సాక్షి, పెద్దపల్లి: మంథని నియోజకవర్గ పరిధిలోని ఇసుక క్వారీల మాఫియాపై హైకోర్టు జోక్యం చేసుకుంది. మంథని మండలంలోని వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణపై గత నెల 16న పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ జారీ చేసిన ప్రొసీడింగ్‌పై సోమవారం నోటీసులు జారీ చేసింది. కాగా వెంకటాపూర్ గ్రామంలోని మానేరు ఇసుక క్వారీపై న్యాయవాది గట్టు వెంకట నాగమణి కోర్టుకు లేఖ రాశారు. భూగర్భ జలాలు అడుగంటుతుండగా, రైతులతో బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్న వ్యవహారాన్ని, నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక రవాణా జరపడాన్ని లేఖలో ఎండగట్టింది. (ఆ వారసులకు రూ.20 వేల కోట్లు)
రూ.50 కోట్ల విలువైన ఇసుకను రూ.5 కోట్లకు అప్పగించడంపై వెంకటాపూర్ గ్రామానికి జరుగుతున్న కోట్లాది రూపాయల నష్టాన్ని ఆమె లేఖలో పేర్కొంది. ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని జిల్లా వరకు 9 మంది అధికారులను,శాఖలను ప్రతి వాదులుగా చేర్చింది. గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న ఇసుక రవాణాపై పూర్తి వివరాలు తెలపాని నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇతర 14 ఇసుక క్వారీల మైనింగ్ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. (ఇసుక ఇబ్బందులకు.. రెండ్రోజుల్లో చెక్)
Comments
Please login to add a commentAdd a comment