ఎవరో ఎవరో ఎదురుగ కలలా..! | "Venkatapuram," first song launch by vv vinayak | Sakshi
Sakshi News home page

ఎవరో ఎవరో ఎదురుగ కలలా..!

Published Tue, Feb 28 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

ఎవరో ఎవరో ఎదురుగ కలలా..!

ఎవరో ఎవరో ఎదురుగ కలలా..!

ఆగస్టు 28న విశాఖ, భీమిలి బీచ్‌లో చైత్ర అనే అమ్మాయి శవం పోలీసులకు కనిపిస్తుంది. చైత్రను ఎవరు చంపారు? ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఆనందేనా? హత్యకు ముందు ఏం జరిగింది? అనే కథతో రూపొందిన సినిమా ‘వెంకటాపురం’. ‘హ్యాపీడేస్‌’ ఫేమ్‌ రాహుల్, మహిమా మక్వాన్‌ జంటగా వేణు దర్శకత్వంలో ‘శ్రేయాస్‌’ శ్రీనివాస్, తుము ఫణికుమార్‌ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇందులోని ‘ఎవరో ఎవరో ఎదురుగ కలలా.. కలలా..’ అనే మొదటి పాటను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ మంగళవారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రేక్షకుల ఊహకు అందని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. రాహుల్‌ లుక్, న్యూ మేకోవర్‌ సినిమాకి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. అజయ్, జోగి బ్రదర్స్, శశాంక్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సాయిప్రకాశ్, సంగీతం: అచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement