thames river
-
Europe Drought 2022: జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్
బ్రిటన్‌లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్‌లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్‌లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్‌లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. లండన్: వాతావరణంలో మార్పుల ప్రభావం యూరప్‌ను అల్లాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్‌లో రెండు నెలలుగా వాన చినుకు జాడ కూడా లేదు! దాంతో యూరప్‌లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది. యూరోపియన్ యూనియన్‌లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి. వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది! దక్షిణ ఇంగ్లండ్‌లో థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది! ఫ్రాన్స్‌లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లండ్‌లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రభావితమైనవిగా బ్రిటన్ ప్రకటించింది. 1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి! ఇంగ్లండ్‌లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ పైగానమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా, మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు. నదులు ఎండిపోతూ ఉండడంతో జల విద్యుత్కేంద్రాలు మూతపడుతున్నాయి. 2018లో కూడా కరువు పరిస్థితులు వచ్చినా ఇంత టి పరిస్థితులను ఎదుర్కోలేదని అధ్యయనవేత్లలు అంటున్నారు. అక్టోబర్ దాకా ఇవే పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రమైతే ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, ఇంట్లోని పూల్స్‌లో నీళ్లు నింపడంపై నిషేధం విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ప్రమాద ఘంటికలు... ► బ్రిటన్‌లో జూలైలో సగటు వర్షపాతం 35% మాత్రమే నమోదైంది. ► దాంతో ఆవులు తాగే నీళ్లపై కూడా రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్ విధిస్తున్నారు. ► మొక్కజొన్న ఉత్పత్తి 30%, పొద్దుతిరుగుడు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా. ► బంగాళదుంప రైతులంతా నష్టపోయారు. ► జర్మనీలోని రైన్ నదిలో నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తోంది. చాలాచోట్ల 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నదిపై రవాణా ఆగిపోతే∙8 వేల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది. ► ఇటలీలో గత 70 ఏళ్లలో చూడనంతటి అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ► ఇటలీలోని అతి పెద్ద నది పో సగం వరకు ఎండిపోయింది. ► ఫ్రాన్స్‌లో 100కు పైగా మున్సిపాల్టీల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు. ► ఎండ తీవ్రతకు ఫ్రాన్స్‌లో గిర్నోడ్ లో 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు వ్యాపించింది. ► స్పెయిన్‌లో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. ► హంగరీలో నదులన్నీ బురద గుంతలుగా మారిపోతున్నాయి. -
ఆ నది గడ్డకట్టడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!
ఇంగ్లాండ్‌ను చలిపులి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సౌత్ కుంబ్రియాలోని అల్డింగ్హమ్ బీచ్ గడ్డకట్టుకుపోయింది. అలాగే సౌత్ వెస్టు లండన్‌లోని టెడింగ్టన్ వద్ద థేమ్స్ నది ఘనీభవించింది. పెద్ద మంచు ముక్కలా మారిపోయింది. ఇక్కడ సముద్రపు పక్షులు సందడి చేస్తున్నాయి. థేమ్స్ నది గడ్డకట్టడం 60 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. రావెన్స్వర్త్, నార్తు యార్క్‌షైర్‌లో మైనస్ 15.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. రహదారులు, వీధుల్లో 4 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంలో చలిగాలులు వీస్తున్నాయి. కేంబ్రిడ్జిషైర్‌లోని గ్రేట్ ఔసీ నదిలో పడవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా డేవన్, కార్న్‌వాల్, స్కాట్లాండ్లో కార్చిచ్చు రగిలింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేశారు. -
లండన్ ఎయిర్‌పోర్టు మూసివేత!
లండన్ : బాంబు వార్తతో లండన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆదివారం సిటీ ఎయిర్‌పోర్టు వద్ద బాంబు జాడ లభ్యం కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. థేమ్స్ నది ఒడ్డున కింగ్ జార్జి వీ డాక్ వద్ద నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో ఈ బాంబు బయటపడింది. రన్ వేకు ఈ ప్రాంతంలో సమీపంలో ఇది ఉండటంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను బయటకు పంపించి వేసిన అధికారులు దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ప్రయాణికులకు కలిగిన అంతరాయంపై ఎయిర్‌పోర్టు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శక్తివంతమైన ఈ బాంబు బహుశా రెండో ప్రపంచ యుద్ధంలో ఇక్కడ పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా సెప్టెంబర్ 1940, 1941 మే నెలల మధ్య లండన్ నగరంపై దాడి చేసిన జర్మన్ ఎయిర్‌ఫోర్స్ దళాలు వేల సంఖ్యలో బాంబులను నగరంపైకి జారవిడిచాయి. ఇది కూడా చదవండి... 4000 మందిని కాపాడారు -
వావ్ వాట్ ఎ స్టంట్.. రికార్డ్ బ్రేక్
-
ఇలాంటి సాహసం మీరు చేయకండి
అమెరికా: మనకు ఓ చిన్న కాలువ అడ్డు వస్తేనే దాటడానికి జంకుతాము. అలాంటిది ఏకంగా 75 అడుగలు దూరాన్ని ఎంతో సులువుగా ఓ వ్యక్తి బైక్‌పై బ్యాక్ ప్లిప్ చేసి వరల్డ్ రికార్డ్‌ని తిరగ రాశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన బైక్ స్టంట్ రైడర్ ట్రావిస్ పాస్ట్రానా లండన్‌లోని థేమ్స్ నదిలో ఓ ప్రయోగం చేశాడు. యుకే పర్యటనలో భాగంగా నిట్రో సర్కస్‌లో తన నైపుణ్యాన్ని చూపించాడు. థేమ్స్ నదిలో రెండు పడవల మధ్య దూరం 75 అడుగులు ఉంది. ఈ దూరాన్ని తన బైక్‌పై సులువుగా బ్యాక్ ప్లిప్ చేశాడు. దీంతో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతికి గురైపోయారు. ట్రావిస్ పాస్ట్రానా దీంతో ప్రంపంచ రికార్డును తిరగరాశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
లండన్ నగరానికి ఉపద్రవం
దుర్గంధంతో లండన్ ఉక్కిరిబిక్కిరి మన దేశంలో మురుగు కాలువల పక్క నుంచి వెళుతుంటే వ్యాపించే దుర్గంధానికి ముక్కుమూసుకుని వీలైనంత త్వరగా ఆ పరిసరాలను దాటుకుని ముందుకు సాగిపోవడానికి ప్రయత్నిస్తాం. ముక్కు మూసుకునేలా చేసిన ఆ కాస్త అసౌకర్యానికి కూడా మునిసిపాలిటీ నిర్వాహకులను మనసులోనే ముక్కచీవాట్లు తిట్టుకుంటాం. మన నగరాలు, పట్టణాల్లో ఇలాంటి పరిస్థితులు చాలా మామూలే. అయితే నగరానికి నగరమే లేదా పట్టణానికి పట్టణమే రోజుల తరబడి దుర్గంధభూయిష్టంగా మారిన ఉదంతాలైతే మన దేశ చరిత్రలో లేవు. అలాంటి ఘన చరిత్ర రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య రాజధాని లండన్ నగరానికే దక్కింది. విక్టోరియా మహారాణివారి ఏలుబడి కొనసాగుతున్న కాలంలో 1858వ సంవత్సరం నడివేసవి కాలంలో లండన్ నగరానికి ఆ ఉపద్రవం తటస్థించింది. మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో నగరానికి నగరమే దుర్గంధభూయిష్టంగా మారింది. మురుగు నీరంతా థేమ్స్ నదిలోకి చేరడంతో థేమ్స్ కాస్తా వైతరణి నదిలా మారింది. పిల్లా పీచూ ముసలీ ముతకా ఊపిరి పీల్చుకోలేక రోజుల తరబడి ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు రాణిగారు కూడా ముక్కుకు క్లిప్పు పెట్టుకునే పరిస్థితి వాటిల్లింది. దుర్గంధాన్ని అరికట్టడానికి పార్లమెంటు భవనానికి వేసిన కర్టెన్లను సున్నపు క్లోరైడ్‌తో తడిపేవారు. ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా ఫలితం లేకపోవడంతో లండన్‌లోని చాలా దుకాణాలను రోజుల తరబడి మూసివేశారు. లండన్ పారిశుద్ధ్య యంత్రాంగం పద్దెనిమిది రోజుల పాటు నానా తంటాలు పడిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చి జనాలు కాస్త ధైర్యంగా ఊపిరి పీల్చుకోగలిగారు. -
సూర్యుడు నిద్రపోతాడా?!
మరో మంచుయుగం.. ముంచు కొస్తోందా? భగభగ మండుతూ సెగలు కక్కే ప్రచండ భానుడు మరో దశాబ్దం తర్వాత చల్లబడతాడా? దాదాపు దశాబ్దం పాటు నిద్రపోతాడా? 370 సంవత్సరాల క్రితం లండన్‌లోని థేమ్స్ నది సైతం గడ్డకట్టుకుపోయినట్లుగా మరోసారి మినీ మంచుయుగం ముంచుకొస్తుందా? సూర్యుడి వలయాల అధ్యయనంలో తేలిన అంశాలను బట్టి చూస్తే.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు! సూర్యుడిలో పదకొండేళ్లకోసారి ఒక వలయం పూర్తయి మరో వలయం ప్రారంభమవుతుంటుంది. దీనినే సూర్యుడి గుండె లయగా భావిస్తుంటారు. సౌర వలయాల్లో తరచూ అనూహ్య మార్పులు జరుగుతుంటాయి. వీటివల్ల సూర్యుడిపై నల్లమచ్చలు పెరిగి క్రియాశీలత ఎక్కువ కావడం లేదా తగ్గిపోవడం సంభవిస్తుంటుంది. అయితే, 2030-40 మధ్య ఏర్పడనున్న సౌర వలయ సమయంలో సూర్యుడు దాదాపుగా నిద్రలోకి జారుకుంటాడని, 1646-1715 కాలంలోఏర్పడినట్లు మినీ మంచుయుగం రావచ్చని బ్రిటన్ శాస్త్రవేత్త వాలెంటినా హెచ్చరించారు. వేల్స్‌లోని లియాన్డిడ్నోలో జరిగిన జాతీయ ఖగోళ సదస్సులో వాలెంటినా అధ్యయన ఫలితాలను వెల్లడించారు. వాలెంటినా అంచనా ప్రకారం... 2030 సౌరవలయ సమయంలో ‘మాండర్ మినిమమ్’ ప్రభావం ఏర్పడేందుకు 97 శాతం అవకాశముంది. సూర్యుడిలో రెండు పొరల్లో ఏర్పడిన విద్యుదయస్కాంత క్షేత్రాలు పెరుగుతూ, తరుగుతూ పదకొండేళ్లపాటు కొనసాగుతుంటాయి. ఈ రెండు పొరల్లోని విద్యుదయస్కాంత తరంగాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా సూర్యుడిపై నల్లమచ్చలు, క్రియాశీలత మారుతుంటుంది. ఈ క్రియాశీలత పూర్తిగా తగ్గిపోవడాన్నే మాండర్ మినిమమ్‌గా పేర్కొంటారు. 2030 సౌరవలయంలో ఈ ఎఫెక్ట్ ఏర్పడి, మినీ ఐస్ ఏజ్ రావచ్చని, శీతల దేశాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారతాయని అంచనా.