ఒంటరిగా ఉన్న మహిళను తాళ్లతో నిర్బంధించి నగలు, నగదు దోచుకున్న ఘటన ఏలూరు మండలం వెంకటాపురంలో శనివారం చోటుచేసుకుంది.
ఏలూరు (పశ్చిమ గోదావరి) : ఒంటరిగా ఉన్న మహిళను తాళ్లతో నిర్బంధించి నగలు, నగదు దోచుకున్న ఘటన ఏలూరు మండలం వెంకటాపురంలో శనివారం చోటుచేసుకుంది. ఆళ్ల నాని కాలనీలో నివాసం ఉంటున్న మహిళను దుండగులు తాళ్లతో కట్టేసి 40 కాసుల బంగారు నగలు, 5 లక్షల రూపాయల నగదు చోరీ చేశారు.
హేమలక్ష్మి(55) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. దొంగలు చొరబడి ఆమెను తాళ్లతో కట్టేసి ఇంట్లో ఉన్న నగలు, నగదు దోచుకున్నారు. సమాచారం అందుకున్న ఏలూరు సీఐ నాగమురళి, ఎస్‌ఐ కిషోర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.