అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. కాల్వ గట్టుపై నిద్రిస్తున్న ఓ రైతుపై నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఆ ఘటనలోఅబ్దుల్లా అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే స్పందించి ట్రాక్టర్ను అడ్డుకుని... డ్రైవర్కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఘటన స్థలం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.