వైఎస్తో నాకు అత్యంత స్నేహబంధం: దిగ్విజయ్ సింగ్ | I have immense friendship with ys rajasekhar reddy, says digvijaya singh | Sakshi
Sakshi News home page

వైఎస్తో నాకు అత్యంత స్నేహబంధం: దిగ్విజయ్ సింగ్

Published Thu, Jul 7 2016 2:38 PM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

వైఎస్తో నాకు అత్యంత స్నేహబంధం: దిగ్విజయ్ సింగ్ - Sakshi

వైఎస్తో నాకు అత్యంత స్నేహబంధం: దిగ్విజయ్ సింగ్

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు అత్యంత స్నేహ సంబంధం ఉందని  కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. మహానేత జయంతి సందర్భంగా ఆయన వైఎస్ఆర్ను తలచుకున్నారు. కాపు నేతలపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారని, చంద్రబాబు నియంత.. మోసకారి అని ఆయన మండిపడ్డారు.

అణు విద్యుత్ కేంద్రాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే.. దాని భద్రత, ఇతర విషయాల్లో మాత్రం బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇక జకీర్ నాయక్తో తనకు ఉన్న సంబంధాలపై మీడియాలో వస్తున్న కథనాల మీద కూడా డిగ్గీరాజా స్పందించారు. 2012 సంవత్సరంలో ముంబై నగరంలో జకీర్ ఆహ్వానించడంతో ఓ కార్యక్రమానికి హాజరైన తాను.. అక్కడ మత సామరస్యం గురించే మాట్లాడానని చెప్పారు. నాడు తాను ఏం మాట్లాడానో దానికే కట్టుబడి ఉన్నానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement