
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో మరో విషాదం చోటు చేసుకుంది. కడసారి చూపు కోసం వచ్చిన అభిమానులతో ఆల్వాల్‌లోని గద్దర్ ఇంటి వద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు.
గద్దర్ కడసారి చూపు కోసం భారీగా అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్లను నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సియాసత్ ఉర్దూ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ కింద పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వెంటనే పక్కనే ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించగా.. ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్. గద్దర్‌కు అత్యంత సన్నిహితుడు. గద్దర్ అంత్యక్రియలకు హాజరై.. ఎల్బీ స్టేడియం నుంచి పార్థివదేహంతో పాటే వాహనంలో ఆల్వాల్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే.. ఇంటి దగ్గర కిక్కిరిసిన జనం మధ్య ఆయన కింద పడిపోయారు. ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్ అరెస్ట్‌తోనే జహీరుద్దీన్ మృతి చెందినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment