నెక్కొండ మండలంలోని వెంకటాపురం గ్రామ శివారు బీక్యా తండాకు చెందిన వృద్ధ దంపతులు గుగులోత్ రాజమ్మ, చక్రు మంత్రాలు చేస్తున్నారనే నెపంతో వారిపై తండాకే చెందిన కొందరు ఆదివారం రాత్రిదాడి చేశారు. రాజమ్మ, చక్రు మం త్రాలు చేస్తున్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.
మంత్రాల నెపంతో వృద్ధ దంపతులపై దాడి
Published Mon, Aug 15 2016 2:00 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
నెక్కొండ : నెక్కొండ మండలంలోని వెంకటాపురం గ్రామ శివారు బీక్యా తండాకు చెందిన వృద్ధ దంపతులు గుగులోత్ రాజమ్మ, చక్రు మంత్రాలు చేస్తున్నారనే నెపంతో వారిపై తండాకే చెందిన కొందరు ఆదివారం రాత్రిదాడి చేశారు. రాజమ్మ, చక్రు మం త్రాలు చేస్తున్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. దీంతో వారు తమపై తప్పుడు ప్రచా రం జరుగుతోందంటూ ఆదివారం ఉదయం నె క్కొండ పోలీసుస్టేçÙన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విష యం తెలియడంతో తమపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ తండాకు చెందినబానోత్ మాంజీ, బాలా జీ, రాజు, రవి, అంజీతో పలువురు దాడి చేశారని దంపతులు తెలిపారు. ఈ మేరకు వారిని చికిత్స నిమిత్తం స్థానికులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement