Sambalpur
-
నేడు ప్రధాని మోదీ ఒడిశా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు(శనివారం) ఒడిశాలో పర్యటించనున్నారు. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా వేదిక చుట్టూ డ్రోన్ కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం ఝార్సుగూడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్పూర్ వెళతారు. జగదీష్పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్‌బీడీపీఎల్)లోని 412 కిలోమీటర్ల పొడవైన ధమ్రా అంగుల్ పైప్‌లైన్ సెక్షన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి ఊర్జా గంగ కింద రూ.2,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒడిశాను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానిస్తుంది. అదేవిధంగా ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లోని నాగ్‌పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ సెక్షన్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 2,660 కోట్లకు పైగా ఖర్చు కానుంది. దీంతో ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో సహజవాయువు లభ్యత మెరుగుపడనుంది. అలాగే దాదాపు రూ. 28,980 కోట్ల విలువైన పలు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్.. సంబల్‌పురీ చీరకట్టి సంబురంగా పరుగెట్టీ
మొన్నటికి మొన్న గ్వాలియర్‌లో... చీరె ధరించి ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు మహిళామణులు. తాజాగా... మాంచెస్టర్ మారథాన్‌లో చీరె ధరించి పాల్గొని ‘శభాష్’ అని ప్రశంసలు అందుకుంటోంది మధుస్మిత జెన... చిన్నప్పటి నుంచి మధుస్మితకు పరుగెత్తడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చింది. మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న మధుస్మిత జెన నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్ ఒడియా కమ్యూనిటీలో క్రియాశీల కార్యకర్త. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మారథాన్లు, ఆల్ట్రా మారథాన్లలో పాల్గొంది. తాజాగా మాంచెస్టర్‌లో 42.5 కి.మీల మారథాన్‌లో పాల్గొంది. ఈసారి మాత్రం అందరూ ఆశ్చర్యపడేలా చేసింది. అభినందనలు అందుకుంది. ఈసారి ప్రత్యేకత...సంబల్‌పురీ చీర కట్టి మారథాన్‌లో పాల్గొంది మధుస్మిత. ‘అంతదూరం చీరతో పరుగెత్తడం సులువేమీ కాదు’ అంటున్న మధుస్మిత సంతోషం ప్లస్ సంకల్పబలంతో నాలుగు గంటల యాభైనిమిషాలలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ‘చీరతో మారథాన్‌లో పాల్గొనడం అసాధ్యం అనేది చాలామంది నమ్మకం. ఇది తప్పని రుజువు చేయాలనుకున్నాను’ అంటుంది 41 సంవత్సరాల మధుస్మిత. ‘తనలోని ప్రతిభతో ఎప్పుడూ ఎంతోమందికి స్మిత స్ఫూర్తి ఇస్తుంటుంది. ఆమె విజయానికి గర్విస్తున్నాం’ అంటున్నాడు ఒడియా కమ్యూనిటీ మాజీ కార్యదర్శి సుకాంత్ కుమార్ సాహు. ఒడిశాలోని కుస్పూర్ గ్రామానికి చెందిన మధుస్మితకు తల్లి, అమ్మల ద్వారా చీరెపై ఇష్టం ఏర్పడింది. ఇంగ్లాండ్‌లో ప్రత్యేకమైన సందర్భాలు, వేసవిలో చీర ధరిస్తుంది మధుస్మిత. -
హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా
న్యూఢిల్లీ: ఐఐఎం సంబల్పూర్ విద్యార్థులు ప్లేస్మెంట్లు, వేతనాల విషయంలో సరికొత్త రికార్డ్ సాధించారు. గత 7 సంవత్సరాల మాదిరిగానే, ఈ సారి 2021-2023 ఏడాదికి గాను 100శాతం ప్లేస్‌మెంట్స్‌తో సంస్థ చరిత్ర సృష్టించింది. 2023లో ఎంబీఏ ఉత్తీర్ణులైన 167 మంది విద్యార్థులు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందగా, వీరిలో 80మంది విద్యార్థినులున్నారు. వీరిలో 65 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించి అవని మల్హోత్రా టాప్ ప్లేస్ కొట్టేసింది. హయ్యస్ట్ ప్యాకేజీ అందుకున్న వరుసలో తమిళనాడు, రాజస్థాన్ విద్యార్థులు నిలిచారు. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) అవని మల్హోత్రా ఎవరు? జైపూర్‌కు చెందిన అవనిమల్హోత్రా మైక్రోసాఫ్ట్‌లో భారీ ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించి వార్తల్లో నిలిచింది. ఏకంగా 64.61 లక్షల వార్షిక జీతాన్ని అందుకోనుంది. పట్టుదల, కృషి ఉంటే విజయం వచ్చి వరిస్తుందనే మాటకు నిదర్శనంగా తన డ్రీమ్ జాబ్‌ను కొట్టేసింది అవని. ఐదారు రౌండ్ల ఇంటర్వ్యూల్లో విజయం సాధించి జాక్‌పాట్ కొట్టేసింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మూడేళ్లపాటు సేవలందించిన అనుభవం, సంస్థాగత సామర్థ్యం కారణంగా ఆమెను ఎంపిక చేశారట. దీంతోపాటు కంప్యూటర్ సైన్స్‌లో బీ.టెక్ చదవడం ప్రత్యేకంగా నిల బెట్టిందని చెప్పింది. ఈ చాలెంజ్‌ను ఛేదించడంలో సాయం చేసిన ప్రొఫెసర్లకు, తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. (ఇదీ చదవండి: అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, తమ విద్యార్థుల గొప్ప ప్లేస్మెంట్ సాధించారని ఐఐఎం సంబల్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహదేవ్ జైస్వాల్ సంతోషం ప్రకటించారు. తమ సంస్థలో సంవత్సరానికి అత్యధిక జీతం రూ. 64.61 లక్షలుండగా, సగటు జీతం రూ. 16 లక్షలుగా ఉందని తెలిపారు. మైక్రోసాఫ్ట్, వేదాంత, తోలారం, అమూల్, అదానీ, ఈవై, యాక్సెంచర్, కాగ్నిజెంట్, డెలాయిట్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థల్లో తమ విద్యార్థులు ప్లేస్ అవుతున్నారన్నారు. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) -
‘మహిళా పోలీస్ వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే’
సంబల్పూర్: ఒడిషాలో ప్రధాన ప్రతిపక్ష నేతకు, ఓ మహిళా పోలీస్ అధికారిణికి మధ్య వాగ్వాదం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. బహిరంగంగా ఆమెపై ఆరోపణలు గుప్పించిన బీజేపీ నేత జయనారాయణ్ మిశ్రా.. ఆమెను ఒక్కసారిగా తోసేశాడు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆమెనే తనను తోసేసిందంటూ మిశ్రా సైతం ఫిర్యాదు చేశాడు. ఒడిషాలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు పిలుపు ఇచ్చింది బీజేపీ. ఈ క్రమంలో సంబల్పూర్ కలెక్టరేట్ వద్ద బుధవారం ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. అయితే ఆ సమయంలో మిశ్రాకు, ధనుపలి స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంచార్జ్ అనితా ప్రధాన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అది ఒక్కసారిగా తీవ్రంగా మారి.. ఆయన ఆమెను తోసేశాడు. అనితా ఏం చెప్తోందంటే.. ఆయన నన్ను చూసి.. లంచాలు తీసుకుంటావంటూ విమర్శించాడు. నన్నొక దొంగగా వ్యాఖ్యానించారు. ఎందుకలా విమర్శిస్తారని అడిగితే.. ముఖం మీద చెయ్యేసి తోసేశారు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. Presenting a super SANSKARI leader from Odisha. He assaulted the Lady Police Officer. Even threatened to burn her Police Station down. He is LOP #JaynarayanMishra of @BJP4Odisha . How much more Respect India can expect!! @Indian10000000 @TamilRatsaschi @cpimlliberation pic.twitter.com/pzdh9TbniJ — Parwez ପରୱେଜ (@parwezalli) February 15, 2023 అయితే మిశ్రా ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. బీజేపీ మహిళా కార్యకర్తలను వేధించడం గురించే ఆమెను ప్రశ్నించాను. అసలు ఆమె ఎవరో కూడా అంతకు ముందు నాకు తెలియదు. నేనేం ఆమెను తోసేయలేదు. ఆమెనే నన్ను తోసేసిందని చెప్తున్నారు. ఈ ఇద్దరి ఫిర్యాదు మీద సంబల్పూర్ ఎస్పీ గంగాధర్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, సమగ్ర నివేదిక వచ్చాకే ఏదైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారాయన. ఇక ఈ ఘటనను ప్రస్తావిస్తూ బీజేపీ.. నవీన్ పట్నాయక్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఓ అధికారి ఓ మంత్రిని కాల్చి చంపేశాడు. ఇప్పుడేమో ఓ పోలీస్ అధికారిణి ప్రతిపక్ష నేతపై దాడికి దిగింది. అసలు ఒడిషాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? అని నిలదీస్తోంది. మిశ్రా అసెంబ్లీలో ఎక్కడ ప్రభుత్వాన్ని కడిగిపారేస్తారేమోననే భయంతోనే ఇలాంటి చర్యలకు పోలీసులను వుసిగొల్పుతోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తోంది. మరోవైపు బీజేడీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. మిశ్రా మీద హత్య కేసుతో సహా 14 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడేమో దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని విమర్శిస్తోంది. -
పీరియడ్స్‌లో వేతన సెలవులివ్వాల్సిందే
సంబాల్పూర్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు పీరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని సంబాల్పూర్ పట్టణ యువతులు ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలుజారీ చేయాలని ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒడిశా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుశాంత్ సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారని, వారికి తగిన విశ్రాంతి అవసరమని అన్నారు. అందుకే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోరారు. కనీసం ఒక్క రోజైనా సెలవు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే 99 శాతం మంది మహిళలు గరిష్టంగా 24 గంటలపాటు నొప్పితో బాధపడుతూ ఉంటారని గుర్తుచేశారు. భారత్‌లో ప్రస్తుతం 12 కంపెనీలు మహిళలకు రుతుస్రావం సమయంలో పెయిడ్ లీవులు మంజూరు చేస్తున్నాయి. తమ ఉద్యమానికి మహిళల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని, ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదని రంజితా ప్రియదర్శిని స్పష్టం చేశారు. -
ఫేస్ బుక్ కలిపింది ఇద్దరినీ
ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, టిక్‌టాక్... టెక్నాలజీలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు... అందరూ అందులోనే మునిగిపోతున్నారు. అందుకే టెక్నాలజీ వచ్చి అందరినీ పాడు చేసేస్తోంది, ఎంతసేపూ సోషల్ మీడియాలో కూర్చుని సమయాన్ని వృథా చేస్తున్నారు అంటూ అందరూ టెక్నాలజీని తిడుతూనే ఉంటారు. అందులో వాస్తవం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, టెక్నాలజీ వల్ల మంచి కూడా జరుగుతుంది అని నిరూపించారు ఒక జంట. ఒడిషా సంబల్‌పూర్‌కి చెందిన లక్ష్మీరాణి (43), ఝార్ఖండ్కి చెందిన మహాబీర్ ప్రసాద్ శుక్లా (48)లు మార్చి 21, 2021 ఆదివారం శంకరమఠంలో ఒక్కటయ్యారు. వీరిద్దరినీ ఫేస్బుక్ కలిపింది. ఇద్దరూ పుట్టుకతో బధిరులు. పుట్టుక నుంచి ఇద్దరికీ వినపడదు, మాట్లాడలేరు. లక్ష్మీరాణి మెట్రిక్యులేషన్ చదివారు. కుట్లు, బ్యుటీషియన్ కోర్సు పూర్తి చేశారు. మహావీర్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఆరు నెలల క్రితం లక్ష్మీరాణికి మహావీర్ ఫేస్బుక్లో పరిచయమయ్యారు. ఇద్దరూ ఫోన్ ద్వారా మాట్లాడుకోలేరు కనుక, సోషల్ మీడియాలో మెసేజెస్ ద్వారా భావాలను పంచుకున్నారు. ఇంకా విచిత్రమేమిటంటే ... వీరిద్దరూ వాట్సాప్ వీడియో కాల్లో వారి చేతుల మాటలలో మాట్లాడుకున్నారు. చూపులు కలిశాయి. చూపులతో పాటు ఇద్దరి భావాలూ కలిశాయి. ఇంకేం... ఒక్కటవ్వాలనుకున్నారు. టెక్నాలజీకి ఇద్దరూ చేతులెత్తి నమస్కరించారు. ఇద్దరూ ఒకరితో ఒకరు చేతులతో మాట్లాడుకుని, ఒకరి భావాలను ఒకరితో పంచుకుని, ఇద్దరూ మనసులు ఏకమై, ఇద్దరూ ఒక్కటవ్వడానికి సాంకేతిక పరిజ్ఞానమే ఉపయోగపడిందంటున్నారు ఈ నూతన జంట. ‘‘మా ఆంటీకి మహాబీర్ మామ ఫేస్బుక్లో కనిపించాడు. వీరిద్దరూ సోషల్ మీడియాలోని అన్ని వేదికలను ఉపయోగించుకున్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు బాగా సన్నిహితంగా మాట్లాడుకున్న తరవాత, మా ఆంటీ మహాబీర్ మామను వివాహం చేసుకుంటానని తన నిర్ణయాన్ని తెలిపింది, మామ కుటుంబీకులు కూడా అంగీకరించారు’ అంటాడు ఇరవై ఒక్క సంవత్సరాల లక్ష్మీరాణి మేనల్లుడు అర్ణవ బాబు. ఆమెకు ఇలా వివాహం కుదురుతుందని ఎన్నడూ అనుకోలేదు అంటున్నారు అర్ణవ్ తల్లిదండ్రులు. ‘లక్ష్మీరాణికి తగిన సంబంధం దొరికినందుకు మాకు చాలా ఆనందం కలిగింది. ఇదంతా ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్లే జరిగింది. ఇద్దరూ సంతోషంగా, ప్రశాంత జీవితాన్ని గడపాలని మనసారా ఆశీర్వదిస్తున్నాం’’ అంటున్నారు పెద్దలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య సంబల్పూర్లోని శంకరమఠంలో వీరిరువురి వివాహం నిరాడంబరంగా జరిగింది. ‘శతమానం భవతి’ అని పలికిన దీవెనలు, వారి జీవితాల్లో సంతోషాలను పల్లవించాలని ఆశిస్తున్నారు. లక్ష్మీరాణి, మహాబీర్ ప్రసాద్ శుక్లా -
ఆ క్లినిక్‌లో ఫీజు ‘ఒక్కరూపాయే’
భువనేశ్వర్ : ఒక రూపాయికి ఏమోస్తుందో టపీమనీ చెప్పమంటే..ఏంచేప్తాం...కాస్త ఆలోచించి..ఏ చాక్లెట్ పేరో చెప్పేస్తాం..కానీ ఆరోగ్యాన్ని అందించే క్లినిక్ ఫీజు ఒక్క రూపాయి అంటే ఏవరైన నమ్ముతారా? అయితే ఈ స్టోరి చదివేయండి మరీ..తాను అందరిలా కష్టపడి డాక్టర్ చదివాడు.. పేదలకు ఏదైనా చేయాలనుకున్నాడు. తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఒక రూపాయితోనే క్లినిక్ ప్రారంభించి అందరి మన్ననలని పొందుతున్నాడు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్( విఐయంఎస్ఎఆర్) ఉంది. దీనిలో శంకర్ రామచందాని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నాడు. ఇతను పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బూర్లా గ్రామంలో ఒక రూపాయికే క్లినిక్‌ను ప్రారంభించాడు. తన పనిగంటలు మినహయించిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి 8 గంటలు, తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు పేదవారికోసం క్లినిక్‌లో సేవచేయడానికి నిర్ణయించుకొన్నాడు.ఈ క్లినిక్‌లో వృద్దులు, దివ్యాంగులు, నాణ్యమైన వైద్యంపొందలేని వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపాడు. తాను కేవలం మాస్ప్రజల, పేదల డాక్టర్‌నని అన్నాడు. విమ్సారా ఆసుపత్రిలో ఒపిడిలో వృద్దులు గంటల కొద్ది నిరీక్షించలేని వారందరికి ఈ క్లినిక్‌లో చికిత్స చేస్తున్నానని అన్నాడు. రామచందాని భార్య సిఖా చందాని డెంటల్ సర్జన్..ఈమె కూడా భర్త అడుగు జాడల్లో నడుస్తోంది. పేదలకు తానుకూడా సేవలు అందిస్తొంది. కాగా, 2019లో రోడ్డుపై పడి ఉన్న ఒక కుష్ఠురోగిని రామచందాని తన స్వహస్తలతో అతడిని పట్టుకొని వారింటికి వెళ్ళి దిగబెట్టి వచ్చాడు. అప్పుడు రామచందాని తండ్రి దివంగత బ్రహ్మనంద్ రామచందాని ఒక నర్పింగ్ హోమ్‌ని ప్రారంభించాలని కోరాడు. నర్సింగ్ హోమ్ ప్రారంభించడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే పేదలకు ఒక రూపాయితో క్లినిక్‌ను ప్రారంభించానని అన్నాడు. ఈ రూపాయికూడా పేదలకు తాము ఉచితంగా సేవ చేసుకుంటున్నామనే భావన ఉండకూడదనే తీసుకుటున్నట్లు తెలిపాడు. గత సంవత్సరం కొవిడ్ నేపథ్యంలో డ్యూటికన్న కూడా ఎక్కువ సమయాన్ని ఆసుపత్రిలోనే సేవలు చేసి అందరి మన్ననలను పొందాడు రామచందాని. అంతేకాకుండా ఒక కొవిడ్ సొకిన పేషేంట్ ని తన కారులో విమ్సర్ ఆసుపత్రికి చేర్చి అందరిచేత శభాష్ అనిపించుకొన్నాడు. -
నేటి స్టార్టప్‌లే రేపటి ఎమ్ఎన్సీలు
న్యూఢిల్లీ: భారత్‌లో నేటి స్టార్టప్‌లే రేపటి బహుళ జాతి సంస్థలుగా మారుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అది సాధించినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం అవుతుందని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా వివిధ దేశాలకు చెందిన ఎంఎన్‌సీలు భారత్‌లో వ్యాపారం చేశాయని, ఇక భారత్ ఎంఎన్‌సీలు ఇతర దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తాయని అన్నారు. భారతదేశం లోకల్ నుంచి గ్లోబల్ వైపు అడుగులు వేయడానికి ఐఐఎం విద్యార్థులందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశాలోని సంబల్పూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. సృజనాత్మక ఆలోచనలతో అందరినీ భాగస్వాముల్ని చేస్తూ కలసి కట్టుగా ముందుకు వెళ్లడమే నిర్వహణ రంగంలో ముఖ్య సూత్రమన్నారు. భారత్ తన కాళ్ల మీద తాను నిలబడడానికి అదే కావాలన్నారు. ప్రతీ విద్యార్థి తమ కెరీర్ లక్ష్యాలను దేశాభివృద్ధికి ఉపయోగపడేలా మలచుకోవాలన్నారు. భారత్ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఐఐఎం విద్యార్థులు కొత్త కాన్సెప్ట్‌లతో లోకల్ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ వచ్చేలా కృషి చేసి ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి తోడ్పాటునందించాలన్నారు. లోకల్ నుంచి గ్లోబల్ మధ్య ఐఐఎం విద్యార్థులే వారధిగా ఉంటారని మోదీ చెప్పారు. -
ఫుడ్ ఏటీఎం
రైతు కష్టపడి పండించిన పంటను మనం ఇంటికి తెచ్చుకుని వండుకుని తింటున్నాం. వండుకున్నది మిగిలిపోతే పడేస్తున్నాం. రైతు పడిన కష్టం మనకు తెలియదు. అందుకే ఆహారం విలువ కూడా తెలియట్లేదు. విందు వినోదాలలోనైతే టన్నుల కొద్దీ ఆహారం వృథా అవుతుంటుంది. ఈ వృథాను అరికట్టేందుకు కొన్ని సేవా సంస్థలు మిగిలిన పదార్థాలను సేకరించి పేదలకు అందజేస్తుంటాయి. తాజాగా ఒడిశాలోని సంబల్పూర్లో ‘తృప్తి’ పేరున ఒక ఏటీఎంను నెలకొల్పారు. పేదలకు ఉచితంగా తినడానికి ఇంత ముద్ద అందజేయడం కోసమే ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ‘స్వచ్ఛ’ అనే ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో సంబల్పూర్ మునిసిపల్ కౌన్సిల్ ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముందుగా తమ దగ్గరకు వచ్చిన ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉందో లేదో పరీక్షించిన తరువాత మాత్రమే ఏటీఎంలో భద్రపరుస్తామని స్వచ్ఛ సంస్థ సభ్యులలో ఒకరైన దిలీప్ పాండా చెబుతున్నారు. అది కూడా కేవలం ప్యాక్డ్ శాకాహారం మాత్రమే విరాళంగా అందజేయాలట. పేదవారికి, అనాథలకు ఉచితంగా ఆహారం అందజేయడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడ ఆహారం దొరుకుతుంది. పేరుకు ఏటీఎం అయినా.. ఇందుకు కార్డులేమీ అవసరం లేదు. ఆకలి ఉంటే చాలు. 700 లీటర్ల సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్లో ఈ ఆహారాన్ని నిల్వ చేస్తున్నారు. సంబల్ పూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి దగ్గర ఇది కనిపిస్తుంది. -
లాకప్ డెత్ : పోలీసులే చంపేశారు
రక్షక భటులే భక్షకులయ్యారంటూ జనం తిరగబడ్డారు. ప్రజాగ్రహానికి పోలీస్‌స్టేషన్ రణరంగమైంది. ఆందోళనకారులు బీభత్సం సృష్టించి పోలీస్‌స్టేషన్, అక్కడి వాహనాలకు నిప్పుపెట్టారు. స్టేషన్‌లోని విలువైన పత్రాలను తగులబెట్టారు. అలజడి సృష్టిస్తున్న ఆందోళనకారులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. సంబల్పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ విధ్వంసకర సంఘటనపై బాధ్యులను చేస్తూ ముగ్గురు పోలీస్ సిబ్బందిపై డీజీపీ సస్పెన్షన్ వేటు వేశారు. భువనేశ్వర్/సంబల్పూర్: సంబల్పూర్ జిల్లాలోని ఒంయిఠాపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన లాకప్‌డెత్ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం అర్ధరాత్రి ఓ నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం ఈ వార్త ప్రసారం కావడంతో సంబల్పూర్లో శాంతిభద్రతలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నెల 7వతేదీన జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో మొబైల్, బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా చోరీ కేసులో ఒంయిఠాపల్లి పోలీసులు భాలూపల్లి గ్రామస్తుడు ఒవినాష్ ముండాను(25) అనుమానిత నిందితుడిగా గురువారం స్టేషన్‌కు తీసుకువచ్చారు. మర్నాడు ఉదయం నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల కథనం. శుక్రవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో కుటుంబీకులకు ఈ వార్త తెలిసింది. జిల్లా ప్రధానఆస్పత్రికి మృతదేహం తరలించినటుŠల్ తెలియడంతో అంతా అక్కడకు చేరారు. మృతుని కుటుంబీకులు, మేజిస్ట్రేట్ సమక్షంలో పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని బుర్లా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులే చంపేశారు తమబిడ్డ ప్రాణాల్ని పోలీసులే పొట్టన పెట్టుకున్నారని కుటుంబీకులు వాపోతున్నారు. పోలీసుల వేధింపులు తాళలేని పరిస్థితుల్లోనే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని మృతుని కుటుంబీకులు ఆవేదనతో రగిలిపోతున్నారు. వీరితో పాటు స్థానికులు కూడా పోలీస్ చర్యల పట్ల సందేహం వ్యక్తం చేస్తున్నారు. దుశ్చర్యలకు ఆత్మహత్య రంగు పులిమి దాటవేతకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో జరిగిన సంప్రదింపులు క్రమంగా వేడెక్కాయి. నిందితుని ప్రాణాల్ని పోలీసులే బలిగొన్నారన్న ఆరోపణ బహిరంగంగా ప్రసారం కావడంతో ఒంయిఠాపల్లి పోలీస్‌స్టేషన్ పరిసరాలు యుద్ధరంగంగా మారాయి. మృతుని కుటుంబీకులు, బంధుమిత్రులతో పాటు స్థానికులు ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. రాళ్లు రువ్వుతూ విజృంభించారు. స్టేషన్లోకి చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. స్థానికుల ఆగ్రహావేశాల్ని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఒంయిఠాపల్లి స్టేషన్‌పై నిరవధికంగా రాళ్లు రువ్విన స్థానికులు చివరికి నిప్పు అంటించారు. అలాగే స్టేషన్ ప్రాంగణంలో వాహనాలకు నిప్పుపెట్టి బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో పరిస్థితి చేయి దాటింది. ప్రజలు పోలీసులపై ప్రత్యక్ష తిరుగుబాటుకు సిద్ధం కావడంతో పోలీస్‌స్టేషన్ ఆవరణ రణక్షేత్రంగా మారింది. పోలీసులు, ప్రజల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు సాధారణ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువుర్ని ఆస్పత్రిలో చేర్చారు. స్టేషన్ పరిసరాల్లో బీభత్సానికి పాల్పడిన ప్రజానీకం అనంతరం జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీంతో సంబల్పూర్–ఝార్సుగుడ మార్గంలో వాహనాల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మానవ హక్కుల కమిషన్ విచారణ ఈ సంఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించినట్లు డీజీపీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. ముగ్గురు సభ్యుల మానవ హక్కుల కమిషన్ బృందం ఈ దర్యాప్తు చేపడుతుంది. ఉత్తర ప్రాంతీయ ఇనస్పెక్టర్ జనరల్ ఈ సంఘటనలో ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి నివేదిక దాఖలు చేస్తారని డీజీపీ తెలిపారు. సత్వరమే ఈ నివేదిక దాఖలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. సంబల్పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సంప్రదింపులతో మానవ హక్కుల పరిరక్షణ బృందం విచారణ, దర్యాప్తు కొనసాగుతుందని మానవ హక్కుల పరిరక్షణ విభాగం – హెచ్ఆర్పీసీ అదనపు డైరెక్టర్ జనరల్ మహేంద్ర ప్రతాప్ తెలిపారు. ఇన్స్పెక్టర్ ఇన్చార్జిపై వేటు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణ కింద సంబల్పూర్ ఒంయిఠాపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జిని తక్షణమే విధుల నుంచి తప్పించి సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు స్టేషన్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు డీజీపీ ప్రకటించారు. వీరిలో స్టేషన్ డైరీ చార్జ్ ఆఫీసర్, సెంట్రీ ఇన్చార్జి ఉన్నట్లు ఉత్తర ప్రాంతీయ ఇన్స్పెక్టర్ జనరల్ సుశాంత నాథ్ తెలిపారు. 2 యూనిట్ల అగ్ని మాపక దళం రంగంలోకి దిగి మంటల్ని నివారించింది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటే శాంతిభద్రతల పరిరక్షణ సక్రమంగా ఉంటుందని డీజీపీ వివరించారు. పరిస్థితి అదుపులోకి రాకుంటే ఈ ప్రాంతంలో 144వ సెక్షన్ విధించడం అనివార్యమవుతుందని డీజీపీ స్పష్టం చేశారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకునేందుకు 7 ప్లాటూన్ల పోలీసు దళాల్ని రంగంలోకి దింపారు. హెచ్ఆర్సీ మార్గదర్శకాలతో పోస్ట్‌మార్టం జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల మేరకు సందిగ్ధ లాకప్ డెత్ సంఘటనలో మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతుంది. వైద్య నిపుణుల బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో శవపరీక్షలు నిర్వహిస్తారు. ఈ యావత్ ప్రక్రియ వీడియో రికార్డింగ్ అవుతుందని సంబల్పూర్ ఎస్పీ సంజీవ్ అరోరా తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం పోలీసు స్టేషన్లో తుదిశ్వాస విడిచిన నిందితుని కుటుంబీకులకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. లాకప్ డెత్‌ను పురస్కరించుకుని ఆయన ఈ పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపట్ల సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
వామ్మో.. ఇన్ని కొత్త నోట్లా...?
సంబల్పూర్: బెంగళూరులో ఆరు కోట్ల రూపాయలు బయటపడిన ఘటన మరిచిపోకముందే ఒడిశాలోని సంబల్పూర్ లో భారీ మొత్తంలో డబ్బు దొరికింది. అక్రమంగా తరిలిస్తున్న 1.42 కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొత్త నోట్లే 85 లక్షల రూపాయల వరకు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకులు, అయిదు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బు ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. -
ఒడిషా విద్యార్ధిని ఉషా ఆత్మహత్య