nuclear power plants
-
ఆంధ్రా తీరంలో అణు కుంపట్లా?
‘అణువు గుండెను చీల్చిఅమిత శక్తిని పేల్చినరుడు తన్నును బాల్చిఓ కూనలమ్మా’ అన్నాడు ప్రముఖ కవి ఆరుద్ర.1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్ మీద అమెరికా జరిపిన అణుదాడుల్లో లక్షలాది మంది మరణించారు. అప్పటి నుంచి అణు శక్తికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 1979లో అమెరికాలోని త్రీమైల్ ఐలాండ్, 1986లో ఆనాటి సోవియట్ యూనియన్‌లోని చెర్నోబిల్, 2011లో జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రాల్లో జరిగిన దుర్ఘటనల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు బాగా తగ్గిపోయింది. చెర్నోబిల్ అణు దుర్ఘటన జరిగిన రోజున మరణించిన వారి సంఖ్య తక్కువే అయినా, ఆ రియాక్టర్ నుంచి విడుదలైన ప్రమాదకర రేడియేషన్ కారణంగా తర్వాతి కాలంలో లక్ష మంది మృత్యువాత పడ్డారు. యూరప్‌లోని 40 శాతం భూభాగం అణు దుష్ఫలితాల ప్రభావానికి గురైంది. ఈ ఉదంతం తర్వాత 22 దేశాల్లో 108 అణువిద్యుత్ ప్రాజెక్టులను నిలిపివేశారు.అందరూ వద్దనుకుంటుంటే...ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్టు – ప్రపంచమంతా అణు విద్యుత్ కేంద్రాలపై ఆధారపడటం తగ్గించి వేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి పాలకులు మాత్రం ఇంకా అణు విద్యుత్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు తిరస్కరించిన అణు విద్యుత్ కేంద్రాలను మన రాష్ట్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పట్లో ఆంధ్రా తీరంలోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో నిర్మించాలనుకున్న 12 భారీ అణు విద్యుత్ కేంద్రాల కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆగమేఘాల మీద వేలాది ఎక రాలు రైతుల నుంచి సేకరించింది. ఆ భూములు అలానే నిరుపయో గంగా ఉండగా, తాజాగా అనకాపల్లి జిల్లాలో ఎన్.టి.పి.సి. ఆధ్వ ర్యాన 2,800 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రానికి సుమారు రెండు వేల ఎకరాల భూమి సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. అంతే కాకుండా భూసేకరణ బాధ్యతను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మోదీ సర్కార్ అప్పగించింది. మోదీ మోజులో ఉన్న కూటమి పెద్దలు ఇకపై అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే సేకరించిన భూమి గురించి మాట్లా డరు, కానీ అనకాపల్లిలో మరో రెండు వేల ఎకరాల సేకరణకు త్వర లోనే నడుం బిగిస్తారు. కొన్ని ఇతర దేశాలతో పాటు మన దేశంలోని గుజరాత్, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, మహరాష్ట్ర ప్రజలు తిరస్కరించిన ఈ అణు విద్యుత్ కేంద్రాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే సామాజిక, పర్యా వరణ సమస్యలతో పాటు తీర ప్రాంతంలో భద్రతా పరమైన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.ఆంధ్రా తీరప్రాంత జిల్లాల్లో నిర్మించాలనుకుంటున్న అణు విద్యుత్ కేంద్రాలపై అంతర్జాతీయ సంస్థలైన మెక్ ఆర్థర్ ఫౌండేషన్, ఎన్.ఆర్.డి.సి. (నేషనల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్) గతంలో పలు అనుమానాలను వ్యక్తం చేశాయి. ఈ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘ద వరల్డ్ న్యూక్లియర్ ఇండస్ట్రీ స్టేటస్ రిపోర్ట్’లో ఆంధ్రాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న అణు విద్యుత్ కేంద్రాల గురించి ప్రముఖంగా ప్రస్తావించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలను కుంటున్న అణువిద్యుత్ కేంద్రాల వ్యయం సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వ్యయం కన్నా 10 నుంచి 12 రెట్లు ఎక్కువగా ఉంటుందనీ, యూనిట్ విద్యుత్ ధర సుమారు 12 నుంచి15 రూపాయల వరకూ ఉంటుంది కాబట్టి ఇవి ఆర్థికంగా ఏ మాత్రం లాభసాటి కాదనీ ఆ నివేదికలో పేర్కొన్నారు.భద్రతా సమస్యలుఇప్పటికే మనకు పాకిస్తాన్, చైనాలతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం భద్రతా పరంగా కూడా ప్రమాదకరమే. 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన పి.ఎన్.ఎస్. ఘాజీ అనే జలాంతర్గామి దాడి చేయడానికి విశాఖ తీరం వరకూ వచ్చిందన్న విషయం విస్మరించకూడదు. తీరానికి దగ్గరగా ఏర్పాటు చేసే ఈ అణు విద్యుత్ కేంద్రాలపై శత్రుదేశాలు దాడి చేస్తే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. అణు కేంద్రాలపై దాడి అనంతరం విడుదలయ్యే రేడియో ధార్మిక శక్తి కారణంగా అపార జన నష్టం సంభవిస్తుంది. దీనికి తోడు ఆంధ్ర తీర ప్రాంత జిల్లాలు తరచుగా తుపానులకు గురవుతున్నాయి. ఇటువంటి ప్రదేశాల్లో భారీ అణు రియాక్టర్లను ఏర్పాటు చేయాలనుకోవడం ప్రమాదకరమైన నిర్ణయ మవుతుంది.సాంకేతిక సమస్యలు1996లో ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ వాటా 17 శాతం ఉండగా, అది 2022వ సంవత్సరంలో 10 శాతానికి పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం, దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యం గల 22 అణు రియాక్టర్లు ఉంటే, వాటిలో తారాపూర్‌లో రెండు, కైగాలో రెండు, నరోరాలో రెండు, రాజస్థాన్‌లో ఒకటి, మద్రాస్‌లో ఒక యూనిట్ పూర్తిగానో, పాక్షికంగానో మూత పడ్డాయి. మన దేశ అణు రియాక్టర్లు నిత్యం సాంకేతిక లోపాలు ఎదుర్కొంటూ ఏనాడూ పూర్తి ఉత్పాదక సామర్థ్యంతో పనిచేయలేదు. మన దేశంలో థర్మల్ పవర్ ప్లాంట్లు 90 నుంచి 95 శాతం ఉత్పాదక సామర్థ్యంతో పని చేస్తుండగా అణు విద్యుత్ కేంద్రాలు తమ ఉత్పాదక సామర్థ్యంలో 40 శాతం మాత్రమే పని చేస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించింది. అందువల్ల ఈ అణు విద్యుత్ కేంద్రాలను తీరప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రానికి ఒనగూరే పెద్ద ప్రయో జనాలేమీ ఉండకపోగా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడమే మేలు!వి.వి.ఆర్.కృష్ణంరాజు వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుమొబైల్: 89859 41411 -
దేశంలో కొత్తగా 10 అణు విద్యుత్కేంద్రాలు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా పది అణువిద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. సోమవారం శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల సంబంధ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీలో ఈ వివరాలను సభ్యులకు అందజేసింది. 700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో గుజరాత్, రాజస్తాన్, హరియాణాల్లో వీటిని నెలకొల్పారు. గుజరాత్‌లోని కాక్రపార్‌లో రెండు అణు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి మొదలైందని కేంద్రం పేర్కొంది. అయితే వీటి నిర్మాణం చాలా ఆలస్యమవుతోందని కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘2007లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి కావస్తుండటం గ్రేట్. ‘సుప్రీం నేత’ కనుసన్నల్లో అభివృద్ధి వేగానికిది నిదర్శనం’’ అని ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. కాక్రపార్–3, కాక్రపార్–4 రియాక్టర్లు కాంగ్రెస్ హయాంలోనే ఆమోదం పొందాయన్నారు. -
ఇరాన్లో మరో 4 అణు విద్యుత్ ప్లాంట్లు
టెహ్రాన్: ఇరాన్ ప్రభుత్వం మొత్తం 5 వేల మెగావాట్ల సామర్థ్యముండే నాలుగు అణు విద్యుత్‌ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. దేశ తూర్పు తీర పట్టణం సిరిక్ సమీపంలో వీటి నిర్మాణం మొదలైందని ఇరాన్ అణు విభాగం అధిపతి మహ్మద్ ఎస్లామి తెలిపినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. సుమారు 20 బిలియన్ డాలర్ల(సుమారు రూ.1.64 లక్షల కోట్లు) వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుతో 4 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ఎస్లామి చెప్పారు. తొమ్మిదేళ్లలో వీటి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత ఏటా 35 టన్నుల అణు ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది. రష్యా సహకారంతో నిర్మించిన వెయ్యి మెగావాట్ల అణుప్లాంట్ ఇరాన్లో ఇప్పటికే పనిచేస్తోంది. -
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్‌తో లాభాలు... ► సౌర విద్యుత్‌కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్‌పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొవ్వాడ అణువిద్యుత్‌పై వెస్టింగ్ హౌస్‌తో చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: కొవ్వాడలో ఆరు అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకోసం వెస్టింగ్‌హౌస్ కంపెనీ (అమెరికా)తో చర్చలు జరుపుతున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. వెస్టింగ్ హౌస్ కంపెనీతో చర్చలు ముగిసిన అనంతరం అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకయ్యే ఖర్చు, నిర్మాణానికి పట్టే సమయం వంటి వివరాలతో ప్రాజెక్టు ప్రతిపాదనలు ఖరారవుతాయని వివరించారు. ప్రస్తుతానికి భూసేకరణ, ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన అనుమతులు పొందడం, ప్రాజెక్టు స్థలంలో భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం వంటి పనులు జరుగుతున్నాయని, అణు విద్యుత్ ప్రాజెక్టు కోసం 2,079 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 2,061 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, దీనిని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ పేరిట బదలాయించడం కూడా పూర్తయిందని ఆయన తెలిపారు. నిర్మాణ దశలో 8వేల మందికి, నిర్మాణం పూర్తిచేసుకుని విద్యుదుత్పత్తి ప్రారంభించిన అనంతరం ప్రతి యూనిట్లో 2 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. 564 మంది విద్యార్థులకు కేవీపీవై ఫెలోషిప్‌లు.. కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) పథకం కింద గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 564 మంది విద్యార్థులకు ఫెలోషిప్ అందించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. విజయ సాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. కేవీపీవైకి ప్రత్యేకించి నిధులు కేటాయింపు ఏదీ ఉండదని, ఇన్స్పైర్, ఇన్స్పైర్–షీ బడ్జెట్ కింద కేటాయించిన నిధులతోనే కేవీపీవై ప్రోగ్రాం అమలుచేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పరిశోధన రంగంలో ప్రతిభ, యోగ్యత కలిగిన విద్యార్థులను అధిక సంఖ్యలో గుర్తించేందుకు కేవీపీవై ప్రోగ్రాంను (ఎస్హెచ్ఈ) స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో అనుసంధానించినట్లు తెలిపారు. దీని ద్వారా ఔత్సాహికులు ప్రాథమిక, నేచురల్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం లభిస్తుందని అన్నారు. అలాగే, ఇన్స్పైర్–మానక్ కింద ఏటా దేశవ్యాప్తంగా 10 లక్షల ఐడియాల నుంచి లక్ష ఐడియాలను ఎంపికచేసి వాటిని ప్రతిపాదించిన ఒక్కో విద్యార్థి బ్యాంకు అకౌంట్లో నేరుగా రూ.10 వేలు జమచేస్తున్నట్లు తెలిపారు. ఏపీ హైకోర్టులో ఐదు న్యాయమూర్తుల ఖాళీలు ఏపీహైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను గత నెల 30 వరకు 32 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుతం ఇక్కడ ఐదు న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉండగా, ఒక ఖాళీ ప్రతిపాదన ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీ జియం వద్ద పెండింగ్‌లో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. -
అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పీఎస్‌యూలు
నాగ్‌పూర్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) పెద్ద ఎత్తున పాలు పంచుకోనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం పీఎస్‌యూలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేలా న్యూక్లియర్ రంగ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్), ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జాయింట్ వెంచర్లకు వెసులుబాటు కల్పిస్తూ 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దాదాపు అన్ని అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించే ఎన్పీసీఐఎల్ మరింతగా కార్యకలాపాలు విస్తరించేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ, నాల్కో పవర్ కంపెనీ మొదలైన వాటితో జేవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 6,780 మెగావాట్లుగా ఉంది. మరో 21 యూనిట్ల ఏర్పాటుతో 2031 నాటికి దీన్ని 15,700 మెగావాట్లకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
Nuclear Power Plants: దేశంలో 21 అణు విద్యుత్ కేంద్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 21 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు పీఎంవో మంత్రిత్వశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. కార్బన్ ఉద్గారాలను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలలో భాగంగా 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సమకూర్చుకుంటుందని గ్లాస్కోలో జరిగిన కాప్26 సదస్సులో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. తద్వారా దేశ ఇంధన అవసరాలలో 50 శాతం మేర పునరుత్పాదక ఇంధనం ద్వారా పొందేలా అణు విద్యుత్ ఉత్పాదనపై దృష్టి సారించినట్లు తెలిపారు. చదవండి: కేంద్రంలో 9 లక్షల ఉద్యోగ ఖాళీలు.. విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు దేశంలో నెలకొల్పుతున్న అణు రియాక్టర్లలో 8700 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన 11 రియాక్టర్లలో కొన్ని ఇప్పటికే ప్రారంభ అయ్యాయని, మరికొన్ని వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇవికాకుండా 700 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మరో 10 అణు రియాక్టర్ల స్థాపనకు ప్రభుత్వం ఆర్థిక, పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్లుల్లో పనులు చురుగ్గా సాగుతుండగా కొన్ని చోట్ల పలు కారణాల వలన పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. అణు రియాక్టర్ల ఏర్పాటుకు అవసరమైన కీలక పరికరాల సరఫరాలో అవాంతరాలు, ఆర్థిక సమస్యలు, ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతతోపాటు కోవిడ్ మహమ్మారి వంటి కారణాల వలన రియాక్టర్ల నిర్మాణంలో జాప్యం చోటుచేసుకున్నట్లు వివరించారు. -
Russia Ukraine war: కీవ్‌లో క్షిపణుల మోత
కీవ్: ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తుండడం పట్ల రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకార చర్యలు ప్రారంభించింది. పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేయడమే లక్ష్యంగా రష్యా సైన్యం ఆదివారం తెల్లవారుజామునే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. గత ఐదు వారాలుగా ప్రశాంతంగా ఉన్న కీవ్ మిస్సైళ్ల మోతతో దద్దరిల్లిపోయింది. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు అందజేసిన యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. తమ సైన్యం అత్యంత కచ్చితత్వం కలిగిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. యూరప్ దేశాలు ఇచ్చిన టీ–72 యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఖండించింది. కీవ్‌లో రైల్వే స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలపైనా రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. రష్యా క్షిపణులు కీవ్ సమీపంలోని డార్నిట్స్కీ, డినిప్రోవ్స్కీ జిల్లాలను వణికించాయి. కీవ్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని అణు విద్యుత్ కేంద్రంపై క్రూయిజ్ మిస్సైల్‌ను ప్రయోగించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్లో పలు నగరాలు, గ్రామాలపై రష్యా సైన్యం మిస్సైళ్లు ప్రయోగించింది. గిర్స్కీలో 13, లీసిచాన్‌స్క్‌లో 5 ఇళ్లు దెబ్బతిన్నాయి. క్రామటోర్‌స్క్‌లోనూ వైమానిక దాడులు కొనసాగాయి. ఖర్కీవ్‌లోని చెర్కాస్కీ తీస్కీ గ్రామంలో రష్యా దళాలు ఫాస్ఫరస్ ఆయుధాలు ప్రయోగించాయని ఉక్రెయిన్ ఆరోపించింది. డోన్బాస్లో కీలకమైన సీవిరోడోంటెస్క్ సిటీలో 80శాతం మేర రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మృతిచెందిన ఇరు పక్షాల సైనికుల మృతదేహాలను పరస్పరం మార్చుకొనే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యింది. దక్షిణ జపొరిఝాజియాలో 160 మృతదేహాలను మార్చుకున్నట్లు ఉక్రెయిన్ యంత్రాంగం ప్రకటించింది. దయచేసి యుద్ధం ఆపండి: పోప్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఇకనైనా ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ రష్యాకు మళ్లీ విజ్ఞప్తి చేశారు. ‘దయచేసి ప్రపంచాన్ని నాశనం చేయకండి’ అని ఆదివారం ఆయన విన్నవించారు. యుద్ధం కారణంగా బాధితులుగా మారుతున్న ప్రజల రోదనలు వినాలని ఉక్రెయిన్, రష్యా అధినేతలను పోప్ కోరారు. -
ఇర్మా ఎఫెక్ట్ : ఫ్లోరిడాలో ’అణు’ టెన్షన్
-
వైఎస్‌తో నాకు అత్యంత స్నేహబంధం: దిగ్విజయ్ సింగ్
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు అత్యంత స్నేహ సంబంధం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. మహానేత జయంతి సందర్భంగా ఆయన వైఎస్ఆర్ను తలచుకున్నారు. కాపు నేతలపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారని, చంద్రబాబు నియంత.. మోసకారి అని ఆయన మండిపడ్డారు. అణు విద్యుత్ కేంద్రాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే.. దాని భద్రత, ఇతర విషయాల్లో మాత్రం బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇక జకీర్ నాయక్‌తో తనకు ఉన్న సంబంధాలపై మీడియాలో వస్తున్న కథనాల మీద కూడా డిగ్గీరాజా స్పందించారు. 2012 సంవత్సరంలో ముంబై నగరంలో జకీర్ ఆహ్వానించడంతో ఓ కార్యక్రమానికి హాజరైన తాను.. అక్కడ మత సామరస్యం గురించే మాట్లాడానని చెప్పారు. నాడు తాను ఏం మాట్లాడానో దానికే కట్టుబడి ఉన్నానని అన్నారు.