ఓంకారేశ్వర ఆలయంలో చోరీ | Theft at Omkareswara Temple | Sakshi
Sakshi News home page

ఓంకారేశ్వర ఆలయంలో చోరీ

Published Mon, Sep 26 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

ఓంకారేశ్వర ఆలయంలో చోరీ

ఓంకారేశ్వర ఆలయంలో చోరీ

వెంకటాపురం (మోపిదేవి): మండలంలోని వెంకటాపురంలోని శ్రీ అన్నపూర్ణ సమేత ఓంకారేశ్వరస్వామివారి దేవస్థానంలో దొం గలు పడ్డారు. శ్రీ అన్నపూర్ణమ్మ వారి రెండు మంగళసూత్రాలు, కల్యాణం బొట్టు, ముక్కుపుడక దొంగతనమయ్యాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయ ఈవో మోపిదేవి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు చల్లపల్లి పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. వీటి విలువ రూ. 30 వేలుగా చెబుతున్నారు. మచిలీపట్నం క్లూస్‌ టీం పరిశీలించి ఆధారాలు సేకరించింది. దొంగలు అమ్మవారి బంగారు నగలు దొంగిలించడంతో పాటు గర్భాలయంలోని హుండీని పగలగొట్టారు. అందులో పెద్దమొత్తంలో సొమ్ములేమీ లేవని చెబుతున్నారు. 
పోయిన నగలు చేయిస్తా: జడ్పీటీసీ 
శ్రీ అన్నపూర్ణమ్మ అమ్మవారికి పోయిన బంగారు నగలను తాను సమర్పిస్తానని జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లిఖార్జునరావు హామీ ఇచ్చినట్లు ఆలయ ఈవో మురళీకృష్ణ తెలిపారు. సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement