వామ్మో.. ఇన్ని కొత్త నోట్లా...? | Odisha: Sambalpur Police arrests 8 persons and seized Rs 1.4 crore cash | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఇన్ని కొత్త నోట్లా...?

Published Sun, Dec 4 2016 2:10 PM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM

వామ్మో.. ఇన్ని కొత్త నోట్లా...? - Sakshi

వామ్మో.. ఇన్ని కొత్త నోట్లా...?

సంబల్పూర్‌: బెంగళూరులో ఆరు కోట్ల రూపాయలు బయటపడిన ఘటన మరిచిపోకముందే ఒడిశాలోని సంబల్పూర్ లో భారీ మొత్తంలో డబ్బు దొరికింది. అక్రమంగా తరిలిస్తున్న 1.42 కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొత్త నోట్లే 85 లక్షల రూపాయల వరకు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారానికి సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకులు, అయిదు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బు ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement