
అమెరికా: మనకు ఓ చిన్న కాలువ అడ్డు వస్తేనే దాటడానికి జంకుతాము. అలాంటిది ఏకంగా 75 అడుగలు దూరాన్ని ఎంతో సులువుగా ఓ వ్యక్తి బైక్‌పై బ్యాక్ ప్లిప్ చేసి వరల్డ్ రికార్డ్‌ని తిరగ రాశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన బైక్ స్టంట్ రైడర్ ట్రావిస్ పాస్ట్రానా లండన్‌లోని థేమ్స్ నదిలో ఓ ప్రయోగం చేశాడు.
యుకే పర్యటనలో భాగంగా నిట్రో సర్కస్‌లో తన నైపుణ్యాన్ని చూపించాడు. థేమ్స్ నదిలో రెండు పడవల మధ్య దూరం 75 అడుగులు ఉంది. ఈ దూరాన్ని తన బైక్‌పై సులువుగా బ్యాక్ ప్లిప్ చేశాడు. దీంతో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతికి గురైపోయారు. ట్రావిస్ పాస్ట్రానా దీంతో ప్రంపంచ రికార్డును తిరగరాశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






Comments
Please login to add a commentAdd a comment