bike rider
-
రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో..
ఒక చోట అని కాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు డ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు భదత్రకు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. రోడ్డు భద్రతకు సంబంధించి నిత్యం అధికారులు జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిన్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల తమ జీవితాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టుతున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్ అగస్త్య చౌహాన్ మరణించాడు. ఉత్తరాఖండ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన జడ్ఎక్స్10ఆర్ నింజా సూపర్‌బైక్‌పై గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నివాసి అయిన అగస్త్య చౌహాన్ ప్రొఫెషనల్ బైకర్. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే మోటార్‌బైక్ రేసింగులో పాల్గొనేందుకు బుధవారం జడ్ఎక్స్10ఆర్ నింజా సూపర్‌బైక్‌పై ఆగ్రా నుంచి బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని టప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేకు చేరుకోగానే.. గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని సాధించడానికి ప్రయత్నించాడు. బైక్ వేగంగా దూసుకుపోతున్న సమయంలో అతడు ఒక్క సారిగా తడబడ్డాడు. దీంతో అగస్త్య బైక్ అదుపుతప్పి యమునా ఎక్స్‌ప్రెస్‌వే డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అగస్త్య తలకు బలమైన గాయం తగలడంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదం దాటికి అతను ధరించి ఉన్న హెల్మెట్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. మొదటిసారిగా ఈ సాహసం చేసిన అగస్త్య దుర్మరణం చెందడంతో అతని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా అగస్త్యకు ‘PRO RIDER 1000’ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీనికి 1.2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. వేగంగా బైక్ నడుపుతూ స్టంట్లు చేస్తున్న వీడియోలను తన ఛానెల్లో అప్లోడ్ చేసేవాడు. ప్రమాదం జరగడానికి 16 గంటల ముందు కూడా ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. వేగంగా వాహనాలు నడపడం ప్రమాదకరం అని తన ప్రతి వీడియోకు హెచ్చరికలు సైతం జారీ చేసేవాడు. చివరికి అదే వేగంతో తన ప్రాణాలు కోల్పోయాడు. -
స్త్రీ శక్తి: బ్యాక్ ఆన్ ది బైక్ పడి లేచిన కెరటం
ఫిమేల్ మోటర్ స్పోర్ట్స్ అథ్లెట్‌గా ప్రయాణం సులువేమీ కాదు. మద్దతు ఇచ్చే వాళ్ల కంటే వద్దనే వాళ్లే ఎక్కువ... దీనికి ఐశ్వర్య మినహాయింపు కాదు. మొన్న...‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అని ఆశ్చర్యంగా అడిగారు. నిన్న... ‘స్లోయెస్ట్ బైకర్’ అని ముఖం మీదే అన్నారు. ఇప్పుడు మాత్రం... ఐశ్వర్య గురించి ‘ఆశాకిరణం లాంటి ప్రొఫెషనల్ బైకర్’ అంటున్నారు... బెంగళూరుకు చెందిన ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో నాన్న బైక్ ఉండేది. ప్రతి ఆదివారం ఆ బైక్‌పై తనను ఏదో ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళుతుండేవాడు. ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన తరువాత ఐశ్వర్యకు బైకే లోకం అయింది. ఫ్రెండ్స్‌ను తీసుకొని రోజూ బైక్‌పై చక్కర్లు కొట్టేది. ఇలా తిరుగుతున్న రోజుల్లో ఒకసారి టీవిలో మోటోజీపి రేస్ చూసి ‘వావ్’ అనుకుంది. అలాంటి రేస్‌లో ఒకరోజు తాను భాగం అవుతానని అనుకోలేదు ఐశ్వర్య. ఇక అది మొదలు... మోటర్‌స్పోర్ట్స్, మోటర్‌స్పోర్ట్స్ అథ్లెట్ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. నిజంగా చెప్పాలంటే అదొక ప్రపంచం! నిన్నటివరకు బైకింగ్ అనేది తనకు సరదా మాత్రమే. క్రికెట్, ఫుట్‌బాల్‌లాగే అది కూడా ఒక ఆట అని, దానిలో నిరూపించుకుంటే అంతర్జాతీయస్థాయికి వెళ్లవచ్చు అని తెలిశాక ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రైనింగ్, రేసింగ్తోనే రోజులు గడిచేవి. అయితే ఐశ్వర్య అమ్మానాన్నలకు, వారి అమ్మా, నాన్నలకు ఆమెను పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్‌గా చూడాలనేది కల. అయితే వారొకటి తలిస్తే ఐశ్వర్య కల ఒకటి తలిచింది. తండ్రి ససేమిరా అన్నాడు. తల్లి మాత్రం పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తూ మద్దతు ఇచ్చేది. 2018లో కొద్దిమందితో కలిసి జోర్డీ అనే కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంది. జోర్డీ సలహా మేరకు బజా అరగాన్, స్పెయిన్‌లో పాల్గొని ఫస్ట్ ఫిమేల్ ఇండియన్‌గా చరిత్ర సృష్టించింది ఐశ్వర్య. (స్పానిష్ బజా...స్పెయిన్‌లోని అరగన్ ప్రాంతంలో జరిగే ర్యాలీ రైడ్ లేదా క్రాస్–కంట్రీ ర్యాలీ. ఆఫ్రికన్ ఎడ్వెంచరస్ ర్యాలీలను స్ఫూర్తిగా తీసుకొని 1983లో దీనిని దేశంలో మొదలుపెట్టారు) ఆరుసార్లు నేషనల్ రోడ్రేసింగ్ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచింది. 2019లో మోటర్ స్పోర్ట్స్‌లో వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తన సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మోటర్‌స్పోర్ట్స్ లో మన దేశానికి సంబంధించి గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఐశ్వర్య పేరు ఒకటి. ‘నిజానికి మా కుటుంబంలో మోటర్‌స్పోర్ట్స్ గురించి తెలిసిన వారు లేరు. వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి గైడ్ చేసేవారు కూడా లేరు. నాకు నేనే తెలుసుకుంటూ వెళ్లాను. రేస్‌లలో పాల్గొనడం ద్వారా ఎంతోమందితో మాట్లాడి, వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది ఐశ్వర్య. ‘ప్లాన్ బీ’ లేదా సెకండ్ కెరీర్ అనేవి ఉండాలి అంటారు. అయితే ఒక రంగంలోకి, ఒక లక్ష్యం కోసం దిగిన వారు ‘ప్లాన్ బీ’ గురించి ఆలోచించవద్దు అంటుంది ఐశ్వర్య. ‘ఈ రంగంలో రాణించకపోతే నెక్స్›్టఏమిటి? అని ఎప్పుడూ ఆనుకోలేదు. కచ్చితంగా సాధించాల్సిందే అనుకున్నాను’ అంటుంది ఐశ్వర్య. స్పెయిన్‌లో మహిళలు మోటర్‌స్పోర్ట్స్‌లో రాణించడానికి అనువైన వాతావరణం, మౌలిక వసతులు ఉన్నాయి. కుటుంబ మద్దతు కూడా బలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలని కోరుకుంటుంది ఐశ్వర్య. మోటర్ స్పోర్ట్స్ అంటే పరాజయాలు, విజయాలు మాత్రమే కాదు... గట్టి గాయాలు కూడా. ఒక ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది ఐశ్వర్య. ఇక ఆమె నడవడం కూడా కష్టమే అనుకున్నారంతా. అయితే ‘బ్యాక్ ఆన్ ది బైక్’ అంటూ మళ్లీ విజయపథంలో దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు! -
ఉమన్ బైక్ ట్యాక్సీ రైడర్
నాన్న, అన్నయ్య, భర్త, కాకుండా ఎంతో దగ్గరి స్నేహితుడైతేనే అమ్మాయిలు ఇతరుల టూవీలర్ ఎక్కుతారు. అటువంటిది తన స్కూటర్ మీద ఎంతోమందిని ఎక్కించుకుని వివిధ ప్రాంతాల్లో దించుతూ వచ్చిన సంపాదనతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది మౌతుషి బసు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మౌతుషి ఊబెర్ టూవీలర్ రైడర్‌గా మారింది. కరోనా కారణంగా లక్షలాదిమంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడిన సంగతి తెలిసిందే. ఆకలికి ఉద్యోగం ఉందా ఊడిందా అనేది తెలియదు. అందుకే ఎంతోమంది తమ అర్హతలకు సరిపోని ఉద్యోగాల్లో చేరి మరీ కుటుంబాలను లాక్కొస్తున్నారు. ఈ కోవకు చెందిన 30 ఏళ్ల అమ్మాయే మౌతుషి. కరోనాకు ముందు పానాసోనిక్ కంపెనీలో ఉద్యోగం చేసేది. కరోనాతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. దీంతో ఉద్యోగాల కోసం తీవ్రంగా వెతికింది. కానీ ఎక్కడా తనకు సరిపోయే జాబ్ దొరకలేదు. అయినా ఏ మాత్రం నిరాశపడకుండా వెతుకుతూనే ఉంది. చివరికి ఊబెర్లో టూవీలర్ రైడర్‌గా చేరింది. అంతకుముందు రైడింగ్‌లో ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ.. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైడర్‌గా పనిచేస్తోంది. అనుకోకుండా రణవీర్ భట్టాచార్య అనే రైటర్ ఇటీవల మౌతుషి టూవీలర్ ఎక్కాడు. డ్రైవర్ అమ్మాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తర్వాత మౌతుషితో మాట్లాడి ఆమె గురించి తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు చూసిన వారంతా ‘సిస్టర్ నువ్వు ఎంతోమందికి ప్రేరణ’ అని అభినందిస్తున్నారు. అంతేగాక రణవీర్‌ని కూడా తెగపొగిడేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతని పోస్టు వేలసంఖ్యలో లైక్‌లతో తెగ వైరల్ అవుతోంది. కుటుంబం కోసం తన శాయశక్తులా కృషిచేస్తోన్న మౌతుషి ఎంతోమంది యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. -
ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో విషాదం.. మోటో3 రైడర్ మృతి
రోమ్: ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో విషాదం చోటచేసుకుంది. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ టోర్నీలో స్విట్జర్లాండ్‌కు చెందిన మోటో 3 డ్రైవర్ జాసన్ డుపాస్క్వియర్ ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా తీవ్ర గాయాలతో పాటు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉండడంతో జాసన్ ఆదివారం మృతి చెందినట్లు ఇటాలియన్ గ్రాండ్ప్రిక్స్ మోటోజీపి నిర్వాహకులు ప్రకటించారు. జాసన్ డుపాస్క్వియర్ మృతి పట్ల మోటోజీపీ ట్విటర్లో సంతాపాన్ని ప్రకటించింది. 'మోటోజీపీ తరపున జాసన్ డుపాస్క్వియర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుతున్నాం. ఇంత చిన్న వయసులో అతను మనల్ని వదలివెళ్లడం బాధాకరం. ఈ సందర్భంగా అతని ఫ్యామిలీ, మిత్రులకు మా ప్రగాడ సానభూతిని తెలుపుతున్నాం అని ట్వీట్ చేసింది. కాగా మోటో 3 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో డుపాస్క్వియర్ ప్రస్తుతం రెండవ సీజన్లో ఉన్నాడు. కాఆగా అతను 27 పాయింట్లతో మోటో3లో 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. డుపాస్క్వియర్ తన కెరీర్‌ను సూపర్మోటోలో ప్రారంభించాడు, అక్కడ అతను చాలాసార్లు స్విస్ జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లేముందు 2016 లో ఎన్ఇసి ఛాంపియన్షిప్ మోటో 3 టైటిల్‌ను గెలుచుకున్నాడు. చదవండి: డబ్బులు ఇవ్వమన్నందుకు సుశీల్ నన్ను చితకబాదాడు -
బైక్ నేర్చుకున్నాకే ఇంట్లోకి రా
సత్యవేణి టెన్నిస్ క్రీడాకారిణి. ఓరోజు బైక్ యాక్సిడెంట్ అయింది! ‘మీరిక ఆడలేరు’ అన్నారు డాక్టర్లు. ఇంట్లోనే ఉండిపోయింది. డిప్రెషన్లోకి వెళ్లింది. తల్లి తల్లడిల్లిపోయింది. చూసి చూసి.. ఓ రోజు.. కూతుర్ని బైటికి లాక్కొచ్చింది. ఎదురుగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్! ‘బైక్ నేర్చుకున్నాకే ఇంట్లోకి రా..’ అని..తలుపులు వేసేసింది! ఆ తర్వాత చాలా నేర్చుకుంది సత్యవేణి. ముఖ్యంగా ధైర్యంగా ఉండటం. ఇప్పుడామె బైక్ పెయింటర్‌గా రాణిస్తోంది. అమ్మాయిలకు బైక్ డ్రైవింగూ నేర్పిస్తోంది! కాలర్ : ‘హలో.. నా బైక్‌ని సూపర్ యూనిక్ డిజైన్‌తో మార్చేయాలి. మీ ఓనర్‌కి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి’ సత్యవేణి : ‘నేనే ఓనర్ని. మీరు ఒకసారి వచ్చి డిజైన్ సెలక్ట్ చేసుకుంటే అలాగే చేసి ఇస్తాం’ కాలర్ : ‘లేడీస్.. బైక్ పై పెయింట్ చేయడమా?!...’ వెంటనే ఫోన్ కట్ అయిన సౌండ్..ఫోన్ పక్కన పెట్టేస్తూ .. ‘ఇదండీ.. అమ్మాయిలు మోటార్ సైకిల్‌పై పెయింట్ చేయలేరని, అదంతా మగవారి పనే అనుకుంటున్నారు. ఫోన్ చేస్తారు, లేడీ వాయిస్ వినగానే వారి టోన్ మారిపోతుంది’ నవ్వేసింది సత్యవేణి. ∙∙ ‘లేడీ విత్ బుల్లెట్’ అని అంతా పిలిచే సింగజోగి సత్యవేణి మోటార్ సైకిళ్లపై, హెల్మెట్లపై పెయింటింగ్ వేయడంలో బిజీగా ఉంటోంది. ఇప్పటికి వందల బైక్‌లపై, హెల్మెట్లపై క్రియేటివ్‌గా పెయింట్స్ వేసి ఆకట్టుకుంది. మైటార్సైకిల్పై ఆర్ట్ వేసే మహిళలు మన దేశంలో ఎవరూ లేరు. ఇక ముందు ఎవరైనా ఈ ఫీల్డ్‌లోకి రావాలనుకుని సెర్చ్ చేస్తే నా పేరే కనపడుతుంది’ అని గర్వంగా చెబుతున్న సత్యవేణి ‘హస్కీ కేపర్స్’ ఎన్జీవో ద్వారా రెండేళ్లుగా మహిళలకు బైక్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తోంది. హైదరాబాద్ బాలానగర్‌లో ఉంటున్న సత్యవేణికి బుల్లెట్‌తో దోస్తీ ఎలా కుదిరింది? మగవారే ఉన్న రంగంలో తను ఎలా రాణిస్తోంది? ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. టెన్నిస్‌కు బ్రేక్.. డిప్రెషన్‌తో లాక్ ‘‘టెన్నిస్ క్రీడాకారిణిగా రాణించాలని నా ధ్యేయంగా ఉండేది. నేషనల్ లెవల్ ప్లేయర్‌ని కూడా. కాలేజీలో చదువుతున్నప్పుడు ఓ రోజు ప్రాక్టీస్‌కి మా అన్నయ్యతో కలిసి బైక్‌పై వెళుతుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో మమ్మల్ని ఢీకొన్న బైక్ వచ్చి నా కాలు మీద పడింది. సర్జరీ అయ్యాక ‘ఈ ఇబ్బందితో ఎక్కువ కాలం ప్లేయర్‌గా రాణించలేరు’ అన్నారు డాక్టర్లు. దీంతో నా కెరియర్‌కు ఫుల్స్టాప్ పడింది. డిప్రెషన్‌కు లోనయ్యాను. ఏడు నెలల పాటు చీకటి గదే లోకంగా బతికాను. పొడవాటి నా జుట్టును కత్తిరించుకున్నాను. చేతులు కాళ్లు కోసుకునేదాన్ని. అంతా శూన్యంలా ఉండేది. ఇదంతా చూసిన మా అమ్మ కళ్యాణి తట్టుకోలేకపోయింది. ఓ రోజు గదిలో నుంచి నన్ను బయటకు లాక్కొచ్చింది. ఎదురుగా కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్! ఆశ్చర్యంగా అమ్మవైపు, బైక్ వైపు చూశాను. నాకు డ్రైవింగ్ రాదు. పైగా, బైక్ వల్లే నా కెరియర్‌కు ఫుల్స్టాప్ పడింది. బైక్ అంటే నాకు అపరిమితమైన భయం. అమ్మ బైక్ కీస్ నా చేతులో పెట్టి ‘ఈ బైక్ నడపడం నేర్చుకుని ఆ తర్వాతే ఇంటికి రా! అప్పటి వరకు నీ ముఖం నాకు చూపించొద్దు’ అంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ కోపం తగ్గాలంటే నేను బైక్ నేర్చుకోవాలి. అదొక్కటే మైండ్‌లో ఉంది. మా కజిన్ సాయంతో బైక్ తీసుకొని గ్రౌండ్కెళ్లా. రెండు రోజుల్లో బుల్లెట్ నడపడం నేర్చుకున్నాను. నిరాశ స్థానంలో ఉత్సాహం వచ్చి చేరింది. కస్టమైజ్డ్ బైక్ పెయింటింగ్ రోజూ 150 – 200 ల కిలోమీటర్లు బైక్ పై తెగ తిరిగేసేదాన్ని. లాంగ్ డ్రైవ్, సోలో డ్రైవ్.. మైండ్ ఫ్రెష్ అయ్యింది. బైక్ నా ఫ్రెండ్ అయిపోయింది. నా ఉత్సాహం చూసి అమ్మ చాలా సంతోషించింది. కొన్నాళ్లుగా బండి–నేను అంతే. పెయింటింగ్ చిన్నప్పటి నుంచి నాకో హాబీగా ఉండేది. ఆ ఆలోచనతో నా బండికి కొత్త రూపు తీసుకురావాలనుకున్నాను అదీ పెయింటింగ్ ద్వారా. అనుకున్నట్టుగా నాదైన డిజైన్ని బైక్‌పై వేశా. ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశా. చాలా మందికి నచ్చింది. మా బైక్‌కి డిజైన్ చేస్తారా అని అడిగారు కొందరు. దీంతో బైక్స్ కస్టమ్ డిజైన్ ఆర్ట్ వర్క్‌ను కెరియర్‌గా మార్చుకుంటే బాగుంటుంది అనిపించింది. అప్పుడు గూగుల్ మొత్తం వెదికాను. ఎవరైనా మహిళలు ఈ రంగంలో ఉన్నారా అని. ఇండియా మొత్తమ్మీద బైక్‌పై పెయింటింగ్ చేసే మహిళలెవరూ లేరు. మా అక్క సంగీతకు యానిమేషన్లో నైపుణ్యం ఉంది. తనతో నా ఆలోచనలు పంచుకున్నాను.గుడ్ ఐడియా అంది. దీనిని వ్యాపారంగా మొదలుపెట్టాలని womeneoteric customs ప్రారంభించాను. వచ్చిన ఆర్డర్స్‌ను వచ్చినట్టే సరికొత్తగా డిజైన్ చేసి ఇస్తున్నాను. వరల్డ్ ఎగ్జిబిషన్లలో నేను డిజైన్ చేసిన బైక్, హెల్మెట్ పెయింటింగ్స్ ప్రదర్శనకు నిలిచాయి. ఇప్పటికి నాలుగువందల వరకు బైక్స్, హెల్మెట్స్ డిజైన్స్ చేశాను. బైక్ డ్రైవింగ్ క్లాస్‌లు ఇప్పుడు విజయవాడలోనూ మహిళలకు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. బైక్ నేర్చుకోవడానికి వస్తున్న మహిళలను చూస్తుంటే చాలా సంతోషమనిస్తుంది. ‘మా అమ్మకు డ్రైవింగ్ నేర్పించండని కొడుకు, మా ఆవిడకు నేర్పించండని భర్త, మా కూతురుకు నేర్పించమని తండ్రి.. ఇలా మగవాళ్లే స్వయంగా తమ ఇంటి మహిళలకు బైక్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించడం ఆనందమేస్తోంది. ఆరేళ్లుగా ఈ బైక్ నా జర్నీని చాలా అందంగా మార్చుతూనే ఉంది’ అని వివరించారు సత్యవేణి. – నిర్మలారెడ్డి -
డ్రీమ్ రైడర్
‘‘ఫస్టియర్‌లో మాత్రమే ఫస్ట్మార్క్ వస్తే అదృష్టమనుకుంటారు.. సెకండియర్‌లో కూడా నిలుపుకున్నావనుకో హార్డ్‌వర్క్ అని నమ్ముతారు’’ ఇది ఒక అక్క తన చెల్లికి చెప్పిన మాట. విన్న చెల్లి ఇంటర్ సెకండియర్‌లో కూడా ఫస్ట్మార్క్ తెచ్చుకుంది. భవిష్యత్‌పట్ల కన్న కలలను ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటోంది. ఆమే లక్ష్మీగాయత్రి ఆకుండి. ఈ అమ్మాయికి ఇంకో ప్రత్యేకతా ఉంది. హైదరాబాద్‌లో రాపిడో (టూ వీలర్ ట్యాక్సీ)లో తొలి మహిళా కెప్టెన్. వ్యవహారంలో టూ వీలర్ ఉమన్ ట్యాక్సీ రైడర్. అసలు ఆ సాహసం గురించే ఆరా తీద్దామని గాయత్రిని కదిలిస్తే ఆమె సాధించిన ఇంకొన్ని లక్ష్యాలూ తెలిశాయి. అన్నిటి గురించి క్లుప్తంగా ఇక్కడ.. స్వభావరీత్యా ఇంట్రావర్ట్, చదువు మీద పెద్దగా ఆసక్తిలేని గాయత్రి ఇంటర్లో ఫస్ట్రావడానికి కారణం.. టూ వీలర్ అనే తాయిలం. తొమ్మిదో తరగతిలో తన తమ్ముడితో (కజిన్) కలిసి గేర్ బైక్ నడపడం నేర్చుకుంది. ఆ అమ్మాయికి డ్రైవింగ్ ప్యాషన్. టెన్త్ తర్వాత చదువులో ఆమెను ముందుకు తోయడానికి ‘‘ఇంటర్ ఫస్టియర్‌లో మంచి మార్కులు వస్తే నీకు బండి కొనిపెడ్తాను’’ అని ఆశ పెట్టాడు తండ్రి. బండి కోసం ఇంటర్‌ను ఇష్టపడి తను తీసుకున్న కామర్స్ గ్రూప్‌లోనే కాదు అన్ని గ్రూపుల్లోకి ఫస్ట్‌గా నిలిచింది. ‘‘పద్దెనిమిదేళ్లు నిండితేనే బండి.. ఇంటర్ సెకండియర్ కూడా పూర్తి అవనీ..’’ అన్నాడు తండ్రి నింపాదిగా. అప్పుడే అన్నది బ్రిలియంట్ స్టూడెంట్ అయిన అక్క పైన ప్రస్తావించిన మాటను. కష్టపడి ఇంటర్ సెకండియర్‌లో కూడా అన్ని గ్రూపుల్లోకి మళ్లీ ఫస్ట్ మార్క్ తెచ్చుకుంది. బండి కొనిపించుకుంది. అయితే దీనికన్నా ముఖ్యమైన లక్ష్యం ఉంది గాయత్రికి.. ఫ్యాషన్ డిజైనర్ కావాలని. బార్బీ బొమ్మ .. సినిమాలకు కాస్ట్యూమ్స్ నాన్నమ్మ కొనిచ్చిన బార్బీకి దర్జీ దగ్గర్నుంచి తెచ్చుకున్న గుడ్డముక్కలతో డ్రెస్‌లు కుట్టడం, బొమ్మలేయడం చిన్నప్పటి నుంచి గాయత్రికున్న వ్యాపకం. ఈ అమ్మాయి ఆసక్తి గమనించిన ఆమె పిన్ని ఫ్యాషన్ డిజైనింగ్ గురించి చెప్పింది. ఆ క్షణం నుంచి ఫ్యాషన్ డిజైనింగే ధ్యేయంగా పెట్టుకుంది గాయత్రి. పదవ తరగతి అయిపోగానే ఆ కోర్సులో చేరుతానని చెప్పిన గాయత్రిని ‘‘ఇంటర్ తర్వాతే నీకు ఆసక్తి ఉన్న కోర్స్’’ అని కన్విన్స్ చేశారు పేరెంట్స్. ఇంటర్ అయ్యాక డిగ్రీ అన్నారు. అందుకే డిగ్రీ తర్వాతే హైదరాబాద్‌లోని హ్యామ్స్టెక్ కాలేజ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది. ఆ సమయంలోనే కజిన్ ద్వారా ఒక సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం వచ్చింది ఆమెకు. దాంతో ఆమె వర్క్ తెలిసి వెంటవెంటనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. సినిమాలతోపాటు కమర్షియల్ యాడ్స్కీ పనిచేసింది. మరి రాపిడో..? ‘‘నేను కమర్షియల్ యాడ్స్‌కి పని చేస్తున్నప్పుడు నా సాఫ్ట్వేర్ ఫ్రెండ్ ఒకరు ఐటీ సెంటర్ నుంచి ఎక్కడో ఉన్న వర్క్ప్లేస్కొచ్చి నన్ను కలిసేవాడు. ఇంత దూరం ఎలా వచ్చావ్ అని అడిగితే రాపిడో టూ వీలర్ ట్యాక్సీ అని చెప్పేవాడు. ఆ టైమ్‌లోనే బెంగళూరులో రాపిడో ట్యాక్సీ రైడ్ చేస్తున్న ఉమన్ గురించి ఆర్టికల్ కూడా చదివా. నాకూ బైక్ నడపడం ఇష్టం, సరదా కాబట్టి రాపిడో కెప్టెన్‌గా అప్లయ్ చేశా. నిజానికి కొన్ని నిమిషాల్లో వెరిఫికేషన్ జరుగుతుంది. కానీ నా విషయంలో మూడు వారాలైనా ఏ రెస్పాన్స్ రాలేదు. డైరెక్ట్‌గా ఆఫీస్‌కు వెళ్లి అడిగా. కొంచెం తటపటాయించి ‘‘అమ్మాయిలకు ఇంకా ఇవ్వడం లేదు సేఫ్టీగ్రౌండ్లో... ’’ అన్నారు. ‘మీరే అలా అంటే ఎలా? నా విషయంలో మీకు ఏ భయమూ అక్కర్లేదు. నేను సెల్ఫ్ డిఫెన్సివ్’ అని పోరితే.. చాలా సేఫ్టీ మెజర్స్ చెప్పి అప్రూవ్ చేశారు. నా ఫస్ట్ రైడ్ మెహిదీపట్నంలో. ఒక అబ్బాయి. నన్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. ప్రశ్నలేవీ అడగకుండానే బండి మీద కూర్చున్నాడు. కొంచెం అసౌకర్యంగా ఫీలవుతుంటే చెప్పాను.. కంఫర్టబుల్‌గానే ఉండండి అని. అతని డెస్టినేషన్‌లో దిగిపోయాక చెప్పా... ఇది నా ఫస్ట్‌రైడ్ అండీ అని. కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత నుంచి వరస రైడ్స్. సాధారణంగా ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు, సాయంకాలం అయిదు నుంచి ఏడు వరకు మాత్రమే రైడ్స్‌కి వెళ్తా. ఒకరోజు మాత్రం రోజంతా తిరగాలనిపించి టిఫిన్ బాక్స్ కూడా తీసుకెళ్లా. తినడానికి టైమ్ దొరికినా ప్లేస్ దొరకదు ఎక్కడా! అప్పుడనిపించింది హైదరాబాద్‌లో షెడ్స్లాంటివి కట్టి డైనింగ్ ప్లేసెస్‌గా డెవలప్ చేస్తే ఎంతోమందికి ఉపయోగం ఉంటుంది కదా అని. రైడింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఎవరూ నాతో మిస్ బిహేవ్ చేయలేదు. చాలా మంది తర్వాత వాట్సాప్‌లో ‘‘డూయింగ్ గుడ్.. గుడ్ జాబ్..’’ అంటూ మెసేజ్ పెట్టినవాళ్లే. ఒకతనైతే.. ఆడపిల్లలు బైక్ నడుపుతుంటే నాకు చాలా భయమేసేది. ఆమడదూరంలోంచి వెళ్లేవాణ్ణమ్మా. కాని నువ్వు నా ఒపీనియన్‌ను పటాపంచలు చేశావ్. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావ్ అని అప్రిషియేట్ చేశాడు’’ అని రాపిడో రైడర్‌గా తన అనుభవాలను చెప్పింది గాయత్రి. మాయ... ఒకవైపు సినిమాలు, ఇంకో వైపు కమర్షియల్స్ బిజీలో రాపిడో స్పీడ్‌ను కొంచెం స్లో చేసింది. పైగా ఇప్పుడు తన చిరకాల ఇచ్ఛ... లక్ష్యం అయిన ఫ్యాషన్ డిజైనర్‌గా ‘మాయ’ పేరుతో బ్రాండ్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి త్వరలోనే ‘మాయా డిజైనర్ స్టూడియో’నూ ప్రారంభించనుంది. ‘‘పనికి అమ్మాయి, అబ్బాయి అన్న తేడా లేదు. కావల్సిందల్లా క్లారిటీ, కాన్ఫిడెన్స్ మాత్రమే. సెల్ఫ్ డిఫెన్సివ్‌గా ఉండాలి. మన బలం, బలహీనత పేరెంట్స్‌కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే అన్ని విషయాలనూ షేర్ చేసుకోవాలి. పేరెంట్స్‌ను మించిన ఫ్రెండ్స్ ఉండరు. జీవితంలో ప్రతిక్షణం విలువైందేనని గుర్తుంచుకోవాలి’’ అంటుంది లక్ష్మీ గాయత్రి ఆకుండి. – సరస్వతి రమ -
వాహనదారులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై వేటు
-
ట్రాఫిక్ పోలీసులకు అనుకోని షాక్
-
వారిపై కఠిన చర్యలు తీసుకోండి : సచిన్
న్యూఢిల్లీ : నాణ్యత లేని హెల్మెట్లను తయారీ చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీమిండియా క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. భద్రత కోసం వాడే వస్తువులు చాలా నాణ్యతగా ఉండాలని, క్రికెటర్లు మైదానంలో వాడే వస్తువులంతా నాణ్యమైనవిగా ఉండాలని సచిన్ లేఖలో ప్రస్తావించారు. ఇక దేశంలోని 70 శాతం ద్విచక్ర వాహనదారులు నకిలీ హెల్మెట్లు వాడుతున్నారని, చాలా కంపెనీలు ఎలాంటి నాణ్యమైన ప్రమాణాలు పాటించకుండా నకిలీ ఐఎస్ఐ ముద్రను ముద్రించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇవి వాహనదారుల భద్రతకు ప్రమాదమని, ప్రమాదాల తీవ్రతను మరింత పెంచేలా చేస్తాయన్నారు. నకిలీ హెల్మెట్లు తలకు అయ్యే గాయల నుంచి రక్షించలేవన్నారు. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా టూవీలర్స్ రైడర్సే మరణిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రజా రక్షణ కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని తాను భావిస్తున్నానని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కంపెనీల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. తక్కువ ధరలోనే నాణ్యమైన హెల్మెట్లు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఉపయోగించేలా ప్రభుత్వం తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ విషయంలో తనవంతు సాయం చేస్తానని సచిన్ స్పష్టం చేశారు. నకిలీ హెల్మెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సచిన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా సచిన్ ద్విచక్రవాహన దారులు హెల్మెట్ ధరించాలని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలుసార్లు ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
వావ్ వాట్ ఎ స్టంట్.. రికార్డ్ బ్రేక్
-
ఇలాంటి సాహసం మీరు చేయకండి
అమెరికా: మనకు ఓ చిన్న కాలువ అడ్డు వస్తేనే దాటడానికి జంకుతాము. అలాంటిది ఏకంగా 75 అడుగలు దూరాన్ని ఎంతో సులువుగా ఓ వ్యక్తి బైక్‌పై బ్యాక్ ప్లిప్ చేసి వరల్డ్ రికార్డ్‌ని తిరగ రాశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన బైక్ స్టంట్ రైడర్ ట్రావిస్ పాస్ట్రానా లండన్‌లోని థేమ్స్ నదిలో ఓ ప్రయోగం చేశాడు. యుకే పర్యటనలో భాగంగా నిట్రో సర్కస్‌లో తన నైపుణ్యాన్ని చూపించాడు. థేమ్స్ నదిలో రెండు పడవల మధ్య దూరం 75 అడుగులు ఉంది. ఈ దూరాన్ని తన బైక్‌పై సులువుగా బ్యాక్ ప్లిప్ చేశాడు. దీంతో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతికి గురైపోయారు. ట్రావిస్ పాస్ట్రానా దీంతో ప్రంపంచ రికార్డును తిరగరాశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
తరుముకొచ్చిన మృత్యువు
ఏలూరు అర్బన్ : మృత్యువు లారీ రూపంలో తరుముకొచ్చి బైక్‌ను ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్సై ఎంవీ సుభాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మండలం పోణంగి గ్రామానికి చెందిన బంకురు శ్రీనివాసరావు అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు గొట్టాపు వెంకటేశ్వరరావు (49)తో కలిసి బైకుపై వ్యక్తిగత పనులపై శుక్రవారం ఏలూరు ఎంపీడీవో కార్యాలయానికి బయలుదేరాడు. బైకు వెంకటాపురం పంచాయతీ రాజరాజేశ్వరి కాలనీ సమీపంలోకి వచ్చేసరికి వెనుకగా మితివీురిన వేగంతో దూసుకొచ్చిన లారీ» బైక్‌ను ఢీ కొట్టింది. దాంతో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు మిత్రులు రోడ్డుపై పడిపోయారు. బైకు నడుపుతున్న శ్రీనివాసరావు రోడ్డు మార్జిన్లో పడిపోగా వెనుక కూర్చున్న వెంకటేశ్వరరావు రోడ్డుపై పడ్డాడు. లారీ టైర్లు అతని తలమీద నుంచి వెళ్లడంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీనివాసరావు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్సై సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీ కొన్న బైక్: ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా డెంకాడ మండలం తాడివాడ వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ బైక్ చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు మృతి వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించిన పోలీసుల సహాయంతో క్షతగాత్రుడిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.