవసాయ శాస్త్రం చదవడానికని విదేశాలకు వెళ్ళి సమాజంలో అసమాన తలు చూసి చలించిపోయి విప్లవాన్ని విలక్షణంగా అధ్యయనం చేసిన ధీరుడు. తెలుగులోనే కాదు, యావత్ దేశంలోనే ప్రప్రథమ అరాచకవాద (అనార్కిస్ట్) తత్వవేత్తల్లో ఒకరు. విస్తృతమైన జీవితాను భవాలను అక్షరీకరించి ‘నేనూ–నా దేశం’ పేరిట అద్వితీయమైన ఆత్మకథను తెలుగు ప్రజకి అందించాడు. ఆయనే దరిశి చెంచయ్య. సామాన్య సంప్రదాయ కుటుంబంలో జన్మించి అసామాన్య యోధుడిగా ఎదిగిన ఆయన జీవితం ఎప్పటికీ నిత్య పఠనీయం. యావత్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రాజకీయ డిటెన్యూగా దేశంలో ఆనాడు ఆయన్ని ఉంచని జైలు లేదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్రోద్యమంలో అతివాద టెర్రరిస్టు కార్యకలాపాలలో పాల్గొనడమే కాక కాంగ్రెస్ నాయకుడిగా, గాంధేయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. సోషలిస్టుగా, కమ్యూనిస్టుగా, మానవతావాదిగా, సాహిత్యకారుడిగా, సామా జిక వేత్తగా, సంఘ సంస్కర్తగా, సాంస్కృతిక ఉద్యమకారుడిగా చెంచయ్య ప్రజ్ఞ బహుముఖం. చెంచయ్య ఆత్మకథ... అనేకమంది విప్లవ వీరులూ, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రల సమాహారం. ఒక విధంగా చెప్పాలంటే సమకాలీన చరిత్రను రికార్డు చేసిన గ్రంథం. అందుకే తెలుగులో వచ్చిన ఆత్మకథల్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఇది నిలుస్తుంది. సరిగ్గా 70 ఏళ్ళ క్రితం... 1952 సెప్టెంబర్‌లో మొదటిసారిగా ప్రచురించబడిన ‘నేను–నా దేశం’ గ్రంథాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉరి కొయ్యలకు బలైపోయిన తన పంజాబ్ మిత్రుడు సర్దార్ బలవంత్ సింగుకూ, ఆయన భార్యకీ అంకితం ఇచ్చారు. నాకు తెలిసి తెలుగులో ఒక పంజాబ్ విప్లవ దంపతులకు అంకితమిచ్చిన ఏకైక తెలుగు స్వీయచరిత్ర ఇదే. అందుకే నార్ల ఈ పుస్తకానికి పీఠిక రాస్తూ, ‘‘శ్రీ చెంచయ్య గారి ‘నేనూ – నా దేశం’ నిస్సంశయంగా ఉత్తమ శ్రేణికి చెందిన ఆత్మకథ. నిజానికి అది ఆయన ఆత్మకథ కాదు; మన దేశ చరిత్ర. పోయిన అర్ధ శతాబ్దిలో మన దేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో వచ్చిన ప్రతి మహోద్యమం చెంచయ్య జీవిత దర్పణంలో తన ప్రతిబింబాన్ని మిగిల్చింద’’ని అంటారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ‘ప్రభవ’ పత్రిక వ్యవస్థాపకులు గద్దె లింగయ్య మొదటిసారి ముద్రించిన నాలుగొందల పుటల ఈ స్వీయచరిత్ర అద్భుతమైన విప్లవకారులు జితేంద్ర నాధ లాహిరీ నుండి మొట్టమొదటి భారతీయ అనార్కిస్టు, గొప్ప బౌద్ధ, భౌతికవాద రచయిత లాలా హర్ దయాళ్ వరకూ; జోధ్ సింగ్, చిదంబరం పిళ్లై, నీలకంఠ బ్రహ్మ చారి... వంటి అనేకమందీ మనకి పరిచయం అవుతారు. మొదటి వైశ్య వితంతు వివాహం మొదలు కొని వితంతు శిశు శరణాలయాల స్థాపన దాకా; ‘మా భూమి’ నాటక ప్రదర్శనలు, అమెరికా, జపాన్, చైనా, రష్యా, సింగపూర్ దేశాలలోని పరిస్థితులు, విప్లవ రాజకీయాల్ని కూడా ఇందులో మన కళ్ళకు కడతారు. ఇదంతా ఒక ఎత్తయితే మహామేధావి డాక్టర్ కేబీ కృష్ణతో చెంచయ్యకి ఉన్న అమితమైన స్నేహం ఒక్కటీ ఒకెత్తు. జైలులో ఉన్న సమయంలో కేబీ కృష్ణ మార్క్స్ ‘కేపిటల్’ గ్రంథం మీద అందరికీ క్లాసులు చెప్పే వారంటూ, ‘ఆయన శక్తి మాకు ఆశ్చర్యం కలిగించింది... ఆయన రాజకీయ ఆర్థిక శాస్త్రాలలో పారంగతుడు; వేదాంత శాస్త్రంలో అసమాన పాండిత్యం కలవాడు.. వారి సహాయంతో డిటెన్యూల క్యాంపు ఒక సర్వకళాశాలగానూ, విప్లవ కళాశాలగానూ మారిందని’ అంటారు చెంచయ్య. ‘నేను కమ్యూనిస్టు కావడానికి ముఖ్య కారణం స్త్రీల కష్టాలను తొలగించడానికి ప్రయత్నాలు చేసి, చేసి పూర్తిగా సాధించలేక పోవడం వల్ల కలిగిన అసంతృప్తి..’ అని రాసుకున్నారాయన. పది సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పటికీ కమ్యూనిస్టు కాలేకపోయానని నిజాయితీగా రాసుకున్న నిజమైన కమ్యూనిస్టు ఆయన. బీడీ కార్మికులు, చుట్ట కార్మికులు, స్పెన్సర్ కంపెనీ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులు, ఇంకా పారిశుద్ధ్య కార్మికులు వంటివారు చేసిన పోరాటాలు అన్నిం టిలోనూ క్షేత్ర స్థాయిలో పాల్గొన్న ఆయన ‘అభ్యుదయ రచయితల మహాసభ’ మొదలు ‘ప్రజానాట్యమండలి’ వరకూ అనేక ప్రజా సంఘాలతో మమేకమై పని చేశారు. వాటిల్లోని లోపాలను కూడా చాలా సూటిగా చెప్పారు, రాశారు. కనుకనే స్వీయచరిత్ర ముగిస్తూ ఈ దేశానికి, మన సమాజానికి, ‘ఒక మహత్తర సంస్కృతీ ఉద్యమము’ అవసరం అని ప్రత్యేకంగా నొక్కి వక్కాణించారు. (చదవండి: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక, ఎవరి దగ్గరా చేయి చాచలేక ఇంట్లో సామానులు అమ్ముకున్న వైనం మనల్ని కదిలిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి చెంచయ్యకు తెలుగు నేలపై ఇప్పటికీ తగిన గుర్తింపు రాలేదనడం అవాస్తవం కాదు. 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆయన స్వీయ చరిత్ర ‘నేనూ– నా దేశం’ లోని కొంత భాగాన్నయినా విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టే దిశగా ప్రభుత్వం యోచన చేయాలి. - గౌరవ్ చెంచయ్య సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు (దరిశి చెంచయ్య స్వీయచరిత్ర ‘నేనూ – నా దేశం’తెలుగు లోకానికి అంది 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా) -
హారతి గైకొనుమా
‘తనని చదివిస్తే తను వెలిగిస్తుంది’ అని చెప్పడంలో ఆమె వెలగడం ఎక్కడా లేదు. అంతా చదివి ఏం లాభం? ‘హారతి గైకొనుమా’ అంటూ ఉండటమేనా స్త్రీ జీవితం!విద్య మమ్మీనే. బుద్ధులూ మమ్మీనే. ఒంట్లో బాలేకున్నా, తన ఆఫీస్‌కీ లేట్ అవుతున్నా.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. ఇలాంటివి చాలానే ఉన్నాయ్ రోజూ వినే పాటల్లో, ప్రావెర్బుల్లో.ప్రణబ్ కూడా ఇప్పుడు ఒక మాట వేసినట్లే ఉందిఆయన ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్..’ అనడం.-మాధవ్ శింగరాజు ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లో పదవీ విరమణ పొందిన భారత రాష్ట్రపతులు నివాసం ఉండే భవంతి ఒకటి ఉంది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా రిటైర్ అయ్యాక ప్రణబ్ సామాన్లను అందులోకి మార్పించారు. పుస్తకాలే ఆయన సామాన్లు. ఉండడానికైతే ప్రణబ్ ఇప్పుడు రాజాజీ మార్గ్ నివాసంలోనే ఉంటున్నారు. అయితే ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌లోని ఆయన పూర్వీకుల స్వగ్రామం మిరాటీలో స్థానికులకు కనిపిస్తుంటారు. ఢిల్లీలో ఉన్నా, మిరాటీలో ఉన్నా ఆయన చేతిని వదలని మనుషులు.. పుస్తకాలే! అసలు ఢిల్లీ, మిరాటీ కాదు.. పుస్తకాలు ఎక్కడుంటే అక్కడే ఆయన నివాసం. ప్రణబ్ చుట్టూ తిరిగే రాజకీయాలు కూడా ప్రస్తుతం దేశంలో ఏమీ లేవు కనుక ఎక్కడైనా ఆయన మాట వినిపిస్తే, వెంటనే ఆయన ఎక్కడి నుంచి మాట్లాడారోనన్న సందేహం రావడానికి కారణం ఇదే.ఇప్పుడేం జరిగిందంటే.. ‘‘పురుషుడి చదువు పురుషుడికి మాత్రమే పరిమితం అవుతుంది. స్త్రీ చదువు కుటుంబం మొత్తానికీ చదువౌతుంది’’ అని ప్రణబ్ అకస్మాత్తుగా దేశ ప్రజలకు వాక్ దర్శనం ఇచ్చారు! ఢిల్లీలోనే ఒక కార్పొరేట్ కంపెనీ ‘బేటీ పఢావో అభియాన్’ అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందులో గెస్ట్‌గా మాట్లాడుతూ ప్రణబ్ అన్నమాట ఇది. అంతే తప్ప తనకు తానుగా రాజాజీ మార్గ్లోనో, మిరాటీలోనో ప్రెస్ మీట్ పెట్టి ఉమెన్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడలేదు. అలా మాట్లాడి ఉంటే ఆయన మాటల్ని సీరియస్‌గానే తీసుకోవలసి వచ్చేది. సందర్భానుసారం మాట్లాడ్డానికి, మాట్లాడవలసిన అవసరాన్నే ఒక సందర్భం చేయడానికీ తేడా ఉంటుంది కదా. ప్రణబ్ చెప్పిన హితవు కూడా కొత్తదేం కాదు. ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యు ఎడ్యుకేట్ ఏన్ ఇండివిడ్యువల్. బట్ ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్, యు ఎడ్యుకేట్ ఎ ఫ్యామిలీ’ అని చెప్పారు ఆయన. ఎప్పుడూ వింటుండే మాటే. ఎవరో ఒకరు అంటుండే మాటే. మగ పిల్లవాడిని చదివిస్తే అది వాడికి మాత్రమే మేలవుతుంది. ఆడపిల్లను చదివిస్తే అది దేశానికే మేలవుతుంది అనేది ఆఫ్రికన్ ప్రావెర్బ్. అక్కడి నుంచి మిగతా ప్రపంచానికి ప్రబలింది. వాళ్లు ‘దేశానికి మేలు’ అంటే.. మనం ‘ఇంటికి మేలు’ అని మార్చుకున్నాం. ఆడపిల్లను చదివిస్తే ఇంటికి మేలు ఎలా అవుతుందంటే ఆమె ఇంట్లోనే కూర్చుని పిల్లల చేత అక్షరాలు దిద్దిస్తూ, బుద్ధులు నేర్పిస్తూ ఉంటుందని! తను చదువుకుంటున్నప్పుడు తోబుట్టువుల్ని చదివించడం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక వాళ్లను చదివించడం, పిల్లల పెళ్లిళ్లు కూడా అయి మనవలు పుట్టాక వాళ్లను చదవించడం.. అలా ఆ విద్యాజ్యోతి తరాలను వెలిగించుకుంటూ పోతుంది. ఆమె ఉద్యోగం చేస్తున్నా కూడా రిటైర్ అయ్యేవరకు ఆమె వెలిగించడం కోసం రోజూ కొన్నిదీపాలు ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాయి. ‘మమ్మీ ప్రాజెక్ట్‌వర్క్’. ‘అమ్మమ్మా హోమ్‌వర్క్’! చెయ్యడానికి, చేయించడానికి సంతోషమే. కానీ ఓపిక. అదెక్కడి నుంచి వస్తుంది? ‘ఓపిక దేముందీ.. ఫ్యామిలీ కంటే ఎక్కువా’ అని తను అనుకున్నా.. తనకు శక్తిని, జీవితేచ్ఛను ఇచ్చే సంతోషాల కోసం, సమాజం కోసం చేసుకోవాలనుకున్నవి! వాటికి టైమ్ ఎక్కడ? ఇంట్లో ఇంకో జ్ఞానదీపం ఉంటుంది కదా.. మగ జ్ఞానదీపం. అదెప్పుడూ తనకు తను ఇంట్లో, బయటా వెలుగుతూ ఉంటుంది తప్ప ఇంకొకర్ని వెలిగించేందుకు ఉత్సాహం చూపదెందుకు? సొంత పిల్లదీపాలను కూడా పట్టించుకోదెందుకు? డాడీ ఈ సమ్ అర్థంకావడం లేదు. ‘మమ్మీని అడుగు’. డాడీ.. స్కూల్ టైమ్ అవుతోంది. షూజ్కి పాలిష్ చెయ్యవా ప్లీజ్. ‘నీ షూజ్ నువ్వే క్లీన్ చేసుకోవాలని మమ్మీ చెప్పలేదా నీకు?’. విద్య మమ్మీనే. బుద్ధులూ మమ్మీనే. ఒంట్లో బాగోలేకున్నా, తన ఆఫీస్‌కీ లేట్ అవుతున్నా.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. ఇంకా ఇలాంటివే చాలానే ఉన్నాయ్ రోజూ వినే మాటల్లో, పాటల్లో.. స్త్రీని నెత్తి మీద పెట్టుకొని ఎటూ కదలనివ్వకుండా పట్టుకునేవి. ప్రణబ్ కూడా ఇప్పుడు ఒక మాట వేసినట్లే ఉంది ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్..’ అని ఆయన అనడం. ఆడపిల్లల్ని చదివించాలి అని మాత్రమే చెప్పి, రిలేటెడ్‌గా వేరే ఏమైనా మాట్లాడాల్సింది. ‘తనని చదివిస్తే తను వెలిగిస్తుంది’ అని చెప్పడంలో ఆమె వెలగడం ఎక్కడా లేదు. అంతా చదివి ఏం లాభం? ‘హారతి గైకొనుమా’ అంటూ ఉండటమేనా స్త్రీ జీవితం. ప్రణబ్ ముఖర్జీ కన్నా నలభై ఏళ్లు ముందు పుట్టిన తెలుగు రచయిత, సంస్కర్త గుడిపాటి వెంకటాచలం. స్త్రీ అభ్యున్నతి కోసం ఆయన రాసినంతగా ఎవరూ రాయలేదు. అయినప్పటికీ ఎక్కడా విద్యతోనే స్త్రీ అభ్యున్నతి అని ఆయన అనలేదు. ‘అసలు జన్మ వల్ల సంస్కారం కలిగిన స్త్రీలున్నారు గొప్పవారు పల్లెటూళ్లలో. కానీ చదివి గొప్పవారైన స్త్రీలు ఈ దేశంలో లేనట్లున్నారు. మళ్లీ చదువుల వల్ల చక్కని పాలిష్ వొచ్చిన పురుషులున్నారు’ అని రాశారు ఒకచోట. ఎందుకలా మగవాళ్లు మాత్రమే పాలిష్ అవుతారూ అంటే ఎంత చదువుకున్న స్త్రీ అయినా ఇంటిని పాలిష్ చేస్తుండటమే ఆ చదువుకు సార్థకత అన్నట్లుగా వాళ్ల మైండ్‌ని వీళ్లు ఎప్పటికప్పుడు పాలిష్ చేస్తుంటారు కనుక. ప్రణబ్ బాగా చదువుకున్న మనిషి. 83 ఏళ్ల వయసులో ఇప్పటికీ చదువుతున్న మనిషి. రిటైర్ అయ్యి రాజాజీ మార్గ్‌లో ఉంటున్నా, ఆ రిటైర్మెంట్ నుంచి మరికాస్త రిటైర్ అవడం కోసం మిరాటీలో ఉంటున్నా, అప్పుడప్పుడూ సభలు సమావేశాలకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లొస్తున్నా.. కాస్త తీరిక చేసుకుని చిన్నపుస్తకమేదైనా రాస్తే బాగుంటుంది.. దీపమనీ, అపురూపమనీ స్త్రీని మభ్యపెట్టింది చాలు, ఆమె కోసం కూడా కాస్త ఆమెను వెలగనివ్వండి అని చెబుతూ! దీపం వెలుగులో ఎదగాలనుకోవడంలో తప్పులేదు. మనం ఎదగడం కోసమే దీపం వెలుగుతూ ఉండాలని అనుకోవడం అన్యాయం. -
విద్యతోనే మహిళలకు గౌరవం
సంగారెడ్డిజోన్ : స్వశక్తి, విద్యతోనే మహిళలకు గౌరవం లభిస్తుందని.. ఇందుకు సమాజ ఆలోచనా విధానంలోనూ మార్పులు రావాలని ప్రముఖ న్యాయవాది శైలజ పేర్కొన్నారు. రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన ఆమె ఎంచుకున్న న్యాయవాది వృత్తిలో రాణిస్తున్నారు. ఆమె మాటల్లో మరిన్ని వివరాలు.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీకే నారాయణరెడ్డి, జయప్రద దంపతుల మూడో కుమార్తె నేను. లెఫ్ట్ భావజాలం కలిగిన నాన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ప్రధాన ఉపాధ్యాయురాలిగా కొనసాగుతున్న అమ్మే మమ్మల్ని పెంచింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా మమ్మల్ని చదివించింది. అమ్మే నాకు రోల్ మోడల్. తన జీవితాన్నే మాకు పాఠంగా నేర్పింది. వేర్వేరు కుటుంబల నుంచి వచ్చి ఆదర్శ వివాహం చేసుకున్నామని అమ్మె మాకు చెప్పేది. ఈక్రమంలో భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను మాకిచ్చింది. నాటి ప్రముఖ రచయిత శరత్ సాçహిత్యం ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. విద్యార్థి దశలో లెఫ్ట్ రాజకీయాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అమ్మనాన్నల వల్ల నిజాయితీగా బతకడం నేర్చుకున్నా. ఎమ్మెల్యే కోటాలో హైదరాబాద్‌లో ఫ్లాట్ ఇస్తే తిరస్కరించాం. 1985లో సంగారెడ్డిలో నేను న్యాయవాద వృత్తిని చేపట్టిన సమయంలో మహిళలు ఎవరూ లేరు. నా సీనియర్ కుటుంబ స్నేహితుడు చల్ల నరసింహారెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశా. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ.. నిజాయితీగా పని చేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. కుటుంబంతో పాటు సమాజంపై అవగాహన కలిగి ఉండటం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నా. సమస్యల పరిష్కారానికి చట్టాలు సమస్యలు ఎన్ని ఉన్నయో.. వాటి పరిష్కారానికి అన్ని చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబాల ఆలోచనలో మార్పులు రావాలి. ఆడపిల్లలు అన్న చిన్నచూపు ఉండకూడదు. హంగు, ఆర్భాటం మధ్య వివాహాలు చేయడం వల్ల ఖర్చులు పెరిగి ఆడపిల్ల వివాహాన్ని తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. మోసపోతున్న బాలికలు కిశోర దశలో ఉండే సందిగ్ధం, ఆకర్షణ వల్ల బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారు. సమాజంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బాధితులకు చట్టపరమైన రక్షణ, సమాజ సహకారంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. -
కాశ్మీర్ నుంచి రావడం గర్వంగా ఉంది...
బంజారాహిల్స్: ‘విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం.. బాలికలు చదువుకుంటే ఆ కుటుం బంతో పాటు సమాజం అభివృద్ధి చెందు తుందని, పోలీస్ శాఖలో మరింత మంది మహిళలు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తు తం పోలీస్‌శాఖలోకి మహిళలు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకే నేను ఐపీఎస్ ఎంచుకున్నా’ అని జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి బిస్మాఖాజీ అన్నారు. గత మూ డున్నర నెలలుగా డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 92వ ఫౌండేషన్ కోర్సు శిక్షణలో ఉన్న ఆమె ‘సాక్షి’ తన అనుభవాలను పంచుకున్నారు బుధవారం ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జమ్మూకాశ్మీర్ నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన మహిళల్లో బిస్మా రెండోవారు ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి షీమా నబి అనే మహిళ ఐపీఎస్ అధికారిణి ఉన్నారు. ఇంట్లోనే శిక్షణ నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. ఇంట్లోనే చదువుకునేదాన్ని. ఎక్కువగా పత్రికలు చూసే దాన్ని. టీవీ చూసే అలవాటు లేదు. పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సెల్‌ఫోన్ కూడా పక్కనపెట్టేశాను. సినిమాలు చూసే అలవాటు లేదు. కాశ్మీర్ యూనివర్సిటీలో గోల్డ్‌మెడలిస్ట్... కాశ్మీర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించా. గ్రూప్స్‌లో మొదటిసారి 115 వ ర్యాంకు వచ్చింది. ఐఏఎస్ కావాలని కలలు కన్నా. అయితే రెండో ప్రాధాన్యం ఐపీఎస్ తీసుకున్నాను. ప్రస్తుతం ఐపీఎస్ కావడమే ఆనందం గా ఉంది. నా తండ్రి షఫిఖాజీ వ్యాపారి, తల్లి హలీమా గృహిణి. చెల్లెలిని ఐఏఎస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. స్నేహితులు తక్కువే... నాకు పెయింటింగ్స్ వేయడం ఇష్టం. సమాజిక సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం రెండు స్వచ్ఛంద సంస్థలకు పని చేస్తు న్నాను. స్నేహితులు చాలా తక్కువ.కుటుంబం తో ఎక్కువ గడుపుతాను. ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాల్లోనే పాల్గొంటాను. జమ్మూ కాశ్మీర్ నుంచి రావడం గర్వంగా ఉంది... మహిళలు పోలీస్‌శాఖలోకి రావడమే చాలా అరుదు. అందులోనూ జమ్మూకాశ్మీర్నుంచి ఒక ముస్లిం యువతి ఐపీఎస్ చేయడం మామూలు విషయం కాదు. మొదట్లో అందరూ నిరుత్సాహపరిచారు. అయితే శిక్షణ పొందుతున్న కొద్దీ దీని విలువ తెలుస్తోంది. -
రచయిత్రి మల్లాది సుబ్బమ్మ కన్నుమూత
-
ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ(90) కన్నుమూశారు. మహిళాభ్యుదయంపై ఆమె అనేక రచనలు చేశారు. హేతువాదం, కాంతికిరణాలు, చీకటి వెలుగులు నవలలు రాశారు. 12 సంస్థలు స్థాపించి మహిళాభ్యుదయం కోసం ఆమె కృషి చేశారు. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్య కోసం పాటు పడ్డారు. మల్లాది సుబ్బమ్మ 1924 ఆగస్టు 2న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో జన్మించారు. బాపట్లకు చెందిన ఎం.వి.రామమూర్తిని ఆమె వివాహం చేసుకున్నారు. అత్తమామలు వ్యతిరేకించినప్పటికీ భర్త సహకారంతో పెళ్లైన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించారు. 60పైగా రచనలు చేశారు. మల్లాది సుబ్బమ్మ మరణం పట్ల కవులు, రచయితలు సంతాపం ప్రకటించారు. మల్లాది సుబ్బమ్మ మరణం తీరని లోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు.