2000 km
-
వలస కార్మికులు గమ్యం చేరెదెన్నడో!
ముంబై: పదులు.. వందలు కాదు... వేల కిలోమీటర్లను లెక్క చేయకుండా ప్రయాణం సాగించేందుకు సిద్ధమయ్యారు. బతుకు పోరాటం కోసం అడుగడుగునా ఎదురయ్యే కష్టాలను సైతం పంటి బిగువున భరిస్తామంటున్నారు. అటు భానుడి ప్రతాపాన్ని ఇటు పోలీసుల ఆగ్రహాన్ని భరిస్తూ ముందుకు సాగనున్నామని ఆయాసంతో చెప్తున్నారు వలస కార్మికులు. బీహార్‌లోని దర్భంగాకు చెందిన 15 మంది వలస కూలీలు ముంబైలో పని చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వారి పొట్ట కొట్టినట్టయింది. అన్నం పట్టే నాధుడు లేక, రోజుల తరబడి ఆకలికి ఆగలేక కష్టమైనా నష్టమైనా స్వస్థలాలకు వెళ్లి కలో గంజో తాగి బతుకుతామంటున్నారు. అందుకోసం నేడు తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమయ్యారు. (కన్నీటి పర్యంతమవుతున్న వలస కూలీలు) బతుకు చిధ్రమై 45 రోజులు.. అయితే వారిని గమనించిన కొందరు మీడియా ప్రతినిధులు "మీ కోసం ప్రత్యేక రైళ్లు కేటాయించారు కదా? ఎందుకు దాన్ని వినియోగించుకోవట్లే"దని ప్రశ్నించారు. దీనికి కార్మికులు బదులిస్తూ.. "14వ తేదీ తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు మళ్లీ ఎలాంటి సమాచారమివ్వలేదు. ఇప్పటికే బతుకు చిధ్రమై 45 రోజులవుతోంది. ఇంకా అధికారుల నుంచి పిలుపు కోసం ఎదురు చూడలేక ఇలా బయలు దేరుతున్నాం" అని ఓ వలస కార్మికుడు ఆవేదన వెల్లగక్కాడు. ఇదిలా వుండగా నవీ ముంబైకి చెందిన మరో 20 మంది వలస కార్మికులు తమ స్వస్థలాలైన బుల్దానాకు కాలిబాటన బయలుదేరారు ఇందులో ఏడు నెలల గర్భవతితో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వారు కొద్దిపాటి ఆహారాన్ని కూడబెట్టుకుని నడక సాగిస్తున్నారు. (ఈ టెన్షన్ ఎటువైపో?) -
న్యాయమూర్తులకూ తప్పని లాక్డౌన్ కష్టాలు
కోల్‌కతా: లాక్డౌన్ కష్టాలు న్యాయమూర్తులకూ తప్పలేదు. ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇద్దరు జడ్జ్‌లు సుమారు 2వేల కి.మీ. ప్రయాణించారు. ఈ ఘటన దేశంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో చోటు చేసుకుంది. కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న దీపాంకర్ దత్తాకు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. దీంతో ఆయన ఉన్నఫళంగా శనివారం కోల్‌కతాను వదిలి కుటుంబంతో సహా ముంబైకు పయనమయ్యారు. సుమారు 2 వేల కి.మీ.కు పైగా ప్రయాణం అనంతరం సోమవారం మధ్యాహ్నానికి ఆర్థిక రాజధానిలో అడుగు పెట్టనున్నారు. మరోవైపు అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న బిశ్వనాథ్ సోమద్ధర్ మేఘాలయ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. (పోలీసు నుంచి మంత్రికి సోకిన కరోనా) ఇందుకోసం కోల్‌కతా మీదుగా షిల్లాంగ్‌కు పయనమయ్యారు. తొలుత ఆయన కోల్‌కతా హైకోర్టులో సేవలందించారు. ఆ తర్వాత అక్కడి నుంచి అలహాబాద్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన సీజేగా బాధ్యతలు స్వీకరించేందుకు శుక్రవారం తన భార్యతో కలిసి కారులో బయలుదేరారు. రెండు రోజుల అలుపెరగని ప్రయాణం అనంతరం నేడు మధ్యాహ్నానికి ఆయన షిల్లాంగ్‌కు చేరుకోనున్నారు. కాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ గురువారం వీరిద్దరూ ఆయా హైకోర్టుల్లో సీజేగా బాధ్యతలను స్వీకరించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (జడ్జికి కరోనా రానూ: లాయర్ శాపనార్థం) -
ఆర్మీ అధికారి చనిపోతే ఇంత ఘోరమా?
బెంగళూరు: ఆర్మీ అధికారిగా సేవలందిస్తోన్న తన కుమారుడిని కడచూపు చూడాలని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అందుకోసం ఏకంగా 2,600 కి.మీ ప్రయాణించారు. వివరాలు.. ప్రతిష్టాత్మక శౌర్యచక్ర పురస్కార గ్రహీత నవజోత్ సింగ్ ఆర్మీ ప్రత్యేక దళాల విభాగంలో పని చేస్తున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన గురువారం బెంగుళూరులో కన్నుమూశారు. అయితే ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న తమ తల్లిదండ్రులు బెంగళూరు రావడానికి ఏర్పాట్లు చేయాలని ఆ అధికారి సోదరుడు నవతేజ్ సింగ్ బాల్ కోరారు. లాక్డౌన్ అమల్లో ఉన్నందును తాము రావడానికి ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. (కరోనా మిస్టరీలు) అయితే దీనికి ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని, ఈ విషయంలో తాము ఎలాంటి సహాయం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో చేసేదేం లేక కల్నల్ కుటుంబ సభ్యులు రోడ్డు మార్గంలో కారులో ప్రయాణం మొదలు పెట్టారు. ఈ ప్రయాణానికి సంబంధించిన వివరాలను కల్నల్ సోదరుడు నవతేజ్ సింగ్ సోషల్ మీడియాలో వివరిస్తూ వచ్చారు. ఈ విషయం గురించి మాజీ ఆర్మీ అధికారి వీపీ జనరల్ ట్విటర్లో స్పందిస్తూ.. "నా ప్రగాఢ సానుభూతి. క్షేమంగా ప్రయాణించండి. దీనికి భారత ప్రభుత్వ అధికారులు మీకు ఎలాంటి సహాయం చేయకపోవడం విచారకరం. చట్టాలేవీ బండరాళ్లపై రాయరు కదా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని మార్చుకోవాలి" అని ఘాటుగా కామెంట్ చేశారు. మరొకవైపు ఎలాంటి సహాయం చేయకుండా ఆ కుటుంబాన్ని అవమానించారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి(చెట్టంత కొడుకే పోయాడు.. ఆ బూడిదతో ఏం పని?) -
ప్రజాసంకల్పయాత్ర@2000 కి.మీ.
-
చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర@2000 కి.మీ
-
వైఎస్ జగన్ పాదయాత్రలో చరిత్రాత్మక ఘట్టం
సాక్షి, ఏలూరు: ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాసంకల్పయాత్ర @2000 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించిన జననేత.. మైలురాయికి గుర్తుగా ఒక కొబ్బరిమొక్కను నాటారు. వెంకటాపురం నుంచి ఏలూరుకు చేరుకోనున్న జగన్.. ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జననేత పాదయాత్ర 2000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి. ప్రజాసంకల్పయాత్ర 2000కి.మీ పైలాన్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్ పాదయాత్ర 2000కి.మీ మైలురాయికి గుర్తుగా కొబ్బరిమొక్కను నాటుతున్న వైఎస్ జగన్ జిల్లాల వారీగా ప్రజాసంకల్పయాత్ర విశేషాల్లో కొన్ని.. ►నవంబర్ 6, 2017 న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర.. సోమవారం(161వ రోజున) 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ►వైఎస్సార్ జిల్లా: ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడురోజులపాటు 94 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ►కర్నూలు జిల్లా: ఏడు నియోజకవర్గాల్లో 18 రోజులపాటు 263 కిలోమీటర్లు ►అనంతపురం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 279 కిలోమీటర్ల పాదయాత్ర ►చిత్తూరు జిల్లా: 10 నియోజకవర్గాల్లో 23 రోజుల పాత్రయాత్రో 291 కిలోమీటర్ల కాలినడక ►నెల్లూరు జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 267 కిలోమీటర్ల పాదయాత్ర ►ప్రకాశం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 21 రోజులపాటు 278 కిలోమీటర్లు ►గుంటూరు జిల్లా: 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోజులు 281 కిలోమీటర్ల యాత్ర ►కృష్ణా జిల్లా: 12 నియోజకవర్గాల్లో 24 రోజులపాటు 244 కిలోమీటర్లు ►పశ్చిమగోదావరి జిల్లా: మే 13న(ఆదివారం) మహేశ్వరపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. సోమవారం ఉదయం మహేశ్వరపురం నుంచి శ్రీపర్రు, గురకళ పేట మీదుగా లింగారావుగూడెం, మాదేపల్లిల్లో ప్రజలతో మమేకం అయ్యారు. వెంకటాపుంర వద్ద ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అక్కడ నుంచి ఏలూరు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
2000 కి.మీ చేరుకోనున్న వైఎస్ జగన్ పాదయాత్ర