
ఇంగ్లాండ్‌ను చలిపులి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సౌత్ కుంబ్రియాలోని అల్డింగ్‌హమ్ బీచ్ గడ్డకట్టుకుపోయింది. అలాగే సౌత్ వెస్టు లండన్‌లోని టెడింగ్టన్ వద్ద థేమ్స్ నది ఘనీభవించింది. పెద్ద మంచు ముక్కలా మారిపోయింది. ఇక్కడ సముద్రపు పక్షులు సందడి చేస్తున్నాయి. థేమ్స్ నది గడ్డకట్టడం 60 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి.
రావెన్స్‌వర్త్, నార్తు యార్క్‌షైర్‌లో మైనస్ 15.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. రహదారులు, వీధుల్లో 4 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంలో చలిగాలులు వీస్తున్నాయి. కేంబ్రిడ్జిషైర్‌లోని గ్రేట్ ఔసీ నదిలో పడవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా డేవన్, కార్న్‌వాల్, స్కాట్లాండ్‌లో కార్చిచ్చు రగిలింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేశారు.