హైదరాబాద్ అల్వాల్ పరిధిలోని మంగాపురం కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: నరంలోని అల్వాల్ పరిధిలోని మంగాపురం కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోజూ పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.26 వేలు, 4 బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.