cards game
-
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే పేకాట శిబిరం
సాక్షి, కృష్ణలంక (విజయవాడ తూర్పు) : జూదాన్ని అరికట్టాల్సిన ఓ పోలీసు అధికారే తన ఇంట్లోనే పేకాట శిబిరం నిర్వహిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవానీపురం పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ శివప్రసాద్ కృష్ణలంక రాణిగారితోట సిద్దెం కృష్ణారెడ్డి రోడ్డులో నివాసముంటున్నాడు. ఇతను కొంతకాలంగా తన ఇంట్లోనే పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. చుట్టుపక్కల వారు అందించిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి టాస్క్‌ఫోర్స్ ఎస్సై అర్జున్, కృష్ణలంక పీఎస్ ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో దాడిచేసి పేకాడుతున్న నిర్వాహకుడితో పాటు సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మధిర శ్రీనివాసరావు, రిటైర్ట్ కానిస్టేబుల్ సాయివరప్రసాద్, లంకా రాజశేఖర్, ఏడుకొండలు, వల్లూరు రామారావు, వీర వెంకట సుబ్రమణ్యంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.29,100తో పాటు సెల్ఫోన్లను సీజ్ చేసి అరెస్టు చేశారు. -
తెనాలి గడ్డ...పేకాట అడ్డా..!
జూదం.. తెనాలిలో మళ్లీ షో అంటోంది. రాజు, రాణీ, జాకీ.. కాయ్ రాజా కాయ్ అంటూ పలవరిస్తోంది. లోనా, బయటా అంటూ ఊరిస్తోంది. కోట్ల రూపాయలతో పందెం కాస్తూ పోలీసులను జోకర్లను చేస్తోంది. రాజధాని గ్రామాల నుంచీ పేకాటరాయుళ్లు తరలివస్తున్నారు. విజయవాడ నగరంలోని ఒక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఇక్కడే పేకాటలో తరిస్తున్నాడు. మొత్తంగా ఆంధ్రాప్యారిస్ మినీ క్లబ్‌గా మారిపోయింది. తెనాలి : ఆంధ్రాప్యారిస్‌గా పిలుచుకొనే తెనాలికి ఆ పేరు ఎలా వచ్చిందనే అంశంపై భిన్నవాదనలు తెలిసిందే. అన్నీ పక్కన బెడితే, ప్యారిస్‌లో ఉన్నట్టుగా జూదం, వినోదం ఇక్క డ మస్తు. పరిసరాల్లోని వందకుపైగా గ్రామాలకు కూడలి అయినందున జనం తాకిడి అధికం. పూర్వం నుంచి వ్యభి చారం, పేకాట క్లబ్బులకు పెట్టింది పేరు. ఆధునికతతో అం దివచ్చిన వ్యసనాలనూ పట్టణం వంట బట్టించుకుంది. సిం గిల్ నంబర్ లాటరీ.. ఒక ఊపు ఊపింది. జనం గుల్లయిపోయారు. రిక్రియేషన్ పేరుతో క్లబ్‌లూ నడిచాయి. మహిళల తిరుగుబాటుతో రెండు దశాబ్దాలుగా క్లబ్‌లలో పేకాట బం దయింది. రెండు క్లబ్‌లు బార్ అండ్ రెస్టారెంట్లుగా మారా యి. జిమ్, క్రీడల సహా రమ్మీ కోసం ఇటీవల ఓ క్లబ్‌ను ఆధునికీకరించి సిద్ధం చేస్తే, పోలీసులు అడ్డుకోవటం తెలిసిందే. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మినీక్లబ్బులు... ఈ నేపథ్యంలో పట్టణంలో జూదం మళ్లీ జడలు విప్పింది. పేకాటలో ఆరితేరిన అధికార తెలుగుదేశం పార్టీ ఛోటా నేతల నేతృత్వంలో పలు చోట్ల మినీ క్లబ్‌లు వెలిశాయి. ఊరి శివారుల్లో, పంట పొలాల్లో నాలుగైదు క్లబ్లున్నాయి. వీటిలో కోతముక్కాట అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. ఐతానగర్లో రెండు, పినపాడు నుంచి దుండిపాలెం వెళ్లే డొంకరోడ్డులో తెనాలి, చుండూరు సరిహద్దుల్లో ఒకటి, అక్కడకు కొంచెం దూరంలోని పంట పొలం పాకలో భారీ జూదం జరుగుతోంది. మారీసుపేటలో స్థానిక ప్రజాప్రతినిధి బంధువు అడ్డాలో నడిచే పేకాట క్లబ్లో కొందరు పోలీసులూ ఆటగాళ్లేనట! చంద్రబాబు కాలనీలో ఓ వ్యాపారి ఇంట్లో పేకాట లేనిదే తెల్లవారదని వ్యసనపరులు చెబుతున్నారు. అమరావతి ప్లాట్స్, బోసురోడ్డులోని వ్యాపారకూడలిలో, నాజరుపేటలోని ఓ గుడి సమీపంలో, చెంచుపేటలోని ఓ హోటల్లో...ఇలా పట్టణంలో అన్నీ కలిపి 30 మినీక్లబ్లు నడుస్తుండగా, పదింటిలో భారీస్థాయిలో పేకాట సాగుతోంది. మరికొన్ని ప్రైవేటు ఇళ్లలో ఒక్కో టేబుల్ చొప్పున క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. రోజుకు చేతులు మారుతున్న రూ.3 కోట్లు కోతముక్కాట ఆడే బరిలో కోటి రూపాయలు చేతులు మారుతుంటే, ఓకుకు రూ.50, రూ.100 చొప్పున జరిగే రమ్మీతో సహా రోజుకు హీనపక్షం రూ.3 కోట్లు చేతులు మారుతున్నాయి. కోతముక్కాటలో పాల్గొనే వ్యక్తి రూ.3 వేలు చెల్లించాలి. కనీసం రూ.5 లక్షలు జేబులో ఉండాలట! దాదాపు 20 మంది పాల్గొనే ఈ ఆటలో బరి కోసమే రూ.60 వేలు తీస్తున్నారు. రమ్మీ ఆట క్లబ్‌లలో ఒక్కో ఆటకు రూ.100, రూ.150 వంతున కేటాయిస్తున్నారు. అంటే రోజుకు కనీసం రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఆదా యం. ఒక్కో క్లబ్‌కు నలుగురైదుగురు వేగులు. పోలీస్‌స్టేషను ముందు నుంచి, క్లబ్ వరకు ఉండే వేగులు పోలీసు వాసనను ఇట్టే పసిగట్టేసి హెచ్చరికలు చేస్తారు. ఆట పడిన రోజుల్లా ఒక పోలీస్‌స్టేషన్‌కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లకు రూ.3 వేలు చొప్పున మామూళ్లు చెల్లిస్తారట. రైడింగులుంటే ముందే సమాచారం వచ్చేలా పక్కాగా ప్లాను చేసుకున్నారు. పేకాట జోలికొస్తే ఖబడ్దార్...! తెనాలిలో పేకాటకు రాజధాని గ్రామాలు, విజయవాడ నుంచీ ఆటగాళ్లు వస్తున్నారు. విజయవాడలోని ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడికి ఇక్కడి పేకాట బరికి రాకుంటే నిద్ర పట్టదంట! ఊరి వెలుపల ఓ గుడి వద్ద, ఆర్టీసీ బస్టాండు వెలుపల, రైల్వేస్టేషనులోనూ వాహనాలను పార్క్ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల మధ్య జరిగే ఈ పేకాటలో కొన్ని చోట్ల కోతముక్కను తెల్లవారుజాము 4 గంటల నుంచి 7.30 గంటల మధ్య ఆడుతున్నారు. పేకాట జోలికొస్తే ప్రజాప్రతినిధులూ ఊరుకోవటం లేదు. సమీప అంగలకుదురులో ఈ వారంలో వనభోజనాల్లో పేకాడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. దాదాపు రూ.38 లక్షల నగదు బరిలో ఉందని తెలిసింది. మండల, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు జోక్యంతో పోలీసులు మౌనంగా తిరిగి వెళ్లినట్టు సమాచారం. ఇటీవల బోసురోడ్డులోని ఓ హోటల్లో పట్టుబడిన ఆటగాళ్లను వదిలేశారు. చేసేదిలేని పోలీసులు ఏ అండా లేని బక్క ఆటగాళ్ల బరులపై దాడులు చేస్తూ కేసులు కడుతున్నారు. -
పేకాట శిబిరంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదుగురు పేకాట రాయుళ్లను పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలోని లారీ పార్కింగ్ పక్కన కట్టెల గోదాములో పేకాట శిబిరం నడుస్తుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.69,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
13 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
రాయచోటి టౌన్ (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ మండలం చిప్యాల గ్రామ పంచాయతీ అన్నమరాజుగారిపల్లె గ్రామంలో 13 మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట శిబిరం నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.59,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సీఐ శ్యామారావు, ఎస్సై రమేష్‌బాబు పాల్గొన్నారు. -
లాడ్జిలో పేకాట: ముగ్గురు అరెస్ట్
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగరంలోని ఓ లాడ్జిలో పేకాడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం వన్ టౌన్‌లోని ఓ లాడ్జిలో కొందరు పేకాడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేసి, మూడు సెల్ఫోన్లను, రూ.3,03,200 ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసును వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. -
ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
ముదిగొండ (ఖమ్మం) : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురంలో శుక్రవారం ఏడుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట శిబిరం నడుస్తుందన్న సమాచారంతో ఎస్ఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.61 వేలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారంతా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి పేకాట ఆడుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
దామరచర్ల (నల్లగొండ) : వ్యవసాయ భూముల్లో పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసిన పోలీసులు ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.77 వేల నగదు, 9 బైకులు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కాల్వపల్లి వద్ద సోమవారం సాయత్రం జరిగింది. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. -
15మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
న్యూజెండ్ల (గుంటూరు) : గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం రవ్వరమ్ము గ్రామ శివార్లలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.21 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ఎనిమిదిమంది పేకాటరాయుళ్ల అరెస్ట్
తాడేపల్లి (గుంటూరు) : గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.42 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ శివారులో శుక్రవారం సాయత్రం జరిగింది. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
విజయనగరం (రామభద్రాపురం) : విజయనగరంలో జిల్లాలో ఆరుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని రామభద్రాపురం మండల కేంద్రంలోని శివాలయం వీధిలో శుక్రవారం ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా ఎస్సై నారాయణ రావు దాడి చేసి వారిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.16, 200 స్వాధీనం చేసుకున్నారు. -
10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
చుండుపల్లి (వైఎస్సార్‌జిల్లా) : పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.12,270 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా చుండుపల్లి మండలం ఉడుంపాడు గ్రామం గోపాలకృష్ణాపురం వద్ద శనివారం జరిగింది. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 10 మందిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు. -
8మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
నేరెడ్మెట్ (హైదరాబాద్) : పేకాట ఆడుతున్న 8మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అల్వాల్ పరిధిలోని వెంకటాపురంలో శనివారం సాయంత్రం జరిగింది. విద్యుత్ కాంట్రాక్టర్ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పేకాట ఆడుతున్న నలుగురు విద్యుత్ శాఖ ఉద్యోగులతో పాటు, మరో నలుగురు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.30 లక్షల నగదు, 5 ద్విచక్రవాహనాలతో పాటు 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎన్టీపీసీలో పేకాటరాయుళ్ల అరెస్ట్
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కార్యాలయంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారంతో కల్లమల పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేసి ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 28 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
సరుబుజ్జిలి (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట మండలం రావిచంద్రాపురం గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురిని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేయడంతో పాటు, వారి వద్ద నుంచి రూ.5,750 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై చెప్పారు. -
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
హైదరాబాద్ (కుషాయిగూడ) : నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 15వేలు, 8 సెల్ఫోన్లు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నారు. -
టీడీపీ నేత రెస్ట్రూమ్లో పేకాట
9 మంది అరెస్ట్ రూ. 21 లక్షల నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం - గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ తెలుగుదేశం నాయకుడి రెస్ట్‌రూంలో పెద్ద స్థాయిలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వారినుంచి రూ. 21.74 లక్షల నగుదు, 11 ఏటీఎం కార్డులు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు అర్బన్ సీఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపిన వివరాల మేరకు... జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని యస్‌యల్‌వి థియేటర్ సమీపంలో టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సోదరుడు రాణా ప్రతాప్ రెస్ట్‌రూమ్‌పై జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న పట్టణానికి చెందిన రాణా ప్రతాప్ అనుచరులు సూర్యనారాయణ, సత్యనారాయణ, హఫీజ్ ఖాన్‌లతో పాటు రాయచూరు తదితర ప్రాంతాలకు చెందిన వెంకటేశ్వర్లు, ఎండి.ఆరీఫ్, వి.వెంకటే ష్, రాఘవ, ఎం.జయరామ్, కుమార్‌లను అరెస్ట్ చేశారు. మట్కా, పేకాట ఆడుతూ రూ. 50 వేలతో పట్టుబడే నిందితులను మీడియా ముందుకి చూపే పోలీసు అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తంతో పట్టుబడిన పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులను మీడియా ముందుకు చూపడానికి వెనుకంజ వేశారు. వివరాలు చెప్పాలని పాత్రికేయులంతా గట్టిగా పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో కేవలం స్వాధీనం చేసుకున్న డబ్బును మాత్రమే చూపి చేతులు దులుపుకున్నారు. -
ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్: నరంలోని అల్వాల్ పరిధిలోని మంగాపురం కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోజూ పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.26 వేలు, 4 బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.