![Apollo Clinic to set up society clinics in residential complexes - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/20/Untitled-26.jpg.webp?itok=wS_WleWs)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో క్లినిక్ భారీ నివాస సముదాయాల్లో సొసైటీ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సేవల్లో ఉన్న అప్నా కాంప్లెక్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. హైదరాబాద్ సహా బెంగళూరు, పుణే, చెన్నైలో వీటిని నెలకొల్పుతారు.
ఈ క్లినిక్స్‌లో వైద్యుల కన్సల్టేషన్, రక్తపరీక్షల కోసం నమూనాల సేకరణ, హెల్త్ చెక్ ప్యాక్స్, ప్రాథమిక వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలు, వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మూడేళ్లలో హైదరాబాద్‌లో ఇటువంటి కేంద్రాలు 75 దాకా ఏర్పాటు చేస్తామని అపోలో క్లినిక్ సీవోవో ఆనంద్ వెల్లడించారు. మరో ఎనిమిది నగరాలకు విస్తరించడం ద్వారా 2021 నాటికి 500 కేంద్రాల స్థాయికి తీసుకువెళతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment