నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది
‘‘సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దర్శకుడు ఓ సస్పెన్స్ ఫ్యాక్టర్ మెయిన్‌టైన్ చేశాడు. ఆ పాయింట్‌తో పాటు స్క్రీన్‌ప్లే నాకు నచ్చింది. ఈ రోజు ప్రేక్షకులు సైతం వీటి గురించి మాట్లాడు తుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు రాహుల్. వేణు మడికంటి దర్శకత్వంలో రాహుల్ హీరోగా తూము ఫణికుమార్, ‘శ్రేయాస్’ శ్రీనివాస్ నిర్మించిన ‘వెంకటాపురం’ శుక్రవారం విడుదలైంది. మౌత్ టాక్ వల్ల సింగిల్ స్క్రీన్స్‌లో ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయని, మల్టీప్లెక్స్‌లలో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయన్నారు రాహుల్. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు రొమాంటిక్ ఫిల్మ్స్, సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశా.
‘వెంకటాపురం’కు ముందు ఓ కొత్త జోనర్‌లో చేయాలని క్లియర్ కట్‌గా డిసైడయ్యా. ఆ టైమ్‌లో వేణు ఈ కథ చెప్పారు. అయితే సెకండాఫ్‌లో నా క్యారెక్టర్ గ్రాఫ్ ఛేంజ్ అయ్యి రివెంజ్ మోడ్‌లోకి వెళ్తుంది. స్టేషన్‌లో పోలీసులను కొడతా. జనాలు నన్ను ఆ సీన్స్‌లో యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే భయం ఉండేది. అక్కణ్ణుంచి సినిమా పీక్స్‌లోకి వెళ్లిందని చాలామంది చెప్పారు. ప్రేక్షకుల ప్రశంసలతో భవిష్యత్తులోనూ ఇలాంటి కొత్త కథలు చేయొచ్చనే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. నేను పదిమందిని కొడితే ప్రేక్షకులు నమ్మాలని సిక్స్ ప్యాక్ చేశా. సినిమా చూసి లక్ష్మీ మంచు, మనోజ్, సాయిధరమ్ తేజ్, సుధీర్‌బాబు వంటి ప్రముఖులు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఈ సినిమాతో నాకో కొత్త ఇమేజ్ రావడం హ్యాపీ’’ అన్నారు.