వైఎస్ వల్లే చంద్రబాబు డబ్బును ఓడించగలిగాం: దిగ్విజయ్ | we could defeat chandra babu money power with ys rajasekhar reddy leadership, says digvijay singh | Sakshi
Sakshi News home page

వైఎస్ వల్లే చంద్రబాబు డబ్బును ఓడించగలిగాం: దిగ్విజయ్

Published Tue, Nov 1 2016 10:23 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

వైఎస్ వల్లే చంద్రబాబు డబ్బును ఓడించగలిగాం: దిగ్విజయ్ - Sakshi

వైఎస్ వల్లే చంద్రబాబు డబ్బును ఓడించగలిగాం: దిగ్విజయ్

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిర్మాణ కంపెనీలను కాదని ఆయన సింగపూర్‌వైపు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. మన వాళ్ల వద్ద కూడా మంచి టెక్నాలజీ అందుబాటులో ఉందని చెప్పారు. నాగార్జున సాగర్ లాంటి డ్యాంలు కట్టిన మన భారతీయ కాంట్రాక్టర్లు.. కేవలం డ్రెయిన్లు మాత్రమే కట్టగలరని చంద్రబాబు అంటున్నారని, ఆయన ఆలోచన తీరు ఇలా ఉందని అన్నారు. ఎన్నికల్లో డబ్బు గురించి ఎమ్మెల్యేలు ఆందోళన చెందవద్దని, ప్రతి అభ్యర్థికి రూ. 10 కోట్ల వంతున ఇస్తామని ఆయన బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు. 2004 ఎన్నికలకు ముందు కూడా ఆయన అలాగే చేశారని, కానీ కాంగ్రెస్ హయాంలో వైఎస్ నాయకత్వ పటిమతో ఈయన డబ్బును తాము ఓడించగలిగామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు బీజేపీతో రాజీపడుతున్నారని విమర్శించారు. 
 
 
ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందని.. ఆయనను కేవలం ఒక ఆర్ఎస్ఎస్ నేతగా చూపే ప్రయత్నం చేస్తోందని దిగ్విజయ్ విమర్శించారు. 31 అక్టోబర్‌ను ఇందిర వర్ధంతి సందర్భంగా జాతీయ సమగ్రతా దినంగా ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు ఈ అంశంపై వాళ్లు వివాదం చేస్తున్నారని అన్నారు. మహాత్మాగాంధీ కళ్లజోడును కూడా స్వచ్ఛభారత్‌ ప్రచారం కోసం వాడుకుంటున్నారని.. ఆయన శాంతి ప్రవక్త అన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారని అడిగారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లు మాత్రం కేవలం తమ కార్యక్రమాలనే హైలైట్ చేసుకుంటున్నాయని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement