పేకాట ఆడుతున్న 8మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
నేరెడ్‌మెట్ (హైదరాబాద్) : పేకాట ఆడుతున్న 8మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అల్వాల్ పరిధిలోని వెంకటాపురంలో శనివారం సాయంత్రం జరిగింది. విద్యుత్ కాంట్రాక్టర్ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పేకాట ఆడుతున్న నలుగురు విద్యుత్ శాఖ ఉద్యోగులతో పాటు, మరో నలుగురు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 1.30 లక్షల నగదు, 5 ద్విచక్రవాహనాలతో పాటు 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.