ప్రధాని నరేంద్ర మోదీ నేడు(శనివారం) ఒడిశాలో పర్యటించనున్నారు. పశ్చిమ ఒడిశాలోని సంబల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా వేదిక చుట్టూ డ్రోన్ కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం ఝార్సుగూడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్‌పూర్ వెళతారు.
జగదీష్‌పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్‌బీడీపీఎల్)లోని 412 కిలోమీటర్ల పొడవైన ధమ్రా అంగుల్ పైప్‌లైన్ సెక్షన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి ఊర్జా గంగ కింద రూ.2,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒడిశాను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానిస్తుంది.
అదేవిధంగా ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లోని నాగ్‌పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ సెక్షన్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 2,660 కోట్లకు పైగా ఖర్చు కానుంది. దీంతో ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో సహజవాయువు లభ్యత మెరుగుపడనుంది. అలాగే దాదాపు రూ. 28,980 కోట్ల విలువైన పలు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment