సాక్షి, ఏలూరు: ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.
ప్రజాసంకల్పయాత్ర @2000 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించిన జననేత.. మైలురాయికి గుర్తుగా ఒక కొబ్బరిమొక్కను నాటారు. వెంకటాపురం నుంచి ఏలూరుకు చేరుకోనున్న జగన్.. ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జననేత పాదయాత్ర 2000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి.
ప్రజాసంకల్పయాత్ర 2000కి.మీ పైలాన్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్
పాదయాత్ర 2000కి.మీ మైలురాయికి గుర్తుగా కొబ్బరిమొక్కను నాటుతున్న వైఎస్ జగన్
జిల్లాల వారీగా ప్రజాసంకల్పయాత్ర విశేషాల్లో కొన్ని..
►నవంబర్ 6, 2017 న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర.. సోమవారం(161వ రోజున) 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
►వైఎస్సార్ జిల్లా: ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడురోజులపాటు 94 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
►కర్నూలు జిల్లా: ఏడు నియోజకవర్గాల్లో 18 రోజులపాటు 263 కిలోమీటర్లు
►అనంతపురం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 279 కిలోమీటర్ల పాదయాత్ర
►చిత్తూరు జిల్లా: 10 నియోజకవర్గాల్లో 23 రోజుల పాత్రయాత్రో 291 కిలోమీటర్ల కాలినడక
►నెల్లూరు జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 267 కిలోమీటర్ల పాదయాత్ర
►ప్రకాశం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 21 రోజులపాటు 278 కిలోమీటర్లు
►గుంటూరు జిల్లా: 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోజులు 281 కిలోమీటర్ల యాత్ర
►కృష్ణా జిల్లా: 12 నియోజకవర్గాల్లో 24 రోజులపాటు 244 కిలోమీటర్లు
►పశ్చిమగోదావరి జిల్లా: మే 13న(ఆదివారం) మహేశ్వరపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. సోమవారం ఉదయం మహేశ్వరపురం నుంచి శ్రీపర్రు, గురకళ పేట మీదుగా లింగారావుగూడెం, మాదేపల్లిల్లో ప్రజలతో మమేకం అయ్యారు. వెంకటాపుంర వద్ద ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అక్కడ నుంచి ఏలూరు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment