ఆస్పత్రి అధోగతి
ఇది వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మండలంలోని 12 గ్రామాలకు ఏకైక దిక్కరుున ఈ పీహెచ్‌సీలో సమస్యలు అనేకం. పీహెచ్‌సీ ఆవరణ అంతా పిచ్చిమొక్కలతో అడవిని తలపిస్తోంది. ఇక ఆస్పత్రి ఎదుట పెద్ద పాముల పుట్ట. అందులో నుంచి అప్పుడప్పుడు విషసర్పాలు బయటకు వస్తుండడంతో సిబ్బంది, ఆస్పత్రికి వచ్చే ప్రజలు భయూందోళనకు గురవుతున్నారు.
ఇక్కడ సిబ్బంది సేవలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారుు. మరుగుదొడ్లు, తాగునీటి సమస్య షరా మామూలే. ఆస్పత్రి ఆవరణలో ఆరు మరుగుదొడ్లు ఉన్నా అందులో మూడే పని చేస్తున్నారుు. తాగునీటి ట్యాంకును గత ఆరు నెలలుగా శుభ్రం చేసిన నాథుడే లేడు. దీంతో ఈ పీహెచ్‌సీకి వచ్చే పేద రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. - వెంకటాపురం