తరుముకొచ్చిన మృత్యువు
Published Sat, Mar 25 2017 12:38 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఏలూరు అర్బన్ : మృత్యువు లారీ రూపంలో తరుముకొచ్చి బైక్‌ను ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్సై ఎంవీ సుభాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మండలం పోణంగి గ్రామానికి చెందిన బంకురు శ్రీనివాసరావు అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు గొట్టాపు వెంకటేశ్వరరావు (49)తో కలిసి బైకుపై వ్యక్తిగత పనులపై శుక్రవారం ఏలూరు ఎంపీడీవో కార్యాలయానికి బయలుదేరాడు. బైకు వెంకటాపురం పంచాయతీ రాజరాజేశ్వరి కాలనీ సమీపంలోకి వచ్చేసరికి వెనుకగా మితివీురిన వేగంతో దూసుకొచ్చిన లారీ» బైక్‌ను ఢీ కొట్టింది. దాంతో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు మిత్రులు రోడ్డుపై పడిపోయారు. బైకు నడుపుతున్న శ్రీనివాసరావు రోడ్డు మార్జిన్‌లో పడిపోగా వెనుక కూర్చున్న వెంకటేశ్వరరావు రోడ్డుపై పడ్డాడు. లారీ టైర్లు అతని తలమీద నుంచి వెళ్లడంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీనివాసరావు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్సై సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement