మోతే వేదకుమారి, కె.అచ్చమాంబ
సాక్షి, విజయవాడ : రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి నారీమణులుగా గాయని మోతే వేదకుమారి (ఏలూరు), కె.అచ్చమాంబ (విజయవాడ) రికార్డులకు ఎక్కారు. ఏలూరుకు చెందిన వేదకుమారి టైలరింగ్, టైప్ రైటింగ్‌లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేవారు. రెండోసారి 1957 ఎన్నికల్లో వేదకుమారి కాంగ్రెస్ తరఫున పోటీచేసి తన ప్రత్యర్థి వీరమాచనేని విమలాదేవిపై గెలుపొందారు. 1962 ఎన్నికల్లో వీరమాచనేని విమలాదేవి (కమ్యూనిస్ట్) వేదకుమారిపై విజయం సాధించారు. 1957లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి కొమర్రాజు అచ్చమాంబ విజయ కేతనం ఎగురవేశారు. ఆమె ప్రముఖ వైద్యురాలు, న్యాయవాది కూడా. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఆమె సైద్ధాంతికంగా విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత ఎంపీగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment