భువనేశ్వర్ : ఒక రూపాయికి ఏమోస్తుందో టపీమనీ చెప్పమంటే..ఏంచేప్తాం...కాస్త ఆలోచించి..ఏ చాక్లెట్ పేరో చెప్పేస్తాం..కానీ ఆరోగ్యాన్ని అందించే క్లినిక్ ఫీజు ఒక్క రూపాయి అంటే ఏవరైన నమ్ముతారా? అయితే ఈ స్టోరి చదివేయండి మరీ..తాను అందరిలా కష్టపడి డాక్టర్ చదివాడు.. పేదలకు ఏదైనా చేయాలనుకున్నాడు. తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఒక రూపాయితోనే క్లినిక్ ప్రారంభించి అందరి మన్ననలని పొందుతున్నాడు.
ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్( విఐయంఎస్‌ఎఆర్) ఉంది. దీనిలో శంకర్ రామచందాని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నాడు. ఇతను పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బూర్లా గ్రామంలో ఒక రూపాయికే క్లినిక్‌ను ప్రారంభించాడు. తన పనిగంటలు మినహయించిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి 8 గంటలు, తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు పేదవారికోసం క్లినిక్‌లో సేవచేయడానికి నిర్ణయించుకొన్నాడు.ఈ క్లినిక్‌లో వృద్దులు, దివ్యాంగులు, నాణ్యమైన వైద్యంపొందలేని వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపాడు. తాను కేవలం మాస్‌ప్రజల, పేదల డాక్టర్‌నని అన్నాడు.
విమ్సారా ఆసుపత్రిలో ఒపిడిలో వృద్దులు గంటల కొద్ది నిరీక్షించలేని వారందరికి ఈ క్లినిక్‌లో చికిత్స చేస్తున్నానని అన్నాడు. రామచందాని భార్య సిఖా చందాని డెంటల్ సర్జన్..ఈమె కూడా భర్త అడుగు జాడల్లో నడుస్తోంది. పేదలకు తానుకూడా సేవలు అందిస్తొంది. కాగా, 2019లో రోడ్డుపై పడి ఉన్న ఒక కుష్ఠురోగిని రామచందాని తన స్వహస్తలతో అతడిని పట్టుకొని వారింటికి వెళ్ళి దిగబెట్టి వచ్చాడు. అప్పుడు రామచందాని తండ్రి దివంగత బ్రహ్మనంద్ రామచందాని ఒక నర్పింగ్ హోమ్‌ని ప్రారంభించాలని కోరాడు. నర్సింగ్ హోమ్ ప్రారంభించడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే పేదలకు ఒక రూపాయితో క్లినిక్‌ను ప్రారంభించానని అన్నాడు.
ఈ రూపాయికూడా పేదలకు తాము ఉచితంగా సేవ చేసుకుంటున్నామనే భావన ఉండకూడదనే తీసుకుటున్నట్లు తెలిపాడు. గత సంవత్సరం కొవిడ్ నేపథ్యంలో డ్యూటికన్న కూడా ఎక్కువ సమయాన్ని ఆసుపత్రిలోనే సేవలు చేసి అందరి మన్ననలను పొందాడు రామచందాని. అంతేకాకుండా ఒక కొవిడ్ సొకిన పేషేంట్ ని తన కారులో విమ్సర్ ఆసుపత్రికి చేర్చి అందరిచేత శభాష్ అనిపించుకొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment