వైఎస్సార్‌లాంటి గొప్ప నేతను తయారు చేసుకోలేకపోయాం: దిగ్విజయ్ | we con't Make a ysr unother leader Digvijay | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌లాంటి గొప్ప నేతను తయారు చేసుకోలేకపోయాం: దిగ్విజయ్

Published Sat, May 3 2014 1:06 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

వైఎస్సార్‌లాంటి గొప్ప నేతను  తయారు చేసుకోలేకపోయాం: దిగ్విజయ్ - Sakshi

వైఎస్సార్‌లాంటి గొప్ప నేతను తయారు చేసుకోలేకపోయాం: దిగ్విజయ్

 విజయవాడ: వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాదంలో చనిపోయిన తర్వాత అంత గొప్ప నాయకుడిని తయారుచేసుకోలేకపోయామని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడలో ‘మీట్‌ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ... 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి పలు సంక్షేమ పథకాలను అమలుచేయడం ద్వారా కాంగ్రెస్‌ను బలోపేతం చేశారని కొనియాడారు. అయితే ఆయన ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ లోటు పూడ్చుకోలేకపోయామన్నారు.

కిరణ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన పార్టీని ముంచివేయడమే కాకుండా పార్టీ నుంచి వెళ్లిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌లో లబ్ధి పొందినవారంతా పార్టీని వీడివెళ్లిపోయారని, కార్యకర్తలు మాత్రమే  అండగా నిలబడ్డారని చెప్పారు. సీనియర్లను కాదని పదేళ్లపాటు కేంద్రమంత్రి పదవి ఇస్తే దగ్గుబాటి పురందేశ్వరి పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయారని దుయ్యబట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement