After Salons, Taliban Wants to Ban Neckties in Afghanistan - Sakshi
Sakshi News home page

తాలిబాన్‌ సంచలన నిర్ణయం.. వాటిపై నిషేధం, అలా జరిగితే ఇదే మొదటి సారి

Published Sat, Jul 29 2023 12:04 PM

Taliban Wants to Ban Men Neckties Afghanistan - Sakshi

2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ఆ దేశ ప్రజలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. అందులో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్‌ ధరించడాన్ని తప్పనిసరి,  యూనివర్సిటీ విద్యను అభ్యసించడాన్ని నిషేధించడంతోపాటు పాఠశాల విద్యపైనా అనేక ఆంక్షలు విధించారు. చివరికి మహిళలు బ్యూటీ పార్లర్లను నిషేధించారు. తాజాగా పురుషుల దుస్తులపై కూడా నిషేధాన్ని విధించేందుకు సిద్దమయ్యారు తాలిబన్లు.

వివరాల్లోకి వెళితే..  పురుషులు ధరించే నెక్‌టైలపై నిషేధం విధించేందుకు తాలిబన్లు సిద్ధమయ్యారు. నెక్‌టైలు క్రైస్తవ శిలువను పోలి ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. ఈ విషయాన్ని ‘ది ఇన్విటేషన్‌ అండ్‌ గైడెన్స్‌ డైరెక్టరేట్‌’ డైరెక్టర్‌ మొహమ్మద్‌ హషిమ్‌ షాహీద్‌ వ్రార్‌ వెల్లడించారు. అఫ్గాన్‌లో మతపరమైన విధానాలను నిర్ణయించే స్వతంత్ర సంస్థ ది ఇన్విటేషన్‌ అండ్‌ గైడెన్స్‌ డైరెక్టరేట్‌.

ఆయన దీనిపై మాట్లాడుతూ.. "కొన్నిసార్లు, నేను ఆసుపత్రులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ఆఫ్ఘన్ ముస్లిం ఇంజనీర్ లేదా డాక్టర్ నెక్‌టైని ఉపయోగించడం చూశాను. నెక్‌టైకి మూలం ఏంటి.. క్రిస్టియన్ శిలువను పోలి ఉందని, వీటిని నిషేధించాల్సి ఉందని" అని పేర్కొన్నాడు. నెక్టీలపై నిషేధం విధించినట్లయితే, తాలిబాన్ అధికారులు పురుషుల దుస్తులపై ఆంక్షలు విధించడం ఇదే మొడటి సారి అవుతుంది. 

చదవండి   US Woman Got 100 Amazon Orders: ఆర్డర్‌ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే..

Advertisement
Advertisement