రాహుల్‌ని ఆనంద్‌గానే గుర్తు పెట్టుకుంటారు! | Rahul is remembered as an awesome! | Sakshi
Sakshi News home page

రాహుల్‌ని ఆనంద్‌గానే గుర్తు పెట్టుకుంటారు!

Published Mon, May 8 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

రాహుల్‌ని ఆనంద్‌గానే గుర్తు పెట్టుకుంటారు!

రాహుల్‌ని ఆనంద్‌గానే గుర్తు పెట్టుకుంటారు!

రాహుల్, మహిమా మక్వాన్‌ జంటగా గుడ్‌ సినిమా గ్రూప్‌ పతాకంపై శ్రేయాస్‌ శ్రీనివాస్, తుము ఫణికుమార్‌ నిర్మించిన చిత్రం ‘వెంకటాపురం’. మాధికంటి వేణు దర్శకత్వం వహించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఓ యువతి హత్య చుట్టూ కథంతా తిరుగుతుంటుంది.

వైజాగ్‌ నేపథ్యంలో సాగే యూత్‌పుల్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ ‘రాహుల్‌’ను ఆనంద్‌గానే గుర్తుపెట్టుకుంటారు. డైరెక్టర్‌ వేణు టేకింగ్‌ బాగుంది’’ అని అన్నారు. రాహుల్‌ మాట్లాడుతూ –‘‘కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీస్తే కచ్చితంగా విజయం సాధిస్తుంది. మా సినిమా కూడా హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో మంచి పాత్ర చేశాను’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement