న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా పది అణువిద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. సోమవారం శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల సంబంధ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీలో ఈ వివరాలను సభ్యులకు అందజేసింది. 700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో గుజరాత్, రాజస్తాన్, హరియాణాల్లో వీటిని నెలకొల్పారు.
గుజరాత్‌లోని కాక్రపార్‌లో రెండు అణు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి మొదలైందని కేంద్రం పేర్కొంది. అయితే వీటి నిర్మాణం చాలా ఆలస్యమవుతోందని కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘2007లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి కావస్తుండటం గ్రేట్. ‘సుప్రీం నేత’ కనుసన్నల్లో అభివృద్ధి వేగానికిది నిదర్శనం’’ అని ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. కాక్రపార్–3, కాక్రపార్–4 రియాక్టర్లు కాంగ్రెస్ హయాంలోనే ఆమోదం పొందాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment