eluru constituency
-
'ఏలూరు' ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కోవిడ్ ప్రొటోకాల్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి నిమిత్తం ప్రభుత్వం, అభ్యర్థి టీవీ అన్నపూర్ణ శేషుకుమారి దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. మధ్యంతర ఉత్తర్వుల రద్దు ఏలూరు నగరపాలక సంస్థ ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఈ ఏడాది మార్చి 8న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల్లో పోటీ చేసిన టీవీ అన్నపూర్ణ శేషుకుమారి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చి.. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ అప్పీళ్లపై తుది విచారణ జరిపిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఎన్నికలపై స్టే విధించారని, ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు అధికరణ 226 కింద ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సబబేనా? అంటూ ధర్మాసనం తనకు తాను ప్రశ్న వేసుకుంది. ఇటీవల రత్నప్రభ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో ఇదే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. ఎన్నిక ప్రక్రియ మొదలైన తరువాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ధర్మాసనం చెప్పిన విషయాన్ని సీజే ధర్మాసనం గుర్తు చేసింది. ఆ తీర్పుతో పాటు పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ఆధారంగా చేసుకుంటూ.. ప్రభుత్వంతో పాటు అన్నపూర్ణ దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తూ పైవిధంగా తీర్పునిచ్చింది. -
బుజ్జి మార్కు రౌడీయిజం
సాక్షి, ఏలూరు : ఓటమి భయంతో తెలుగుదేశం నాయకులు పలుచోట్ల దాడులకు దిగారు. ఏదోవిధంగా ఓటింగ్‌కు జనం రాకుండా చేయాలనే కుట్రలు పన్నారు. అయినా వారి పన్నాగాలు సాగలేదు. ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు తరలివచ్చారు. దీంతో పలుచోట్ల తెలుగుదేశం నాయకులు వీరంగం వేశారు. ఏలూరులో ఎమ్మెల్యే బడేటి బుజ్జి పలువురిపై స్వయంగా పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలపై దాడులు చేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకూ పలు పోలింగ్ కేంద్రాలకు తిరుగుతూ అక్కడ కనిపించిన నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం, వారిని బెదిరించడం వంటి పనులకు పూనుకున్నారు. పలువురు రౌడీషీటర్లను వెంటేసుకుని హల్చల్ చేశారు. ఎన్నికల సమయంలో రౌడీషీటర్లను బైండోవర్ చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే పక్కన తిరుగుతున్నా వారిని అదుపులోకి తీసుకోకపోవడంతో వారు రెచ్చిపోయారు. ఉదయం శనివారపుపేట పోలింగ్ కేంద్రానికి వెళ్లిన బడేటి బుజ్జి వైసీపీ కార్యకర్త మట్టా రాజును తీవ్రస్థాయిలో గాయపరిచారు, అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన రాజుపై అక్కడ కూడా దాడి చేసి వెంటాడి మరీ కొట్టారు. మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, మాజీ కార్పొరేటర్ అక్కిశెట్టి చందు, మరో కార్యకర్త కొండబాబు, మరో ఇద్దరిపై బుజ్జి స్వయంగా దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ మరికొందరు రౌడీషీటర్లతో కలిసి బుజ్జి హల్చల్ చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూసింది తప్ప అడ్డుకునే యత్నమే చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏలూరు నగరంలో రామకోటి సమీపంలోని బాలికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద మరోసారి బుజ్జి గొడవకు దిగారు. మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్‌పై దాడి చేశారు. ఓటర్లను సైతం భయబ్రాంతులకు గురిచేస్తూ చెలరేగిపోయారు. అనంతరం 3వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ అక్కిశెట్టి చందుపై దౌర్జన్యం చేశారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చందుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం వంగాయగూడెంలో 16, 17డివిజన్లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన బడేటి బుజ్జి మరోసారి అక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొండబాబు, ఇతర వ్యక్తులపై దాడి చేశారు. పోలీసులూ బడేటికి వంతపాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే లాఠీలు ఝుళిపించారు. బుజ్జి వైఖరిని ఖండిస్తూ ఏలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఆళ్ళనాని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన రౌడీషీటర్లు బయట తిరుగుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. టీడీపీకి చెందిన రౌడీషీటర్లు భీమవరపు సురేష్, గుండాల దుర్గారావు తదితరులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. దీంతో ఎస్పీ రవిప్రకాష్ స్పందించి బడేటి బుజ్జి వెనుక ఒక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను పంపడంతో బుజ్జి ఆగడాలకు అడ్డుకట్టపడింది. టీడీపీ నేతల హల్చల్ కార్లు, మోటారుసైకిళ్ళపై టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా గొడవలకు దిగారు. ఎమ్మెల్యే బుజ్జి అల్లుడు కొట్టు మనోజ్ గురువారం సాయంత్రం వీరంగం చేశారు. స్థానిక 150వ పోలింగ్ స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్త రామరాజుపై మనోజ్, అతని అనుచరుల దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామరాజును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం పోలింగ్ స్టేషన్ వద్ద డబ్బులు పంచుతున్నారని సమాచారం ఇచ్చిన రామరాజు అతని తల్లి తండ్రులపై బుజ్జి దాడి చేశారు. మరోసారి రామరాజుపై ఎమ్మెల్యే అల్లుడు కొట్టు మనోజ్ దాడిచేయడం విమర్శలకు దారితీసింది. ఉంగుటూరులో ఉదయం ఎన్నికల సమయంలో టీడీపీ చెందిన నేత వైఎస్సార్ సీపీకి చెందిన దళితులను దూషించడంపై రాత్రి ఎన్నిక ముగిసిన తర్వాత మరోవర్గం వారు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. భీమవరం నియోజకవర్గంలో జనసేన ఓటమి పాలవుతుందన్న విషయాన్ని జీర్జించుకోలేక జనసైనికులు వైఎస్సార్సీపీ నేతలపై గురువారం దౌర్జన్యానికి దిగారు. వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో జనసైనికులు ఎరుపు రంగు తువాలు కట్టుకుని ప్రచారం నిర్వహించారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిలిపివేయాలని ఎర్రకండువాలు తొలగించాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. ఇదే విషయాన్ని ఎన్నికల అధికారికి తెలియచేయడంతో కండువాలు తొలగించాలని వివరించారు. ఈ సమయంలో కొంత మంది జనసైనికులు వైఎస్సార్సీపీ నాయకులపైకి దౌర్జన్యానికి దిగారు. ఇదే మండలం రాయకుదురులో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. రోడ్డుపై ఓటర్లను కలుసుకుంటున్న సందర్భంలో కొంతమంది టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు. ఏలూరు రూరల్ మండలం పత్తికోళ్ల లంకలో ఇరువర్గాల మద్య జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు. -
బుజ్జి నామినేషన్‌కు రండి.. 1000 పట్టుకెళ్లండి
సాక్షి, ఏలూరు : ఏలూరు అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి బుజ్జి నామినేషన్ కార్యక్రమానికి రండి రూ.1000 పట్టుకెళ్లండి అంటూ కార్పొరేటర్లు డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రెండు రోజుల నుంచి నగరంలోని పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు డ్వాక్రా మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ పిలుస్తున్నారు, వెళ్లకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందకుండా చేస్తారేమోనని వెళ్తున్న మహిళలకు కార్పొరేటర్లు ఈ ఆఫర్లు ఇస్తున్నారు. బుజ్జి నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీకి వస్తే కార్పొరేటర్లు రూ.500, బుజ్జి మరో రూ.500 ఇస్తారని చెబుతున్నారు. అలాగే బుజ్జిని రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత డ్వాక్రా మహిళలపై ఉందని, ఇప్పటివరకూ వారికి ప్రభుత్వం నుంచి వివిధ విధాలుగా అందిన రుణాలు, రుణమాఫీ వంటివన్నీ బుజ్జి చలువే అన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల్లో బుజ్జికి ఓటు వేసేందుకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారని(ఎంత ఇస్తారో ప్రకటించడం లేదు) చెబుతున్నారు. బుజ్జి అత్యధిక మెజార్టీతో గెలిస్తే ప్రతి డ్వాక్రా మహిళకూ ఖరీదైన చీర బహూకరిస్తారని ప్రలోభ పెట్టారని ఈయా సమావేశాలకు హాజరైన మహిళల్లో కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు. -
ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా ఆళ్ల నాని నామినేషన్
-
తొలి మహిళా ఎంపీలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి నారీమణులుగా గాయని మోతే వేదకుమారి (ఏలూరు), కె.అచ్చమాంబ (విజయవాడ) రికార్డులకు ఎక్కారు. ఏలూరుకు చెందిన వేదకుమారి టైలరింగ్, టైప్ రైటింగ్‌లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేవారు. రెండోసారి 1957 ఎన్నికల్లో వేదకుమారి కాంగ్రెస్ తరఫున పోటీచేసి తన ప్రత్యర్థి వీరమాచనేని విమలాదేవిపై గెలుపొందారు. 1962 ఎన్నికల్లో వీరమాచనేని విమలాదేవి (కమ్యూనిస్ట్) వేదకుమారిపై విజయం సాధించారు. 1957లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి కొమర్రాజు అచ్చమాంబ విజయ కేతనం ఎగురవేశారు. ఆమె ప్రముఖ వైద్యురాలు, న్యాయవాది కూడా. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఆమె సైద్ధాంతికంగా విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత ఎంపీగా ఎన్నికయ్యారు. -
ఎన్నికలకు సర్వసన్నద్ధం
సాక్షి, ఏలూరు : సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉం దని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఠాగూర్ అన్ని జిల్లాల పోలీసు అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్ని కల నిర్వహణ సిబ్బంది నియామకాలు, ఏర్పాట్లపై పోలీసు అధికారుల నుంచి డీజీపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్నికల సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని, ఇప్పటివరకూ రూ.1.50 కోట్ల నగదు, 30.134 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. 1,761 మద్యం బాటిల్స్, 33 లీటర్ల సారా, 206 కిలోల నల్ల బెల్లం పట్టుకున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 2,007 మంది వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు 25 లైసెన్స్‌లు లేని ఆయుధాలను, 366 లైసెన్స్ ఉన్న ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దుల్లో 11 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను ని యమించామన్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణా ళికతో పనిచేస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అన్ని భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎక్కడైనా గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. -
ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : జిల్లాలో సాధారణ ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతిఒక్కరూ నిబద్ధత, నిష్పక్షపాతంగా ఉండాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఆర్ఓలు, ఏఈఆర్ఓ, నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులు, పోలీసు తదితర 1,500 ఎన్నిక సిబ్బంది ఎన్నికల ప్రవర్తనా నియామవళి, మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత ఉండాలన్నారు. ఇందుకు సంబంధిత అంశాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలని, అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలన్నా రు. జిల్లాలో సాధారణ ఎన్నికల నిమిత్తం 20 నుంచి 25 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. జి ల్లాలో 30,57,922 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో వినియోగించుకుంటారని ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఖర్చును నివేదించాలి పార్లమెంటు స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.70 లక్షలు, అసెంబ్లీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.28 లక్షల వరకు ప్రచార, తదితర ఖర్చును పరిమితం చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. వారి ప్రచార కార్యక్రమాల ఖర్చు, పత్రికలకు ప్రకటన రూపంలో చేసే ఖర్చు తదితర వివరాలను ఎప్పటికప్పుడూ నివేదించాలని ఆదేశించారు. అనుమతిలేని ఫ్లెక్సీలు, గోడ రాతలను పూర్తి తొలగించాలని, ఎక్కడైనా ప్రైవేట్ భవనాలపై అటువంటివి రాసి ఉంటే సంబంధిత యజమాని సమ్మతి ఉన్నదీ లేనిదీ పరిశీలించాలని సూచించారు. ఈ విడత ఎన్నికల సమయంలో కేంద్ర సాధారణ, వ్యయ పరిశీలకులు పెద్ద సంఖ్యలో రానున్నారని, వారు క్షేత్రస్థాయిలో చేసే తనిఖీల సమయంలో వెల్లడించే సందేహాలను, వివరాలను స్పష్టంగా సంబంధిత అధికారులు తెలియజేయాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. 1,057 సమస్యాత్మక కేంద్రాలు జిల్లాలో 3,411 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 1,057 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని కలెక్టర్ అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మ్డ్ పోలీసు విధులు నిర్వర్తిస్తారన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు, జీలు గుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తనిఖీల సమయంలో రూ.10 లక్షలకు పైన ఉంటే ఆదాయశాఖ పన్నుశాఖకు, అంతలోపు పట్టుబడితే జిల్లా ఎన్నికల అధికారికి అప్పగిస్తామన్నారు. ర్యాలీలు, సభల నిర్వహణకు ముందస్తు అనుమతి తప్పనిసరని చెప్పారు. మైక్, లౌడ్స్పీక్టర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలలోపు మాత్రమే అనుమతితో వినియోగించుకోవాలన్నారు. జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఎం.రవిప్రకాష్, డీఆర్ఓ ఎన్.సత్యనారాయణరెడ్డి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, ఐటీడీఏ పీఓ హరీంద్రప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. -
ఓటు నమోదుకు ఇక నాలుగు రోజులే...
సాక్షి, ఏలూరు : ఓటు దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా నాలుగురోజులు మాత్రమే గడువు ఉంది. పరిశీలనకు పది రోజుల వరకూ సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నెల 15 వరకూ మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పుడు ఓటర్ కార్డు ఉంటే సరిపోదు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఏర్పడిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ సర్వేలు చేసి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించేందుకు ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో అందరూ తమ ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఓటు ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు ఓటర్ ఐడీ కార్డు మీద ఎపిక్ నంబర్‌ను 1950కు ఎస్ఎంఎస్ చేస్తే ఓటు ఉందో లేదో తెలుస్తుంది. ఓటు లేని వాళ్లు ఆన్లైన్లో ఫామ్–6 నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం తహసీల్దార్ ఆఫీసులో గానీ, బూత్‌లెవల్ అధికారిని గానీ సంప్రదించాలి. అధికార పార్టీ దురాగతాలను ఎదుర్కొవాలంటే ప్రతి ఓటు కీలకమైన నేపథ్యంలో ఓటును అందరూ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫారం–7 ద్వారా జిల్లాలో 38,145 బోగస్ దరఖాస్తులు దాఖలు కాగా, వాటిని పరిశీలించి ఇప్పటికే 32 కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కారణంగా ఇకపై ఓటరు జాబితా నుంచి ఒక్క ఓటును కూడా తొలగించే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 9 వేల ఓట్లు రెండు ప్రాంతాల్లో నమోదైనట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో 1,700 ఓట్లను తొలగించామని తెలిపారు. మండల కేంద్రాల్లో ఆన్లైన్ ప్రక్రియ ఎన్నికల సమయానికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు ఓటు దరఖాస్తు కోసం ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించారు. దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్లో వాటిని నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఓటు హక్కు నమోదు చేసుకునేలా ఓటర్ హెల్ప్‌లైన్ పోర్టల్ యాప్‌ను ఎన్నికల సంఘం రూపొందించింది. ఈ పోర్టల్‌లో మన దరఖాస్తు ఏ స్టేజీలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. అధికారులు దరఖాస్తులు పరిశీలించి ఆమోదిస్తే ఓటరు గుర్తింపు కార్డును సర్వీస్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానంతో కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు ఇచ్చే అవసరం పూర్తిగా తీరనుంది. ఓటు నమోదుకు ప్రత్యేకంగా ఫారమ్–6ను నింపి ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. ఫారమ్–6 ప్రతి ఈ సేవా కేంద్రాల్లో, తహసీల్దార్ కేంద్రాల్లో, జిల్లా కేంద్రమైన ఏలూరులోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల విభాగంలోనూ లభిస్తుంది. ఆన్లైన్లో www.coeandhra.nic.in, www.nvsp.in అనే వెబ్సైట్ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
కొలిక్కిరాని కుస్తీ...
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : తెలుగుదేశం పార్టీలో సీట్ల ఎంపిక ఇంకా కొనసా..గుతూనే ఉంది. చింతలపూడి, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం సీట్లకు సంబంధించి వివాదాల కారణంగా అభ్యర్థుల ఎంపిక ముందుకు సాగడం లేదు. సమన్వయ కమిటీ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి సంబం ధించి మూడు, నాలుగు సార్లు సమీక్షలు నిర్వహించినా ఏకాభిప్రాయం రాలేదు. సోమవారం కూడా నిడదవోలు, కొవ్వూరు నాయకులను అమరావతి పిలిపించి సమన్వయ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. అయితే అక్కడ ఏకాభిప్రాయం రాలేదు. సగంమంది కొవ్వూరులో మంత్రి జవహర్‌కు ఇవ్వడానికి ససేమిరా అనగా మిగిలిన వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్లు సమాచారం. అదే సందర్భంలో నిడదవోలుపై కూడా పీటముడి వీడలేదు. ఒక వర్గం కుందుల సత్యనారాయణకు సీటు ఇవ్వాలని కోరగా, మరికొంతమంది శేషారావుకు మద్దతు పలికారు. దీంతో ఈ అంశాన్ని మరో రెండురోజులు వాయిదా వేశారు. ఘంటా మురళి చేరికను పురస్కరించుకుని చింతలపూడి నేతలు కూడా తమ నాయకుడి దృష్టిలో పడేందుకు అమరావతి వెళ్లారు. స్థానిక టీడీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయని విషయం తెలిసిందే. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న స్థానాలు, సీట్లు కేటాయించిన స్థానాల విషయంలో ముఖ్యమంత్రి అసంతృప్తులను బుజ్జగించేందుకు తంటాలు పడుతున్నారు. వాటిలో భాగంగా అసంతృప్తులను బుజ్జగించేందుకు రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి నేతలందరితో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. అసంతృప్తులు ఉన్న చోట్ల ఆయా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అనుకూల, వ్యతిరేక వర్గాలను పిలిపించి మాట్లాడారు. ఎక్కడెక్కడ అసమ్మతి రగులుకుంటుందో ఆయా అసమ్మతి నేతలతో మాట్లాడి నామినేషన్లకు ముందుగానే అక్కడి పరిస్థితులను చక్కదిద్దడం, మార్పులు చేర్పులు చేయడం లాంటి అంశాలపై చంద్రబాబు కుస్తీ పడుతున్నారు. అయితే ఇరువర్గాలు తగ్గకపోవడంతో మళ్లీ నిడదవోలు, కొవ్వూరుపై రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పి పంపించారు. చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాలపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తాడేపల్లిగూడెంలో ఈలి నానికి టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. సీటు ఆశించిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి జనసేనలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరోవైపు ఈ అసమ్మతి సద్దుమణిగేలా చేసేందుకు బాపిరాజుకు ఉంగుటూరు సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మంత్రి జవహర్‌కు మళ్లీ చుక్కెదురు కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ఖరారు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్‌కి మరోసారి చుక్కెదురైంది. సోమవారం నియోజకవర్గ నాయకులతో భేటీ అయిన సీఎం చంద్రబాబు అభ్యర్థి ఎంపిక అంశాన్ని మరో రెండు రోజులు పాటు వాయిదా వేశారు. జవహర్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారుపై అధిష్టానం సుముఖంగా లేనట్లు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు సాగదీత ధోరణి అవలంభిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. జవహర్‌కి టిక్కెట్టు కేటాయిస్తే తాము సహకరించబోమని వ్యతిరేక వర్గీయులు పార్టీ అధినేత చంద్రబాబు ముందు తెగేసి చెబుతున్నట్టు సమాచారం. సోమవారం జరిగిన సమావేశంలో మరో రెండు రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశావహులు మంత్రి జవహర్‌కి దాదాపుగా ఈసారి టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుండడంతో ఇక్కడ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇరుపక్షాల నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తనకు గానీ తన కుమార్తె దివ్యరాణికి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. రిటైర్డు ఉద్యోగులు రాపాక సుబ్బారావు, అయినపర్తి రాజేంద్రప్రసాద్, పెనుమాక జయరాజుతో పాటు వేమగిరి వెంకటరావు, బచ్చు శ్రీనుబాబు తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. -
బాబు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయి
-
జనం గుండెల్లో బాబు గునపాలు దించాడు
సాక్షి, ఏలూరు: ‘‘రాష్ట్రానికి ఏదో చేస్తారు కదాని 15కు 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించారు పశ్చిమగోదావరి ప్రజలు. కానీ నాలుగేళ్లుగా ఇసుక నుంచి బొగ్గుదాకా, గుడి భూముల నుంచి గుడిలో లింగం దాకా అన్నింటినీ మింగేస్తూ చంద్రబాబు జనం గుండెల్లో గునపాలు దింపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు తొలి అడుగు పడింది ఈ జిల్లాలోనే. ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేశాడు. ఈ జిల్లా నుంచే దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేసుకున్నారు. ఎమ్మెల్యేల నుంచి కలెక్టర్లు, మంత్రుల నుంచి చినబాబు దాకా అంతా లంచాలమయం. ఈ దొంగలబండికి నాయకుడు పెదబాబైన చంద్రబాబు నాయుడు’’ అని వైఎస్ జగన్ అన్నారు. 161వరోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బుజ్జి.. భూముల్ని బజ్జీల్లా తింటున్నాడు: యథా చంద్రబాబు.. తథా టీడీపీ ఎమ్మెల్యేలు అన్నట్లు సాగుతున్నది వ్యవహారం. చింతమనేనితోపాటు మరో ఎమ్మెల్యే శేషారావు గోదావరి గుండెల్ని పిండుతూ ఇసుక దండుకుంటున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి.. భూములను బజ్జీల మాదిరి తింటున్నాడు. ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిని ఎమ్మెల్యే చితమనేని జుట్టుపట్టుకుని లాక్కెళ్లాడు. అలాంటివాడిని పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిందిపోయి, ముఖ్యమంత్రే పంచాయితీ చేశాడు. అలా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు తొలి అడుగులు పశ్చిమగోదావరి నుంచే పడ్డాయి. ఒక్క ఎమ్మార్వోనేకాదు ఫారెస్ట్ ఆఫీసర్లు, అంగన్వాడీ అక్కచెల్లెమ్మలను కూడా తిట్టి, కొట్టారు. చివరికి అడిషనల్ జిల్లా జడ్జిగారిపైనా దౌర్జన్యం చేశారు. అందుకుగానూ ఇక్కడి ఎమ్మెల్యేలకు సీఎం రేటింగ్స్‌లో మంచి మార్కులు ఇచ్చారు. 15 స్థానాల్లో టీడీపీని గెలిపించిన పశ్చిమగోదారి జిల్లా రుణాన్ని చంద్రబాబు ఈ విధంగా తీర్చుకుంటున్నాడు. ఏలూరుకు వైఎస్సార్ ఎంతో చేశారు: దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో ఏలూరులో 12 వేల మందికి భూములు పంచారు. ప్రభుత్వం డబ్బుతో భూములు కొనిమరీ పేదలకు పంచారు. దాదాపు 5వేలకు పైగా ఇళ్లు కట్టించారు. అవన్నీ ఇక్కడి జనం ఇంకా మర్చిపోలేదు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్కటంటే ఇక్క ఇల్లూ ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు తాగునీటి సమస్య పరిష్కారం కోసం వైఎస్సార్ ట్యాంకులు కట్టించారు. ఇవాళేమో నీళ్లులేని గ్రామాలను పట్టించుకున్న పాపానపోలేదు. పాదయాత్ర చేస్తోన్న నా దగ్గరికి ఏలూరు కార్పొరేషన్ కార్మికులు వచ్చారు. అన్నా.. స్మార్ట్ సిటీ అంటున్నారుగానీ, ఐదు నెలలుగా జీతం ఇ్వడంలేదని గోడువెళ్లబోసుకున్నారు. రోడ్ల విస్తరణకోసం ఇల్లులు, దుకాణాలు తొలగించినప్పుడు పేదలకు అండగా నిలవాలన్న జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకుండాపోయింది.. బాబు చేతిలో మోసపోనివారు లేరు: మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయంటున్నారు. ఈ సందర్భంగా ఒక్కటే అడుగుతున్నా... ఈ నాలుగేళ్ల పాలనలో మీలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నా. అబద్ధాలు చెబుతూ, మోసాలు చేసేవాళ్లు నాయకులు కావాలా అని అడుగుతున్నా. ఎన్నికల సమయంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. బెల్టు షాపులు తీసేస్తానని బోలెడు వాగ్ధానాలు చేసిన చంద్రబాబు.. అందులో ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. ఒకప్పుడు రేషన్ షాపులో 185 రూపాయలకే అన్ని నిత్యావసరాలు వచ్చేవి. ఇవాళ రేషన్ కార్డులనే ఎత్తేసే పరిస్థితి. పెట్రోల్, డీజిల్‌పై విపరీతంగా పన్నులు బాదుతున్నారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ టికెట్ల ధరలు అదుపులేకుండా ఉన్నాయి. బాబు చేతిలో మోసపోనివారంటూ ఎవరూలేరు. హామీలపై జనం నిలదీస్తారన్న భయంతోనే తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి గత ఎన్నికల మేనిఫెస్టోను తొలగించారు.. హోదాపై దారుణంగా మోసం చేశారు: రాజ్యాంగానికి తూట్లుపొడుస్తూ మీడియాను మేనేజ్ చేస్తూ నాలుగేళ్లుగా పాలనసాగిస్తున్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలోనైతే ప్రజల్ని దారుణంగా మోసం చేశాడు. ఎన్నికలకు ముందు హోదా 10 ఏళ్లు కాదు, 15 ఏళ్లు కావాలని అన్నాడు. నాలుగేళ్లపాటు బీజేపీతో కాపురం చేశాడు. ఆ నాలుగేళ్ల కాపురంలో ఏనాడూ ప్రత్యేక హోదా గుర్తుకురాకపోగా, దాన్ని అవమానించి, చులకన చేశాడు. హోదా కోసం వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తే.. చంద్రబాబే అడ్డుకున్నాడు. మొన్నటికి మొన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. అదే సమయంలో టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే హోదా వచ్చేదికాదా. బాబు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయి..: హోదా విషయంలో చంద్రబాబు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయి. 30 కోట్లు ఖర్చుపెట్టి ఒక్కపూట నిరాహార దీక్ష చేస్తాడు. ఆయనేమో బాబా మాదిరి కూర్చుంటే అందరూ వెళ్లి కాళ్లు మొక్కాలట. చివరికి ఎన్డీఆర్ డూప్‌ను పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు చూపించారు. పద్మభూషణ్, ఆస్కార్ అవార్డులిచ్చేవాళ్లు చంద్రబాబును గనుక చూసుంటే ఈయనకే ఉత్తమ విలన్ అవార్డిచ్చేవాళ్లు. విశాఖలో సదస్సులు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబుతాడు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పేవాళ్లకు బుద్ధిచెప్పాలి. పొరపాటున క్షమిస్తే రేపు ఇంటికో కేజీ బంగారం, కారు ఇస్తానని ముందుకొస్తాడు. మన ప్రభుత్వంలో ఇది చేస్తాం..: నాలుగేళ్ల అన్యాయపు పాలనకు చరమగీతం పాడుతూ రేప్పొద్దున మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడబోయే ప్రజా ప్రభుత్వంలో ఏయే వర్గాలకు ఏమేం చెయ్యబోతున్నామో నవరత్నాల ద్వారా తెలిపాం. పేద పిల్లల చదువులకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఎన్ని లక్షల ఫీజైనా చెల్లించడమేకాదు హాస్టల్, మెస్ ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేలు ఇస్తాం. బిడ్డల్ని బడులకు పంపే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు అందజేస్తాం. ఇంకా అన్ని వర్గాలకు ఆమేరకు మేలు జరిగేలా పథకాలను అమలుచేస్తాం..’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
ప్రజాసంకల్పయాత్ర@2000 కి.మీ.
-
చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర@2000 కి.మీ
-
వైఎస్ జగన్ పాదయాత్రలో చరిత్రాత్మక ఘట్టం
సాక్షి, ఏలూరు: ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాసంకల్పయాత్ర @2000 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించిన జననేత.. మైలురాయికి గుర్తుగా ఒక కొబ్బరిమొక్కను నాటారు. వెంకటాపురం నుంచి ఏలూరుకు చేరుకోనున్న జగన్.. ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జననేత పాదయాత్ర 2000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి. ప్రజాసంకల్పయాత్ర 2000కి.మీ పైలాన్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్ పాదయాత్ర 2000కి.మీ మైలురాయికి గుర్తుగా కొబ్బరిమొక్కను నాటుతున్న వైఎస్ జగన్ జిల్లాల వారీగా ప్రజాసంకల్పయాత్ర విశేషాల్లో కొన్ని.. ►నవంబర్ 6, 2017 న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర.. సోమవారం(161వ రోజున) 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ►వైఎస్సార్ జిల్లా: ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడురోజులపాటు 94 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ►కర్నూలు జిల్లా: ఏడు నియోజకవర్గాల్లో 18 రోజులపాటు 263 కిలోమీటర్లు ►అనంతపురం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 279 కిలోమీటర్ల పాదయాత్ర ►చిత్తూరు జిల్లా: 10 నియోజకవర్గాల్లో 23 రోజుల పాత్రయాత్రో 291 కిలోమీటర్ల కాలినడక ►నెల్లూరు జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 267 కిలోమీటర్ల పాదయాత్ర ►ప్రకాశం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 21 రోజులపాటు 278 కిలోమీటర్లు ►గుంటూరు జిల్లా: 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోజులు 281 కిలోమీటర్ల యాత్ర ►కృష్ణా జిల్లా: 12 నియోజకవర్గాల్లో 24 రోజులపాటు 244 కిలోమీటర్లు ►పశ్చిమగోదావరి జిల్లా: మే 13న(ఆదివారం) మహేశ్వరపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. సోమవారం ఉదయం మహేశ్వరపురం నుంచి శ్రీపర్రు, గురకళ పేట మీదుగా లింగారావుగూడెం, మాదేపల్లిల్లో ప్రజలతో మమేకం అయ్యారు. వెంకటాపుంర వద్ద ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అక్కడ నుంచి ఏలూరు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
అతివదే అగ్రస్థానం
ఏలూరు, న్యూస్‌లైన్:జిల్లా నాయకుల భవితవ్యం తమ చేతుల్లోనే ఉందనే విషయూన్ని అతివలు మరోసారి తేల్చి చెప్పారు. ఓటర్ల నమోదులో ఈసారి కూడా మన జిల్లా మహిళలు అధిక్యతను కొనసాగించారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 35వేల 952మంది ఉన్నట్లు 2014 ఓటర్ల గణాం కాలు స్పష్టం చేశాయి. ఒక్క గోపాలపురం నియోజకవర్గం మినహా.. 14 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం కావటం విశే షం. అధిక శాతం యువతీ యువకులు సైతం ఓటుహక్కు పొందారు.ఎన్నికల సంఘం జారీ చేసిన తుది ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే... జిల్లాలో మొత్తం ఓట ర్లు 28లక్షల 12వేల 472 మంది కాగా, వారిలో మహిళలు 14లక్షల 24వేల 212 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 13లక్షల 88వేల 260 మందిగా లెక్క తేలారు. జిల్లాలో అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గంగా చింతలపూడి రికార్డు దక్కించుకుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2లక్షల 30వేల 029 మంది కాగా, పురుషులు 1లక్షా 14వేల 741 మంది. మహిళలు 1లక్షా 15వేల 288 మంది ఉన్నారు. రెండు, మూడు స్ధానాల్లో తణుకు, భీమవరం నియోజకవర్గాలు నిలిచాయి. ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న నియోజకవర్గంగా నరసాపురం నిలిచింది. జాబితాల ప్రదర్శన జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఎట్టకేలకు ముగిసింది. తుది ఫొటో ఓటరు జాబితాలు శనివారం జిల్లాకు చేరాయి. అధికారులు వాటిని హడావుడిగా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఓటర్ల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. జిల్లాకు వచ్చిన 13వేల 151 కొత్త ఓటరు గుర్తింపు కార్డులను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేసేందుకు సన్నద్ధమయ్యూరు. యువత జోష్ ఓటు హక్కు పొందటం ద్వారా ప్రజాప్రతినిధుల జాతకాలను మార్చేందుకు యువత రంగంలోకి దిగింది. గత ఏడాది ఓటర్ల నమోదు సందర్భంగా 28 వేల మంది యువతీ యువకులు నమోదయ్యూరు. ఈసారి 18-19 సంవత్సరాల మధ్య వయసు గలవారు 73వేల 329 మంది ఓటర్లుగా నమోదయ్యూరు. సగటున ప్రతి నియోజకవర్గంలోను ఐదు వేల మంది యువ ఓటర్లు నమోదయ్యూరు. వీరిలో సగం మంది కార్యాలయాల జోలికి వెళ్లలేదు. ఆన్లైన్ ద్వారా ఓటర్లుగా నమోదయ్యూరు. వయసుల వారీగా ఓటర్ల సంఖ్య ఇలా... ఈసారి ఓటర్లను వయసుల వారీగా లెక్కతేల్చారు. యువ ఓటర్ల సంఖ్యను తెలుసుకునేందుకే ఇలా చేశారని సమాచారం. అయితే ఏ నియోజకవర్గంలో ఎంత మంది యువ ఓటర్లు ఉన్నారనేది అధికారులు బయట పెట్టడం లేదు. సూత్రప్రాయంగా సంఖ్యలను చెప్పటం విమర్శలకు తావిచ్చింది. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు 73,329 మంది, 20-29 వయసువారు 7లక్షల 64వేల 994 మంది ఉన్నారు. 30-39 ఏళ్ల వారు 6లక్షల 97వేల 314 మంది కాగా, 40-49 ఏళ్ల వారు 5లక్షల 44వేల 653 మంది ఉన్నారు. 50-59 ఏళ్ల వారు 3లక్షల 80వేల 741 మంది, 60-69 ఏళ్ల వారు 2లక్షల 23వేల 184 మంది, 70-79 ఏళ్ల వారు 1లక్షా 06వేల 187 మంది, 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 22,070 మంది ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. 2013 నవంబర్ 18 నాటికి నియోజకవర్గాల వారీగా నమోదైన ఓటర్ల సంఖ్య, జనవరి 31న ఖరారు చేసిన ఓటర్ల సంఖ్యలను పక్క పట్టికల్లో చూడవచ్చు.