ముదిగొండ (ఖమ్మం) : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురంలో శుక్రవారం ఏడుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట శిబిరం నడుస్తుందన్న సమాచారంతో ఎస్‌ఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.61 వేలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారంతా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి పేకాట ఆడుతున్నట్టు పోలీసులు తెలిపారు.