
కాబూల్: మహిళల బలవంతపు పెళ్లిళ్లపై నిషేధం విధిస్తున్నట్లు అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ పాలకులు ప్రకటించారు. వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. పురుషులు, మహిళలు సమానమని, అతివను ఆస్తిగా పరిగణించకూడదంటూ కూడా పేర్కొన్నారు. తాలిబన్ అధిపతి హిబతుల్లా అఖుంద్‌జా పేరుతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అఫ్గాన్ గిరిజన తెగల్లో వితంతువులైన మహిళలు.. భర్త అన్నదమ్ముల్లోనే ఒకరిని తిరిగి వివాహం చేసుకోవాలన్న నియమం ఉంది.
ఇలాంటి ఆచారాలన్నింటినీ మార్చేలా తాలిబన్ల తాజా ఉత్తర్వులున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా భర్తను కోల్పోయిన మహిళ, 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని భర్తగా ఎంచుకొనే స్వేచ్ఛ ఇస్తున్నట్టు తాజా ఆదేశాల్లో తాలిబన్లు పేర్కొన్నారు.
చదవండి: ఎంత మంచి మనసో: రూ. 2 కోట్ల ఇంటిని కేవలం రూ. 100కే అమ్మకం
Comments
Please login to add a commentAdd a comment